Baahubali The Epic Trailer : ట్రెండింగ్‌లో 'బాహుబలి: ది ఎపిక్' - కొత్త ట్రైలర్ చూశారా?... రిలీజ్‌కు ముందే బిగ్ సర్‌ప్రైజ్
Baahubali Trailer Reaction: 'బాహుబలి: ది ఎపిక్' ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుండగా తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ట్రెండ్ అవుతోంది. రెండు పార్టుల్లోనూ కీలక సీన్స్‌తో ట్రైలర్ కట్ అదిరిపోయింది.

Prabhas's Baahubali The Epic Release Telugu Trailer Out Now: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చిన మూవీ. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన అద్భుతం... దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ 'బాహుబలి'. ఈ మూవీ రిలీజై పదేళ్ల పూర్తైన సందర్భంగా రెండు పార్టులను కలిపి 'బాహుబలి: ది ఎపిక్'గా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంటుండగా... తాజాగా రిలీజ్ చేసిన మరో ట్రైలర్ ట్రెండ్ అవుతోంది.
బాహుబలి తిరిగొచ్చాడు
'ఇద్దరు సోదరులు... ఓ సింహాసనం... ఇద్దరు మహిళలు... ఒక యుద్ధం... రెండు వాగ్ధానాలు... ఒక ఉల్లంఘన... రెండు చిత్రాలు... ఒక అనుభవం' అంటూ ఆసక్తికరంగా ట్రైలర్ కట్ చేశారు. 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కంక్లూజన్' మూవీస్ రెండూ కలిపి ఒకే మూవీగా కీలక సీన్స్ అన్నీ కవర్ అయ్యేలా ఉన్న ట్రైలర్ ట్రెండ్ అవుతోంది. 'నేను రాజైతే నువ్వే నా సేనాధిపతివి', 'వచ్చే విజయదశమికి అదే ముహూర్తంలో భళ్లాల దేవుడికిి మహారాజ పట్టాభిషేకం', 'మీరు మాహిష్మతి సింహాసనాన్ని అధిష్టించాలి. అదే నా కోరిక', 'నేను మాటిస్తున్నా... దేవసేన నీది.' అనే డైలాగ్స్ మొత్తం మూవీనే కళ్లకు కట్టేలా చూపించారు.
Also Read: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ న్యూ లుక్ - ఒక్కసారిగా ఇలా మారిపోయాడేంటి?... నిజంగా గుర్తు పట్టలేమంతే...
భారీగా ప్రమోషన్స్
రిలీజ్‌కు ముందే మూవీ టీం ప్రమోషన్స్ భారీగానే ప్లాన్ చేస్తోంది. తాజాగా... రాజమౌళి, రానా, ప్రభాస్ కలిసి సరదాగా మూవీ విశేషాలను పంచుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వీడియో రిలీజ్ కానుంది. అయితే, స్వీటీ అనుష్క ప్రమోషన్లకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆమె తాను నటించిన మూవీస్ ప్రమోషన్లలో పాల్గొనడం లేదు. సోషల్ మీడియాకు కూడా కాస్త దూరంగా ఉన్నారు. ఇప్పటికే 'బాహుబలి' మూవీ టీం ఓ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తుండగా... ఒకే వేదికగా రాజమౌళి, ప్రభాస్, రానా, సత్యరాజ్, రమ్యకృష్ణ రానున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో కేవలం సోషల్ మీడియా ద్వారానే ప్రమోషన్స్ చేస్తారా? లేక ఈవెంట్ నిర్వహిస్తారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
ఒకే మూవీ... రన్ టైం ఎంతంటే?
రెండు మూవీస్ కలిపి ఒకే మూవీగా వస్తుండడంతో 'బాహుబలి: ది ఎపిక్' రన్ టైం 3 గంటల 44 నిమిషాలుగా మేకర్స్ ఫిక్స్ చేశారు. కొన్ని సీన్స్, సాంగ్స్ రిమూవ్ చేసి ఒకే మూవీగా రూపొందించారు. 2015లో రిలీజైన పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్ల వసూళ్లు సాధిస్తే... 2017లో వచ్చిన పార్ట్ 2 వరల్డ్ వైడ్‌గా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మూవీలో ప్రతీ ఒక్కరి రోల్ ఒక్కో స్పెషల్. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, తమన్నా, నాజర్, సత్యరాజ్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు.





















