Polimera 3: ‘పొలిమేర 3’ నిర్మాతపై ‘పొలిమేర 2’ నిర్మాత ఫిర్యాదు - చంపాలని బెదిరిస్తున్నారంటూ ఆరోపణలు
Polimera 3: ‘పొలిమేర’ సినిమా రెండు భాగాలు విడుదలయ్యి సూపర్ సక్సెస్ అవ్వడంతో మూడో పార్ట్ కోసం మేకర్స్ సిద్ధమయ్యారు. ఇంతలోనే ‘పొలిమేర 3’పై నిర్మాత ఇచ్చిన కంప్లైంట్ హాట్ టాపిక్‌గా మారింది.
Legal Issues For Polimera 3: ఒక సినిమా షూటింగ్ పూర్తయ్యి ప్రేక్షకుల ముందుకు రావాలంటే ఎన్నో సమస్యలను దాటాలి. అందులోనూ ఒక మూవీ సూపర్ హిట్ అయ్యి దాని సీక్వెల్ తెరకెక్కుతున్న సమయంలో మరెన్నో సమస్యలు రావడం సహజం. ప్రస్తుతం ‘పొలిమేర’ ఫ్రాంచైజ్ కూడా అదే ఇబ్బందులను ఎదుర్కుంటోంది. ‘పొలిమేర 3’కు నిర్మాతగా వ్యవహరించడానికి ముందుకొచ్చిన ప్రొడ్యూసర్ వంశీ నందిపాటికి లీగల్ సమస్యలు మొదలయ్యాయి. ఆయన ‘గీతా ఆర్ట్స్’ ప్రొడ్యూసర్ అయిన బన్నీ వాస్‌కు క్లోజ్ ఫ్రెండ్. ఇప్పుడు ‘పొలిమేర 3’ వల్ల వంశీ నందిపాటికి సమస్యలు ఎదురవుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
నేనే నిర్మిస్తాను..
అనిల్ విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ‘పొలిమేర 2’ను గోలులు కృష్ణ ప్రసాద్ నిర్మించారు. దానికి వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూటర్‌గా మారి సినిమాను విడుదల చేశారు. అయితే ‘పొలిమేర’ నుండి వచ్చిన రెండు సినిమాలు భారీ బ్లాక్‌బస్టర్ సాధించగా ‘పొలిమేర 3’ను ఇప్పుడు స్వయంగా తానే నిర్మిస్తానని ప్రకటించాడు వంశీ. అది కూడా బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ ఎత్తున నిర్మిస్తానని తెలిపాడు. అక్కడే అసలైన ట్విస్ట్ వచ్చింది. ‘పొలిమేర 2’ను డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్‌గా వంశీ నందిపాటికి చాలా లాభాలు వచ్చాయని, తను నిర్మాత కాబట్టి తనకు కూడా లాభాలు ఇవ్వమని అడగగా తనను వంశీ బెదిరించాడని గౌలు కృష్ణ ప్రసాద్ ఆరోపిస్తున్నారు.
సెక్యూరిటీ కావాలి..
లీగల్‌గా వంశీ నందిపాటిపై యాక్షన్ తీసుకోవాలని గౌలు కృష్ణ ప్రసాద్ నిర్ణయించుకున్నారు. అందుకే ఫిర్యాదులో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ‘‘పోలిమేర 2 రిలీజ్ అయిన తర్వాత రూ.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసిన వంశీ నందిపాటి ఇప్పటివరకు నాకు లాభాల్లో పైసా కూడా ఇవ్వలేదు. నా షేర్ నాకు కావాలని డిమాండ్ చేస్తూ తనను కలిశాను. అప్పుడు నన్ను చంపేస్తానని, కంప్లైంట్ ఫైల్ చేస్తే దానికి తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడు’’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు కృష్ణ ప్రసాద్. పైగా తనకు పర్సనల్ సెక్యూరిటీ అందించమని కూడా కోరారు.
హిట్ ఫార్ములా..
2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘పొలిమేర’. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యింది. పైగా చేతబడి కాన్సెప్ట్‌తో వచ్చే ఎన్నో సినిమాలకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచింది. తర్వాత కొన్నిరోజుల పాటు ఈ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. ఇక దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘పొలిమేర 2’ కూడా అదే రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమాను ఒక ఫ్రాంచైజ్‌లాగా ప్లాన్ చేస్తున్నామని, ఇంకా చాలా పార్ట్స్ వస్తాయని దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ప్రకటించాడు. అందులో భాగంగానే తాజాగా ‘పొలిమేర 3’ షూటింగ్ మొదలయ్యిందని మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.
Also Read: పవన్ కళ్యాణ్ చేయాలనుకుంటే చేయొచ్చు, నా స్థాయి ముఖ్యం కాదు - కిరణ్ అబ్బవరం