అన్వేషించండి

Salaar: ప్రభాస్ వల్లే 'సలార్'కి 'A' సర్టిఫికేట్ వచ్చింది - ప్రశాంత్ నీల్

Prashanth Neel : సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజా ఇంటర్వ్యూలో సినిమాకి 'A' సర్టిఫికెట్ రావడంపై క్లారిటీ ఇచ్చారు.

Salaar Director Prashanth Neel Latest Interview : కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ -పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 'సలార్' మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ భారీ రెస్పాన్స్ ని అందుకొని సినిమాపై అంచనాలను పెంచేసింది. డార్లింగ్ ఫాన్స్ ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక రిలీజ్ దగ్గర పడటంతో మూవీ టీం రాజమౌళి తో స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృధ్విరాజ్ సుకుమారన్ ఈ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకు సంబంధించి అనేక విషయాలను పంచుకున్నారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్‌కు 'A' సర్టిఫికెట్ రావడంపై క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా ప్రభాస్ సినిమా అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్ చూస్తారు. అలాంటిది ‘సలార్’ సినిమాకి సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికెట్ ఇవ్వడం అందరినీ షాక్‌కు గురి చేసింది. రీసెంట్‌గా 'యానిమల్' మూవీకి 'A' సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమాలో ఎక్కువగా బోల్డ్ సీన్స్ ఉన్నాయి కాబట్టి 'A' సర్టిఫికెట్ ఇవ్వడంలో తప్పులేదు. కానీ సలార్ మూవీకి 'A' సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు అనే విషయం చాలామందికి అర్థం కాలేదు.

ఇదే విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. "సలార్ ప్రివ్యూ అయ్యాక సెన్సార్ అధికారులు చాలా కట్స్ చెప్పారు. దానికి నాకు ఇష్టం లేకపోయినా ఓకే చెప్పాను. కానీ ప్రత్యేకంగా కొన్ని కట్స్ మాత్రం కథలోని ఫ్లోని దెబ్బతీస్తాయని భావించి.. ఏం చేద్దామని ప్రభాస్ ని అడిగితే సింపుల్ గా 'A' సర్టిఫికెట్ తీసుకోమని చెప్పాడు. దాంతో మరుక్షణం ఆలోచించకుండా కట్స్ వద్దని చెప్పేసాను. ఫలితంగా 'U/A బదులు 'A' సర్టిఫికెట్ మాత్రమే వచ్చింది" అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా సలార్ లో తాను చూపించింది అవసరమైన రక్తపాతమే తప్ప బలవంతంగా ఇరికించిన హింస ఏమాత్రం కాదని, ఇందులో రొమాన్స్, సెక్స్, సెట్ సాంగ్స్ ఇవేమీ ఉండవని మరోసారి క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ నీల్.
Salaar: ప్రభాస్ వల్లే 'సలార్'కి 'A' సర్టిఫికేట్ వచ్చింది - ప్రశాంత్ నీల్

ఇక ఇదే ఇంటర్వ్యూలో సినిమాలో ప్రభాస్ పోషించిన దేవా క్యారెక్టర్రైజేషన్ పై మాట్లాడిన ప్రశాంత్ నీల్," ప్రభాస్ ముఖంలో ఒక అమాయకత్వం ఉంటుంది. అది తనలోని ఒక పసి కోణాన్ని చూపిస్తుంది. అలాగే ఒక సింహాన్ని కూడా చూపిస్తుంది. ఇదే కోవలో సలార్ సినిమాలో తాను చేసిన దేవా క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. అవసరమైతే కాళ్లు పట్టుకుంటాడు. లేదంటే తలకు కూడా నరుకుతాడు" అంటూ సింగిల్ లైన్ లో సలార్ లో ప్రభాస్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందనేది చెప్పాడు. దీంతో ప్రశాంత్ నీల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : DJ టిల్లుని ఆడేసుకున్న మంచు మనోజ్ - నవ్వులు పూయిస్తున్న 'ఉస్తాద్' లేటెస్ట్ ప్రోమో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget