Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'కు కొత్త వివాదం - సినిమా రిలీజ్ అడ్డుకుంటామని వార్నింగ్... రీజన్ ఏంటంటే?
HHVM Controversy: పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ కొత్త వివాదంలో చిక్కుకుంది. చరిత్రను వక్రీకరించి సినిమా తీసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలంగాణ బీసీ సంఘాలు ఆరోపించాయి.

Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Controversy: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అవెయిటెడ్ పీరియాడికల్ అడ్వెంచరస్ మూవీ 'హరిహర వీరమల్లు'కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ మూవీ స్టోరీ పూర్తిగా కల్పితమని చరిత్రను వక్రీకరించి తీశారని తెలంగాణ బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సినిమా రిలీజ్ అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చాయి.
హైకోర్టులో పిల్!
ఈ సినిమా తెలంగాణ పోరాట వీరుడు 'పండుగ సాయన్న' జీవిత చరిత్ర ఆధారంగా తీశారని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి డాక్టర్ శివ ముదిరాజ్ ఆరోపించారు. చరిత్రలో ఎక్కడా లేని కల్పిత పాత్రలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా తెరకెక్కించారని... త్వరలో ఈ చిత్రంపై హైకోర్టులో పిల్ వేస్తామని తెలిపారు. పండుగ సాయన్న జీవిత చరిత్ర ఆధారంగా మూవీ తీయగా... చిత్ర యూనిట్ తమ తప్పును సమర్థించుకోవాలని చూస్తుందని మండిపడ్డారు.
హరి హర రాయలు కాలం (1336 - 1406)లో ఉండగా... ఔరంగజేబు (1658 - 1707) మధ్య 300 ఏళ్ల తేడా ఉందని చెప్పారు. 'సినిమా ట్రైలర్‌లో మాత్రం ఔరంగజేబుతో పోరాడినట్లు చూపించారు. ఇది ఎలా సాధ్య అవుతుంది. ఛార్మినార్ కులీ కుతుబ్ షా ద్వారా 1591లో నిర్మించారు. మూవీలో ఇది కూడా హరి హర రాయల సమకాలీనంగా చూపించారు. కోహినూర్ వజ్రాన్ని హరి హర వీరమల్లు ఔరంగజేబు నుంచి తిరిగి తీసుకున్నట్లు చూపించడం హిస్టరీలో ఎక్కడా కనిపించదు. ఒకవేళ పండుగ సాయన్న జీవిత చరిత్ర ఆధారంగా మూవీ తీసి ఉంటే... సరైన శోధన చేసి నిజ చరిత్రను చెప్పాలి. కానీ సినిమాలో పండుగ సాయన్న చరిత్రను మార్చి హరి హర వీరమల్లు అనే కల్పిత పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. దీన్ని తప్పకుండా అడ్డుకుంటాం.' అని వెల్లడించారు.
పవన్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉందని... అలాంటి వ్యక్తి ఈ సినిమాలో నటించడం వల్ల తప్పుడు చరిత్ర ప్రజల్లోకి వెళ్తుందని బీసీ సంఘాల సభ్యులు తెలిపారు. ఒకవేళ భవిష్యత్తులో నిజమైన చరిత్రను ఎవరు సినిమాగా తీసినా నమ్మకపోయే ప్రమాదం ఉందని అన్నారు. పవన్‌పై తమకు గౌరవం ఉందని... కానీ చరిత్రను వక్రీకరిస్తే సహించమని చెప్పారు. ఈ సినిమాను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. మరి ఈ వివాదంపై మూవీ టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.
ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎఎం రత్నం సమర్పణలో ఎ.దయాకరరావు నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా... పవన్ సరసన నిధి అగర్వాల్, ఔరంగజేబు పాత్రలో సన్నీడియోల్ నటించారు. వీరితో పాటు సునీల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషుసేన్ గుప్తా, నాజర్, రఘుబాబు, నోరా ఫతేహి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించారు. ఈ నెల 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ






















