Poonam Pandey Net Worth: బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే ఆస్తుల విలువ ఎంతంటే?
Poonam Pandey Net Worth: బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూనమ్ పాండే హఠాత్తుగా మరణించింది. దీంతో తన ఆస్తుల వివరాలు ఎంత అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి.
Poonam Pandey Net Worth: ఇండియన్ మోడల్, నటి పూనమ్ పాండే కన్నుమూత ఒక్కసారిగా ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. గర్భాశయ క్యాన్సర్‌తో అతిచిన్న వయసులోనే కన్నూమూసింది పూనమ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూనమ్‌ను గుర్తుచేసుకుంటూ తన ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా సినీ పరిశ్రమలో తన వర్క్‌ను, పర్సనల్ లైఫ్‌లో, ప్రొఫెషనల్ లైఫ్‌లో తన చుట్టూ ఉన్న కాంట్రవర్సీలను కూడా మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఇదే క్రమంలో పూనమ్ పాండే ఆస్తుల వివరాల గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఆస్తుల ఎంత అనే విషయం బయటికొచ్చింది.
బోల్డ్ సినిమాలతో క్రేజ్..
బాలీవుడ్‌లో ఒక బోల్డ్, కాంట్రవర్షియల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది పూనమ్ పాండే. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటూ.. తన ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉండేది. 2013లో విడుదలయిన ‘నషా’ మూవీతో నటిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది పూనమ్. ఆ సినిమాలో ఉన్న బోల్డ్ కంటెంట్‌తో ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘నషా’ తర్వాత ‘లవ్ ఈజ్ పాయిజన్’, ‘మాలిని ఆండ్ కో’, ‘ఆ గయా హీరో’, ‘ది జర్నీ ఆఫ్ కర్మ’ వంటి సినిమాల్లో మెరిసింది. తను చేసిన ప్రతీ సినిమా హిట్ అవ్వకపోయినా.. అందులో పూనమ్ చేసే బోల్డ్ కంటెంట్‌ను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూసేవారు.
సినిమాలు మాత్రమే కాదు.. సీరియల్స్ కూడా..
సినిమాలు మాత్రమే కాదు.. సీరియల్స్‌లో కూడా పూనమ్ పాండే నటించి మెప్పించింది. 2015లో ప్రసారమయిన ‘టోటల్ నాదానియా’, ‘ప్యాయర్ మహబ్బత్’ వంటి సీరియల్స్‌లో జలేబీ బాయ్ పాత్రతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది పూనమ్. ఇక ఆన్‌లైన్‌లో కూడా పూనమ్ పాండేకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడూ హాట్ పోస్టులతో ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటూ ఉండేది. అలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, సోషల్ మీడియా కంటెంట్‌తో పూనమ్ పాండే బాగానే సంపాదించేదని సమాచారం. అందుకే ప్రస్తుతం తన ఆస్తుల విలువ దాదాపు రూ.50 కోట్ల వరకు ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఆర్‌ఐపీ అంటూ స్టేటస్‌లు..
ఇక ఉన్నట్టుండి పూనమ్ పాండే మరణ వార్త విని తన ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. తన ఆత్మకు శాంతి చేకూరాలని ఆర్‌ఐపీ అంటూ స్టేటస్‌లు పెడుతున్నారు. ‘‘ఈ ఉదయం మేం ఎంతో బాధాకరమైన విషయాన్ని పంచుకుంటున్నాం. మాకు ఎంతో ఇష్టమైన పూనమ్ పాండేను కోల్పోయాం. సర్వైకల్ క్యాన్సర్ కు ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. ఆమె ప్రతి ఒక్కరితో ప్రేమ, ఆప్యాయతను పంచుకుంది. ఈ సమయంలో బాధాకరమైన విషయాన్ని పంచుకునేందుకు ఎంతో చింతిస్తున్నాం. ఆమె ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేం” అంటూ తను మరణించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బయటపెట్టారు పూనమ్ పాండే టీమ్. తన ప్రొఫెషనల్ లైఫ్‌లోనే కాదు.. వైవాహిక జీవితానికి సంబంధించి కూడా అప్పట్లో ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ అయ్యాయి. 2020లో మాజీ భర్త సామ్ బాంబేపై గృహ హింస కేసు కూడా పెట్టింది పూనమ్ పాండే.
Also Read: కాపీ రైట్స్ కేసుపై ‘శ్రీమంతుడు’ టీమ్ స్పందన - అప్పుడే అంచనాలకు రావద్దు