Priyamani: షారుఖ్ ఖాన్ కోసమే ఆ పనిచేశా, అది ఆయన దగ్గరే నేర్చుకున్నా - ప్రియమణి
Priyamani: ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాలో షారుఖ్‌తో కలిసి స్టెప్పులేసింది ప్రియమణి. ఆ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంది.
Priyamani about Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎంతోమంది సౌత్ నటీనటులు కూడా కలలు కంటుంటారు. అలాంటి వారిలో హీరోయిన్ ప్రిమయణి కూడా ఒకరు. దాదాపు సౌత్‌లోని అన్ని భాషల్లో హీరోయిన్‌గా నటించిన తర్వాత షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ ఐటెమ్ సాంగ్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అసలు ఆ ఐటెమ్ సాంగ్‌ను చేయడం వెనుక అసలు కారణమేంటో తాజాగా ప్రియమణి బయటపెట్టింది. హీరోయిన్‌గా బిజీగా ఉన్నా కూడా ఐటెమ్ సాంగ్‌కు ఒప్పుకోవడానికి షారుఖ్ ఖానే కారణమని రివీల్ చేసింది.
ఎన్నో ఆఫర్లు..
‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాలో ‘1234 గెట్ ఆన్ ది డ్యాన్స్ ఫ్లోర్’ అనే ప్రత్యేక గీతంలో కనిపించింది ప్రియమణి. ఆ పాట వల్ల తనకు చాలా క్రేజ్ వచ్చిందని, ఎన్నో సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌కు తనకు వరుసగా అవకాశాలు కూడా వచ్చాయని తాజాగా రివీల్ చేసింది. కేవలం స్పెషల్ పాటల కోసం మాత్రమే తాను సినిమాల్లో ఉండాలని అనుకోవడం లేదని తన అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే వాటన్నింటిని రిజెక్ట్ చేశానని తెలిపింది. ‘‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో పాటను కేవలం షారుఖ్ ఖాన్ కోసమే చేశాను. ఎందుకంటే ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన పక్కన కనిపించాలని అనుకునేదాన్ని’’ అని ప్రియమణి చెప్పుకొచ్చింది.
చాలా మంచివారు..
షారుఖ్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న తర్వాత తన అనుభవం ఎలా ఉందో బయటపెట్టింది ప్రియమణి. ‘‘షారుఖ్ ఖాన్ చాలా మంచివారు. నన్ను మనస్ఫూర్తిగా వెల్‌కమ్ చేశారు. ఆయనను ద్వేషించేవారు ఉన్నా కూడా ప్రేమించేవారు అంతకంటే ఎక్కువమంది ఉన్నారు. ఆయన చాలా మర్యాద గల వ్యక్తి, చాలా సున్నితమైన మనసున్నవారు. కేవలం మహిళలతో మాత్రమే కాకుండా అందరితో చాలా మంచిగా, గౌరవంగా నడుచుకుంటారు. అందరితో మంచిగా ఉండాలన్నది నేను ఆయనను చూసే నేర్చుకున్నాను’’ అంటూ షారుఖ్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపించింది ప్రియమణి. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో కనిపించిన చాలా ఏళ్ల తర్వాత ‘జవాన్’తో మరోసారి తనకు షారుఖ్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం లభించింది.
లక్ష్మి పాత్రకు ప్రశంసలు..
అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’ మూవీలో షారుఖ్ ఖాన్ సరసన హీరోయిన్‌గా దీపికా పదుకొనె, నయనతార నటించగా.. ప్రియమణి కూడా ఒక కీలక పాత్రలో కనిపించింది. లక్ష్మి అనే పాత్రలో ప్రియమణి పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెళ్లయిన తర్వాత చాలాకాలం యాక్టింగ్‌కు గ్యాప్ ఇచ్చిన ఈ భామ.. బుల్లితెరపై ఒక డ్యాన్స్ షోకు జడ్జిగా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అది తన కెరీర్‌కు చాలా ప్లస్ అయ్యింది. అప్పటినుండి ప్రియమణికి మళ్లీ సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యింది. వెంకటేశ్ హీరోగా నటించిన ‘నారప్ప’తో తెలుగులో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం దాదాపు అన్ని సౌత్ భాషల్లో అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా గడిపేస్తోంది.
Also Read: సాయి ధరమ్ తేజ్ ‘గాంజా శంకర్’ టీమ్‌కు నోటీసులు - చట్టపరమైన చర్యలు తప్పవంటూ వార్నింగ్