అన్వేషించండి

Poonam Pandey: పూనమ్ పాండే మరణవార్తపై స్పందించని కుటుంబం - మృతదేహం ఏమైంది?

Poonam Pandey Death: బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే మరణ వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది. కానీ ఇంతలోనే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని మరో వార్త బయటికొచ్చింది.

Poonam Pandey Death: బాలీవుడ్ మోడల్, నటి అయిన పూనమ్ పాండే మరణ వార్త ఒక్కసారిగా ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. 32 ఏళ్ల వయసులో సెర్వికల్ క్యాన్సర్‌తో పూనమ్ మరణించిందని ముందుగా తన మ్యానేజర్ ప్రకటించారు. ఆ తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు పూనమ్ పాండే టీమ్. కానీ ఈ విషయంలో నిజమెంత అని ఎవరూ ఆలోచించకుండానే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చూసి ఒక్కసారిగా ఆర్‌ఐపీ అంటూ స్టేటస్‌లు పెట్టారు నెటిజన్లు. ఇప్పటికీ ఈ విషయంపై పూనమ్ పాండే కుటుంబం స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ తను నిజంగానే చనిపోతే తన మృతదేహం ఎక్కడా అని సందేహాలు మొదలయ్యాయి.

ఏ ఆధారాలు లేవు..

ముందుగా పూనమ్ పాండే ఇన్‌స్టాగ్రామ్‌లో తన టీమ్ షేర్ చేసిన మరణవార్తను పూర్తిగా నమ్మారు నెటిజన్లు. కానీ ఎక్కడి నుండో మరొక వార్త వైరల్ అయ్యింది. అసలు పూనమ్ చనిపోలేదని, ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ అని సోషల్ మీడియాలో వార్త వైరల్ అయ్యింది. దీంతో ఏది నిజం? ఏది అబద్ధం? అని తెలియక ప్రేక్షకులు కూడా అయోమయంలో పడ్డారు. అబద్ధమని చెప్పడానికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు. ఎందుకంటే తను మరణించిందని టీమ్ చేసిన పోస్ట్ తప్పా ఇంకా ఏ ఆధారం లేదు. చివరికి పూనమ్ పాండే కుటుంబం కూడా ఈ మరణ వార్తపై స్పందించలేదు. ఈ విషయం ఇప్పుడు ప్రేక్షకుల్లో సందేహాలు మొదలయ్యేలా చేసింది. 

త్వరలోనే అధికారిక ప్రకటన..

పూనమ్ పాండే మరణ వార్త నిజం కాదు అని సందేహాలు వ్యక్తమవుతుండగా.. పీఆర్ టీమ్ స్పందించింది. ‘‘మాకు పూనమ్ పాండే అక్క నుండి ఫోన్ వచ్చిందని తన మరణం గురించి స్పష్టం చేస్తున్నాం. కుటుంబం నుండి మరింత సమాచారం అందగానే అందరికీ అప్డేట్ చేస్తాం. వెంటనే ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేస్తాం’’ అని తెలిపింది. పూనమ్ పాండే సన్నిహితులు కూడా తనకు క్యాన్సర్ ఉందనే విషయం తమకు తెలియదంటూ షాక్ అయ్యారు. అంతే కాకుండా మరణించిందని వార్త వచ్చే మూడు రోజుల ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది పూనమ్. అందులో చాలా ఆరోగ్యంగా కనిపించింది.

మృతదేహం ఎక్కడ.?

ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం.. మరణ వార్త బయటికి వచ్చినప్పటి నుండి పూనమ్ పాండే ఫ్యామిలీ కనిపించడం లేదట. కేవలం పూనమ్ అక్క మాత్రమే తన మరణ వార్త గురించి బయటపెట్టింది. ఆ తర్వాత కుటుంబం నుండి ఎలాంటి స్పందన లేదని తెలుస్తోంది. దీంతో మరోసారి తన అక్కను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించగా.. తన ఫోన్ రీచ్ అవ్వడం లేదని సమాచారం. అంతే కాకుండా ఒకవేళ పూనమ్ పాండే మరణిస్తే.. తన మృతదేహం ఎక్కడ ఉంది? అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయి? లాంటి అనుమానాలు కూడా ఫ్యాన్స్‌లో మొదలయ్యాయి. దీంతో పాటు ప్రస్తుతం పూనమ్ పాండే నివాసముంటున్న ఇంటి దగ్గర కూడా విచారణ జరపగా.. అక్కడ ఎవరికీ ఈ విషయం గురించి తెలియదని తెలుస్తోంది. 

Also Read: బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే ఆస్తుల విలువ ఎంతంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది... ఈ నెలలో కాదు, Netflixలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అమరన్' ఓటీటీ రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది... ఈ నెలలో కాదు, Netflixలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
KA Movie OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం 'క'... సౌండింగ్‌తో కుమ్మేసిన ఈటీవీ విన్ యాప్, స్ట్రీమింగ్ షురూ
ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం 'క'... సౌండింగ్‌తో కుమ్మేసిన ఈటీవీ విన్ యాప్, స్ట్రీమింగ్ షురూ
Anantapur News Today: వస్తున్నా నాన్న అన్నాడు- వదిలి వెళ్లిపోయాడు- అనంతపురంలో చదువు ఒత్తిడితో వైద్య విద్యార్థి ఆత్మహత్య
వస్తున్నా నాన్న అన్నాడు- వదిలి వెళ్లిపోయాడు- అనంతపురంలో చదువు ఒత్తిడితో వైద్య విద్యార్థి ఆత్మహత్య
Embed widget