Kalki 2898 AD: 'డార్లింగ్' ఫ్యాన్స్‌కి క్రేజీ న్యూస్.. 'కల్కి 2898 AD' షూటింగ్ ఎక్కడంటే?
Kalki 2898 AD: డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ కాంబోలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.
![Kalki 2898 AD: 'డార్లింగ్' ఫ్యాన్స్‌కి క్రేజీ న్యూస్.. 'కల్కి 2898 AD' షూటింగ్ ఎక్కడంటే? Prabhas and Nag Ashwin's Kalki 2898 AD movie key schedule shooting in Hyderabad Kalki 2898 AD: 'డార్లింగ్' ఫ్యాన్స్‌కి క్రేజీ న్యూస్.. 'కల్కి 2898 AD' షూటింగ్ ఎక్కడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/38e2091cd88c691c73899c2fd98190421706880636274686_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898 AD'. సైన్స్ ఫిక్షన్ సోషియో కథకు పురాణాల నేపథ్యాన్ని జోడించి తెరక్కిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ ను బట్టి చూస్తే, సినీ అభిమానులకు ఓ సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నారని అర్థమవుతోంది. సమ్మర్ లో థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా ఫ్యాన్స్ ను ఎంతో ఎగ్జైట్ చేస్తోంది.
'కల్కి 2898 AD' మూవీ తాజా షెడ్యూల్ షూటింగుకు సంబంధించిన ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈరోజు ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ తాజా షెడ్యూల్లో ప్రధాన తారాగణంతో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. కాకపోతే ప్రస్తుతానికి ప్రభాస్ లేని సీన్స్ మాత్రమే షూట్ చేశారట. 'డార్లింగ్' టీమ్ తో జాయిన్ అయిన తర్వాత మిగతా సన్నివేశాలను చిత్రీకరిస్తారు.
'సలార్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో 'కల్కి 2898 AD' చిత్రంపై అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పటి వరకు విడుదలైన స్పెషల్ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్.. ప్రతీ దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ కు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో.. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, పెండింగ్ ఉన్న వీఎఫ్ఎక్స్ వర్క్స్ కంప్లీట్ చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
Also Read: 'ఒరేయ్ గుండు.. ఎటుపోయావ్' అంటూ నెటిజన్ ట్వీట్.. ‘ఓయ్’ డైరెక్టర్ రియాక్షన్ అదుర్స్!
'కల్కి' సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ స్పెషల్ రోల్స్ లో కనిపించనున్నారు. దిశా పఠాని, పశుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ఎస్ ఎస్ రాజమౌళి లాంటి పలువురు సినీ ప్రముఖులు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
'కల్కి 2898 AD' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2024 మే 9న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషలతో పాటుగా పలు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లలో విడుదల ప్లాన్ చేస్తున్నారు. గతంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూపొందిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'మహర్షి', 'మహానటి' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అదే డేట్ కి వచ్చాయి. ఆ సెంటిమెంట్ తోనే ఇప్పుడు ప్రభాస్ సినిమాని మే 9న విడుదల చేయటానికి రెడీ అయ్యారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.
Also Read: పూనమ్ పాండే నటించిన ఏకైక తెలుగు సినిమా ఇదే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)