Payal Ghosh: అతడి వల్ల గత తొమ్మిదేళ్లలో శారీరకంగా ఎవరితో కలవలేదు - ఆ క్రికెటర్‌పై నటి పాయల్ ఘాష్ షాకింగ్ కామెంట్స్
Payal Ghosh: ‘ఊసరవెల్లి’ చిత్రంలో తమన్నా ఫ్రెండ్‌గా నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించింది పాయల్ ఘోష్. తాజాగా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌తో తనకు బ్రేకప్ అవ్వడానికి కారణమేంటో బయటపెట్టింది.
Payal Ghosh - Irfan Pathan: కొంతమంది నటీనటులు సినిమాల్లో యాక్టివ్‌గా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ అవుతుంటారు. అలాంటి వారిలో పాయల్ ఘోష్ ఒకరు. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేసినా.. పాయల్ వెండితెరపై కనిపించి చాలాకాలమే అయ్యింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తను చాలా యాక్టివ్. పొలిటికల్‌కు సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి పాయల్ చేసే పోస్టులు కాంట్రవర్షియల్‌గా ఉంటాయి. అలాగే తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి, ఇర్ఫాన్ పఠాన్‌తో బ్రేకప్ గురించి ఒక పోస్ట్ పెట్టింది.
ఇప్పటికీ సింగిల్..
పాయల్ ఘోష్ రిలేషన్‌షిప్స్ గురించి ఎక్కువగా ఎప్పుడూ వార్తలు బయటికి రాలేదు. కానీ ఇండియన్ క్రికెటర్ అయిన ఇర్ఫాన్ పఠాన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని స్వయంగా ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ భామ. ఇక తాజాగా అసలు తమ బ్రేకప్‌కు కారణమేంటో బయటపెట్టింది. ప్రస్తుతం ఇర్ఫాన్ పఠాన్‌తో బ్రేకప్ గురించి పాయల్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో తమ రిలేషన్‌షిప్ గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్‌గా చెప్పేసింది ఈ భామ. ప్రస్తుతం తను ఇంకా సింగిల్‌గా ఉండడానికి కూడా అదే కారణమని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఇర్ఫాన్‌తో బ్రేకప్ అయిన దగ్గర నుండి తను అసలు ఎవరితోనూ లైంగికంగా దగ్గరవ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది.
దూరం పెట్టాడు..
‘‘ఇప్పటికి 9 ఏళ్లు అయ్యింది. నేను ఇర్ఫాన్ పఠాన్‌తో బ్రేకప్ అయిన తర్వాత ఇప్పటివరకు ఎవరికీ లైంగికంగా దగ్గరవ్వలేదు. వినడానికి నమ్మలేకుండా ఉన్నా ఇదే నిజం. కొందరు డబ్బున్న వాళ్లు నాతో గడపడానికి చచ్చిపోతుంటారు. కానీ నా దృష్టిలో లైంగికంగా దగ్గరవ్వడం అనేది చాలా పవిత్రమైన విషయం. జంతువులు చేసినట్టుగా మనుషులు చేసేది కాదు. 2016లో నేను ఇర్ఫాన్ కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాను. నేను ముంబాయ్‌లోని నా ఇంటికి రాగానే తన నుండి ఫోన్ వచ్చింది. మా ఫ్యామిలీ నిన్ను ఒప్పుకోవడం లేదని చెప్పాడు. అలా నాకు దూరమవ్వడం మొదలుపెట్టాడు. కొన్నిరోజుల తర్వాత తన చెల్లి ఫోన్ చేసి ఇర్ఫాన్‌కు పెళ్లి అని చెప్పింది’’ అంటూ ఇర్ఫాన్ పఠాన్‌తో బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది పాయల్ ఘోష్.
ముస్లిమ్స్ అంటే ద్వేషం..
‘‘నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో ఊహించుకోవడానికి కూడా మీకు మనసు రాదు. కనీసం ఇది ఎవరికీ అర్థం కాదు కూడా. నాకు ఇర్ఫాన్ కంటే చాలా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఆప్షన్స్ వల్ల ఏమవుతుంది? ప్రేమను ఎవరూ మార్చలేరు కదా? మా రిలేషన్‌షిప్‌ను మా నాన్న అంగీకరించకపోయినా నేను మాత్రం ఇర్పాన్‌ను ఎప్పుడూ చీట్ చేయలేదు. మా నాన్నకు ముస్లిమ్స్ అంటే ద్వేషం. కానీ నేను మాత్రం ఇర్ఫాన్‌ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. కానీ నాకు చివరికి ఏం మిగిలింది?’ అంటూ వాపోయింది పాయల్ ఘోష్. ఇర్ఫాన్ పఠాన్‌తో రిలేషన్‌షిప్, బ్రేకప్ గురించి పాయల్ ఘోష్ ఇంత వివరంగా చెప్పడం ఇదే మొదటిసారి.
Also Read: వారం రోజుల వరకు నా గొంతు పనిచేయదు - ‘కల్కి 2898 AD’పై రేణు దేశాయ్ రివ్యూ