అన్వేషించండి

Prasanth Varma: సినిమాటిక్ యూనివర్స్ ఆలోచన అలా వచ్చింది, బడ్జెట్ లేక తప్పులు జరిగాయి - ప్రశాంత్ వర్మ

Prasanth Varma: ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో అసలు సినిమాటిక్ యూనివర్స్ అనే ఆలోచన ఎలా మొదలయ్యిందో బయటపెట్టాడు ప్రశాంత్.

Prasanth Varma about Cinematic Universe: సంక్రాంతి కానుకగా విడుదలయిన ‘హనుమాన్’ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం కలెక్షన్స్ విషయంలోనే కాదు.. మౌట్ టాక్ పరంగా కూడా ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని అర్థమవుతోంది. సినిమా హిట్ అయిన తర్వాత కూడా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంకా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ‘హనుమాన్’ను ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. అంతే కాకుండా తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్..

‘‘ముందు హనుమాన్ తీయాలని అనిపించిన తర్వాత యూనివర్స్ బిల్డ్ అయ్యింది. ముందుగా ఈ ఒక్క సినిమా గురించే ఆలోచించాం. మన పురాణాల్లో నుంచి ఏ క్యారెక్టర్‌ను తీసుకొని హీరోగా సెలక్ట్ చేసుకోవాలి అని ముందు ఆలోచించాం. హనుమంతుడికి ఉన్న పవర్స్, ఆయన చేసే అల్లరి.. ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఇంద్రుడిని ఇష్టపడేవాళ్లు ఉంటారు, ఇష్టపడనివాళ్లు ఉంటారు. కానీ హనుమంతుడిని ఇష్టపడనివారు ఉండరు. ఆయన యూనివర్సల్ హీరో. అందుకు ఇలా ప్రారంభించాం. కానీ ఈ క్రమంలో ఎందుకు కేవలం హనుమంతుడితే చేయాలి. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. అందరి నుంచి తీసుకుందాం. పెద్దగా బిల్డ్ చేద్దామనుకొని అక్కడి నుంచి బిల్డ్ చేశాం’’ అంటూ అసలు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఆలోచన ఎలా వచ్చిందో బయటపెట్టాడు దర్శకుడు.

టీజర్ తర్వాతే రూటు మార్చాం..

‘‘మేము ముందుగా అనుకున్న దానికంటే టీజర్‌కు 10 రెట్లు ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. వీఎఫ్‌ఎక్స్ ఎక్కువగా ఉండే సినిమా చేద్దామని అనుకోలేదు. ఎంటర్‌టైనింగ్, సూపర్ హీరో సినిమా చేద్దామనుకున్నాం. కానీ టీజర్‌లో ఉన్న వీఎఫ్ఎక్స్ షాట్స్‌కు ఎక్కువ ఆదరణ వచ్చింది. సినిమా నుంచి వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఆశిస్తున్నారని అర్థమయ్యింది. హనుమాన్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత నేను మామూలుగా బయట ఎక్కడైనా కనిపించినప్పుడు వచ్చి మీ సినిమా వీఎఫ్ఎక్స్ ఎలా వస్తున్నాయని అడిగేవారు. అందుకే మేము అనుకున్న దానికంటే 3 రేట్లు రేంజ్ పెంచాం’’ అంటూ వీఎఫ్ఎక్స్‌కు తనకు సాయంగా ఉన్న వెంకట్ కుమార్ శెట్టికి ప్రత్యేక క్రెడిట్స్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ.

అంత బడ్జెట్ లేదు..

మామూలుగా ఇలాంటి సినిమాలకు వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్‌గా ఒక వ్యక్తి ఉండాలని, కానీ అలాంటి వ్యక్తిని పెట్టుకోవడం కోసం వారి దగ్గర బడ్జెట్ లేదని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. అదే క్రమంలో కొన్ని తప్పులు కూడా జరిగాయని చెప్పాడు. అలా వీఎఫ్ఎక్స్ కోసం కష్టపడిన ప్రతీ కంపెనీ గురించి, ప్రతీ వ్యక్తి గురించి ప్రత్యేకంగా తెలిపాడు ప్రశాంత్. ఇలా అందరూ కష్టపడి పనిచేసినందుకే ‘హనుమాన్’లోని గ్రాఫిక్స్‌కు మంచి ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా హనుమంతుడు వచ్చే సీన్స్‌ను స్క్రీన్‌పై చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. వీరితో పాటు వరలక్ష్మి శరత్‌కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించింది. ‘హనుమాన్’ వల్ల తేజ సజ్జా.. రూ.100 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయిన 8వ తెలుగు హీరోగా రికార్డ్ దక్కించుకున్నాడు.

Also Read: ‘జై హనుమాన్‌’లో భల్లాల దేవుడు? ‘హను మాన్’లో ఆంజనేయుడి కళ్లు ఆయనవేనట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Bumrah 5 Wicket Haul: బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Embed widget