అన్వేషించండి

Hanuman OTT: ఓటీటీలో 'హనుమాన్‌' రికార్డుల వేట - 11 గంటల్లోనే అత్యధిక మిలియన్ల వ్యూస్‌, ఆ రికార్డ్స్ బ్రేక్!  

Hanuman OTT Record: నిన్న ఓటీటీకి వచ్చిన హనుమాన్‌ చిత్రం కొద్ది గంటల్లోనే రికార్డుల వేట మొదలుపెట్టింది. విడుదలైన 11 గంటల్లోనే అత్యధిక వ్యూయర్‌ షిప్‌తో వరల్డ్‌ వైడ్‌గా టాప్‌ వన్‌ స్థానంలో నిలిచింది.

Prasanth Varma OTT Record: రీసెంట్‌ బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ హనుమాన్‌ మూవీ ఓటీటీకి వచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 16న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం సరిగ్గా రెండు నెలలకు ఓటీటీకి వచ్చింది. స్ట్రీమింగ్‌ ముందు వరకు హనుమాన్‌ ఓటీటీ రిలీజ్‌, ఓటీటీ పార్ట్‌నర్‌పై క్లారిటీ లేదు. దీంతో తెలుగు ఆడియన్స్‌ అంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారు. ఇంకేప్పుడు ఈ మూవీని ఓటీటీకి తీసుకువస్తారంటూ మేకర్స్‌, మూవీ టీంపై అసహనం చూపించారు.

ఇక వారందరి ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ సడెన్‌గా ఆదివారం హనుమాన్‌ ఓటీటీ తెలుగు వెర్షన్‌ వచ్చేసింది. ముందు రోజు హిందీ వెర్షన్‌ను రిలీజ్‌ చేయగా ఆ నెక్ట్స్‌ డే తెలుగు వెర్షన్‌ స్ట్రీమింగ్‌కు ఇచ్చి సినీ ప్రియులను సర్‌ప్రైజ్‌ చేసింది జీ5. ఇక బక్సాఫీసు వద్ద వసూళ్లలో రికార్డు స్రష్టించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోను సంచలనం రేపుతుంది. ఇలా స్ట్రీమింగ్‌కు వచ్చిందో లేదో గంటల్లోనే రికార్డుల వేట మొదలుపెట్టింది. ప్రస్తుతం హనుమాన్‌ ఓటీటీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. నిన్న Zee5లో స్ట్రీమింగ్‌ వచ్చిన 'హనుమాన్‌' విడుదలైన 11 గంటల్లోనే 102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను నమోదు చేసుకుంది.

దీంతో జీ5లో మునుపటి రికార్డును బ్రేక్‌ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా అతితక్కువ టైంలోనే అత్యధిక వ్యూస్‌ అత్యధిక వ్యూయర్‌ షిప్‌ అందుకున్న సినిమాగా హనుమాన్‌ అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ వరల్డ్‌ వైడ్‌గా ఓటీటీలో ట్రెండింగ్‌లో నిలిచింది. దీంతో జీ5లో మునుపటి రికార్డులన్నీ బద్దలు కొట్టేసి ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది ఈ ప్రశాంత్‌ వర్మ విజువల్‌ వండర్‌. ప్రస్తుతం హనుమాన్‌ ఓటీటీలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. విడుదలైన ఒక్క రోజులోనే అరుదైన రికార్డు సొంతంగా చేసుకున్న ఈ సినిమా ఇక మున్ముందు ఇంకేన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి. 

Also Read: 50 సెకన్ల యాడ్‌కే నయన్‌కు ఇంత భారీ పారితోషకమా? - స్టార్‌ హీరోలు కూడా ఈ రేంజ్‌లో తీసుకోలేదేమో! 

యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో కుర్ర హీరో తేజ సజ్జ-అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా హనుమాన్‌ మూవీ తెరకెక్కింది. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 16న విడుదలై రికార్డ్స్‌ బ్రేక్‌ చేసింది. చిన్న సినిమాగా వచ్చిన సంచలన విజయం సాధించింది. కేవలం రూ. 40 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం థియేట్రీకల్‌ రన్‌లో దాదాపు రూ. 400 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. మొదటి పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోయిన హనుమాన్‌ ఒకేసారి 11 భాషల్లో రిలీజైన సంగతి తెలిసిందే. అన్ని భాషల్లో ఈ సినిమా భారీ విజయం సాధించింది. సూపర్‌ హీరో జానర్‌కి హనుమాన్‌ పాత్రను జతచేసి ప్రశాంత్‌ వర్మ విజువల్‌ వండర్‌ క్రియేట్‌ చేశాడు. ఈ చిత్రంలో ఆయన పనితీరుకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. తక్కువ బడ్జెట్‌లో హాలీవుడ్‌ రేంజ్‌లో విజువల్‌ వండర్‌ చూపించాడంటూ అంతా అతడిని కొనియాడారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Embed widget