News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Prabhas Anushka: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - స్వీటీతో మరో మూవీకి డార్లింగ్ గ్రీన్ సిగ్నల్?

ప్రభాస్, అనుష్క మళ్లీ ఒకే స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు కనిపిస్తారా అని ఎదురుచూసే ఫ్యాన్స్ త్వరలోనే గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది.

FOLLOW US: 
Share:

కొంతమంది ఆన్ స్క్రీన్ కపుల్స్‌ను చూస్తుంటే వీరు ఆఫ్ స్క్రీన్ కపుల్స్ అయితే కూడా ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. అలాంటి కపుల్స్ టాలీవుడ్‌లో చాలామందే ఉంటారు. మామూలుగా ఒక సినిమాకు హైప్ రావాలంటే దర్శకుడు లేదా హీరో వల్ల సాధ్యమవుతుంది. కొన్ని సందర్భాల్లో మ్యూజిక్ డైరెక్టర్ కూడా సినిమాకు హైప్‌ను క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఇవేవి కాకుండా హీరో, హీరోయిన్ పెయిర్ చూసి సినిమాపై అంచనాలను పెంచుకునేవారు కూడా ఉంటారు. టాలీవుడ్‌లో అలాంటి కపుల్ ఎవరంటే చాలామందికి టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్, అనుష్క. వీరిద్దరూ మళ్లీ ఒకే స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు కనిపిస్తారా అని ఎదురుచూసే ఫ్యాన్స్ త్వరలోనే గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది.

ఆరడుగుల అందగాడు ప్రభాస్.. తన కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఎంతోమంది హీరోయిన్లతో నటించాడు. కానీ అనుష్కతో సెట్ అయిన కెమిస్ట్రీ ఇంకా ఏ హీరోయిన్‌తో సెట్ అవ్వలేదు అని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. అంతే కాకుండా వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని, ఆఖరికి పెళ్లి కూడా చేసేసుకుంటున్నారని పలుమార్లు రూమర్స్ వైరల్ అయ్యాయి. కానీ ప్రభాస్, అనుష్క ఎప్పటికప్పుడు తాము మంచి స్నేహితులమని, జీవితాంతం ఈ స్నేహం ఇలాగే కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చేశారు. అయినా కూడా వీరిద్దరు పెళ్లి చేసుకొని రియల్ లైఫ్ కపుల్‌గా మారితే చూడాలని ఎంతోమంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వీరు కలిసి సినిమాలు చేయకపోవడంతో కనీసం స్క్రీన్‌పై కలిసి కనిపించినా చాలు అని కోరుకుంటున్నారు.

‘బిల్లా’ నుంచి ‘బాహుబలి’ వరకు..

ప్రభాస్, అనుష్క మొదటిసారిగా ‘బిల్లా’ సినిమాలో కలిసి నటించారు. ఇందులో ఇద్దరు స్టైలిష్ లుక్స్‌లో కనిపించడంతో పాటు తమ కెమిస్ట్రీతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మిర్చిలో వీరి కెమిస్ట్రీ మరోసారి అద్భుతంగా పండింది. బాహుబలి పార్ట్ 2లో అమరేంద్ర బాహుబలి, దేవసేనగా పోటాపోటీగా నటించి మరోసారి అందరినీ ఫిదా చేశారు. అప్పటినుంచి వీరిద్దరు కలిసి మరిన్ని సినిమాలు చేస్తే బాగుంటుంది అని ప్రేక్షకులు కోరుకోవడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో బాహుబలి తర్వాత అనుష్క సినిమాల్లో నటించడం చాలావరకు తగ్గించేసింది. ప్రస్తుతం తను సినిమాలు చేస్తే చాలు అని అనుకోవడం మొదలుపెట్టారు తన ఫ్యాన్స్. కానీ ఇంతలోనే ప్రభాస్, అనుష్క మళ్లీ కలిసి నటిస్తారు అనే వార్తలు తెరపైకి వచ్చాయి.

‘బాహుబలి’ నిర్మాత కోసం

బాహుబలికి నిర్మాతగా వ్యవహరించిన శోభు యార్లగడ్డ.. ప్రభాస్, అనుష్కను మళ్లీ ఒకే స్క్రీన్‌పై చూపించేందుకు ఆసక్తి వ్యక్తం చేశారట. త్వరలోనే శోభు.. ప్రభాస్‌తో ఒక భారీ బడ్జెట్‌ సినిమాను తెరకెక్కించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదే క్రమంలో ప్రభాస్‌కు జోడీగా ఈ భారీ బడ్జెట్ సినిమాలో అనుష్క నటిస్తే బాగుంటుందని ఈ స్టార్ ప్రొడ్యూసర్ భావించారట. అంతే కాకుండా వీరిద్దరూ కలిసి నటిస్తే.. సినిమాకు తగినంత హైప్ కూడా దక్కుతుంది. అంతే కాకుండా వీరిద్దరూ కలిసి చేసే నెక్స్‌ట్ చిత్రం కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర విపరీతమైన వసూళ్లు సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాహుబలి లాంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించడంలో శోభు యార్లగడ్డ కీలక పాత్ర పోషించారు కాబట్టి ఆయన అడిగితే ప్రభాస్, అనుష్క మళ్లీ కలిసి కచ్చితంగా సినిమా చేస్తారని అందరి అంచనా.

Also Read: ఆఫర్ల కోసం స్టార్ హీరోలతో డేట్ చేయమని అడిగారు: నోరా ఫతేహి షాకింగ్ కామెంట్స్

Published at : 01 Aug 2023 03:39 PM (IST) Tags: Bahubali Prabhas Anushka Shobu Yarlagadda prabhas anushka

ఇవి కూడా చూడండి

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ -  'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

టాప్ స్టోరీస్

Breaking News Live Telugu Updates: రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం

Breaking News Live Telugu Updates: రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం

Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Telangana BJP :  సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Bigg Boss Gala Event: బిగ్ బాస్ గాలా ఈవెంట్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన ఇంటి సభ్యులు- చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అమర్

Bigg Boss Gala Event: బిగ్ బాస్ గాలా ఈవెంట్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన ఇంటి సభ్యులు-  చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అమర్