Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాకు పవన్ కళ్యాణ్ టైటిల్?
విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు పవన్ కళ్యాణ్ హిట్ సినిమా టైటిల్ ఖరారు చేశారా? 'అవును' అని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్ హీరోయిన్ సమంత (Samantha) జంటగా ఓ సినిమా రూపొందుతోంది. ఇంతకు ముందు, 'మహానటి'లో వీళ్ళిద్దరూ జంటగా నటించారు. అయితే... ఆ సినిమాలో వాళ్ళు మెయిన్ లీడ్ కాదు. సావిత్రి జీవిత కథలో సైడ్ రోల్స్ చేశారు. ఈసారి అలా కాదు... వీళ్ళను మెయిన్ లీడ్ గా పెట్టి దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) సినిమా చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించనున్న సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో (Vijay Devarakonda Samantha Movie Opening) ప్రారంభం కానుంది. ఆ తర్వాత యూనిట్ అంతా కశ్మీర్ ప్రయాణం అవుతుంది. ఆదివారం లేదంటే సోమవారం (ఈ నెల 24 లేదా 25 తేదీల్లో) రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. కశ్మీర్ నేపథ్యం (Kashmir Backdrop for Vijay Devarakonda Samantha Movie) లో రూపొందే ప్రేమకథా చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి 'ఖుషి' టైటిల్ ఖరారు చేసినట్టు భోగట్టా. ఈ సినిమాలో కశ్మీరీ యువతిగా సమంత కనిపించనున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. (Samantha Plays Kashmir Girl In Vijya Devarakonda - Shiva Nirvana Film)
'ఖుషి' (Khushi Title For Vijay Devarakonda Samantha Movie) అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా. అందులో పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూ ఉంటాయి. ఆ సినిమా టైటిల్ విజయ్ దేవరకొండ సినిమాకు పరిశీలనలో ఉండటం విశేషం. సినిమా ఓపెనింగ్ రోజున టైటిల్ మీద యూనిట్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
Also Read: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్, ఈ వారం థియేటర్లు, ఓటీటీ విడుదలయ్యే సినిమాలు ఏవో తెలుసా?
విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ కలయికలో తొలి చిత్రమిది. సమంతతో దర్శకుడికి రెండో సినిమా. ఇంతకు ముందు 'మజిలీ' చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 'జెజిఎమ్' (జన గణ మణ Jana Gana Mana - JGM Movie) చేసిన సంగతి తెలిసిందే. అది, ఇప్పుడీ శివ నిర్వాణ సినిమాలను సమాంతరంగా షూటింగ్ చేసే అవకాశం ఉంది.
Also Read: 'బ్లడీ మేరీ' రివ్యూ: ఓటీటీలో విడుదలైన నివేదా పేతురాజ్ సినిమా ఎలా ఉందంటే?