Prithviraj Sukumaran: మరో లగ్జరీ కారు కొన్న 'సలార్' నటుడు పృథ్వీరాజ్ - దాని ధరెంతో తెలుసా?
Prithviraj Sukumaran Buys Luxuy Car: మలయాళ స్టార్ హీరో, సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ లగ్జరీ కారు కొన్నారు. ఈ లగ్జరీ కారు పోర్షే ఇండియా ప్రతినిథులు అందిస్తున్న వీడియో వైరల్ అవుతుంది.
Prithviraj Sukumaran Buys Swanky Porsche Car: మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు. సౌత్‌లో స్టార్ హీరోగా, నిర్మాతగా రాణిస్తున్న ఆయన నార్త్ వరకు ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. సలార్‌తో తెలుగులో ఆడియన్స్‌కి దగ్గరయ్యారు. ఇక ఆడు జీవితంతో వరల్డ్ వైడ్‌గా పరిచయం అయ్యారు. ఇక ప్రస్తుతం వరుస సక్సెస్‌తో పుల్ జోష్‌లో ఉన్న ఆయన తాజాగా సరికొత్త లగ్జరీ కారును కొనుగోలు చేశారు. సరికొత్త పోర్షే మోడల్ కారును తన కారు గ్యాలరీ లో చేర్చారు. ఈ లగ్జరీ కారు విలువ దాదాపు రూ.3 కోట్లుగా ఉన్నట్లు సమాచారం.
ఆయన కారును కొన్నట్టుగా ఈ బ్రాండ్ కారు షో రూం వారు షేర్ చేశారు. ఆయన పోర్షే ఇండియా ప్రతినిథులతో మాట్లాడుతున్నప్పటి నుంచి కారు కీ ఆయన అందించడం.. ఆ తర్వాత ఆయన డ్రైవ్ చేయడం వరకు వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఆయన భార్య సుప్రియా మీనన్ కూడా ఉన్నారు. కాగా ఇప్పటికే ఇప్పటికే పృథ్వీరాజ్ కారు గ్యాలరీలో లంబోర్గిని, పోర్స్చే, టాటా సఫారి, మినీ కూపర్ లాంటి మోడల్ కార్లు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో పోర్షే లగ్జరీ కారు కొన్నారు. ఇటీవల ఆయన హిందీ చిత్రం 'బడే మియాన్ చోటే మియాన్'లో నటించారు.
ప్రస్తుతం పృథ్వీరాజ్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. మలయాళంలో ఆయన ఎల్2: ఎంపురాన్ మూవీతో బిజీగా ఉన్నారు. అలాగే లూసిఫర్‌కి సీక్వెల్‌లోనూ నటిస్తున్నారు. ఈ మూవీలో నటించడమే కాకుండా ఆయనే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గుజరాత్‌లో జరుగుతుంది. ఇప్పటికే కేరళ, న్యూఢిల్లీ, లడఖ్, యూఎస్ఏ, యూకే లొకేషన్లలో మూవీ చిత్రీకరించారు. ఇక ఇటీవల ఆయన నటించిన ఆడు జీవితం మూవీ వరల్డ్ వైడ్‌గా భారీ వసూళ్లు చేసింది. మాలయాళంలో ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. మార్చి 28న విడుదలైన ఈ సినిమా మొత్తం థియేట్రికల్ రన్‌లో సుమారు రూ.150కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు చేసింది.
View this post on Instagram
ఇక అతి తక్కువ టైంలోనే రూ. 100 గ్రాస్ వసూళ్లు చేసిన తొలి మలయాళ సినిమాగా ఆడు జీవితం నిలిచింది. వరల్డ్ వైడ్ సంచలన విజయం సాధించిన ఈ సినిమా నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. బెన్యామిన్ రాసిన 'ఆడు జీవితం' (గోట్ డేస్) నవల ఆధారంగా బ్లెస్సీ ఈ సినిమాను రూపొందించారు. బతుకు దెరువు కోసం ఆరబ్ దేశానికి వెళ్లిన మలయాళీ యువకుడు నజీబ్ జీవిత కథ ఇది. అక్కడ ఎడారి దేశంలో అతడు ఎదుర్కొన్న కష్టాలను తెరపై ఎక్కించారు. ఇందులో సుకుమార్ లీడ్ రోల్లో నటించగా.. ఆయన భార్య పాత్రలో అమలా పాల్ నటించింది. ఈ సినిమా షూటింగ్ దాదాపు 16 ఏళ్ల పాటు జరిగింది ఎట్టకేలకు ఈ ఏడాది మార్చిలో విడుదలైంది.
Also Read: పెళ్లి పోస్ట్‌పై అలాంటి కామెంట్స్ - ట్రోలర్స్‌కి సోనాక్షి సిన్హా స్ట్రాంగ్ కౌంటర్