Prabhas: తమిళ దర్శకుడితో ప్రభాస్ సినిమా... బ్యాక్ టు బ్యాక్ పోలీస్ కథలతో!?
Prabhas New Movie: ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమాకు ఆయన ఓకే చెప్పినట్లు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. తమిళ దర్శకుడితో ప్రభాస్ సినిమా చేయనున్నారని టాక్.

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో ఇప్పుడు ఐదు సినిమాలు ఉన్నాయి. 'ది రాజా సాబ్'ను ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. అది కాకుండా మరొకటి సెట్స్ మీద ఉంది. రెండు సీక్వెల్స్ చేయాల్సి ఉంది. ఇంకో సినిమా యాక్సెప్ట్ చేసి పెట్టారు. ఆ ఐదు కాకుండా ఇప్పుడు మరొక కొత్త కథకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి.
'అమరన్' దర్శకుడితో ప్రభాస్ సినిమా?
శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన 'అమరన్' సినిమా గుర్తు ఉందా? జవాన్ కథతో రూపొందిన ఆ సినిమా థియేటర్లలో ప్రేక్షకులు చేత కంటతడి పెట్టించింది. ఆ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వం వహించారు. 'అమరన్' కంటే ముందు ఆయన 'రంగూన్' అని మరో సినిమా తీశారు ఆర్ రెండిటి మధ్య ఏడేళ్ల గ్యాప్ ఉంది. అయితే 'అమరన్' ద్వారా భారీ హిట్ అందుకున్నారు.
'అమరన్' దర్శకుడు రాజ్ కుమార్ చెప్పిన కథ ప్రభాస్ (Prabhas Rajkumar Periasamy Movie) కు బాగా నచ్చిందట. ఆయన చెప్పిన పాయింట్ విని ఇంప్రెస్ అయ్యారట. ఫుల్ స్టోరీ తీసుకురమ్మని పంపించారట. ఇప్పుడు బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డారు రాజ్ కుమార్ పెరియసామి.
బ్యాక్ టు బ్యాక్ పోలీస్ కథలతో...!?
ప్రభాస్ కోసం రాజ్ కుమార్ పెరియసామి పోలీస్ నేపథ్యంలో కథ రెడీ చేస్తున్నారట. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ 'స్పిరిట్' కథ కూడా పోలీస్ బ్యాక్‌డ్రాప్. రాజ్ కుమార్ కూడా పోలీస్ కథతో వెళ్లారు. బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ పోలీస్ సినిమాలు చేసే అవకాశం ఉంది.
Also Read: మహేష్ బాబుకు మళ్ళీ నోటీసులు... రియల్ ఎస్టేట్ వెంచర్ కేసులో!
ప్రభాస్ హీరోగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో సినిమాను యూవి క్రియేషన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేయనుంది. 'మిర్చి', 'సాహో', 'రాధే శ్యామ్' సినిమాల తర్వాత ప్రభాస్ - యూవి కలయికలో సినిమా ఇది.
Prabhas Upcoming Movies List: ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలకు వస్తే... మారుతి దర్శకత్వంలోని 'ది రాజా సాబ్' డిసెంబర్ 5న విడుదల అవుతుంది. ఆ తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజి' ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్ 2', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 ఏడీ 2' చేయాల్సి ఉంది. పైన చెప్పినట్టు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' ఉంది.
Also Read: కాంట్రవర్సీలు ఫుల్... కలెక్షన్లు నిల్... లైలా to తమ్ముడు... బాయ్‌కాట్ ఎఫెక్ట్ ఉందా?





















