Sara Arjun: 40 ఏళ్ల రణవీర్ జోడీగా 20 ఏళ్ల సారా అర్జున్ - 'నాన్న' మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఈ విషయాలు తెలుసా?
Dhurandhar Movie: 'ధురంధర్'లో రణవీర్ సరసన 'నాన్న' చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. కర్లీ హెయిర్, ట్రెండీ లుక్‌తో ఆకట్టుకోగా... నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

Sara Arjun In Ranveer Singh Dhurandhar Movie: కోలీవుడ్ స్టార్ విక్రమ్ 'నాన్న' మూవీ మీకు గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ 'సారా అర్జున్' యాక్టింగ్‌కు అంతా ఫిదా అయిపోయారు. విక్రమ్ ఓ మతి స్థిమితం లేని అమాయక తండ్రిగా కనిపించగా... ఆయన కుమార్తెగా సారా అద్భుతంగా నటించారు. తన తండ్రితో సైగలతో మాట్లాడి ఎమోషన్స్‌తో క్లైమాక్స్ సీన్‌లో కన్నీళ్లు పెట్టించారు.
ఈ మూవీ సక్సెస్ తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తెలుగులో వచ్చిన 'దాగుడుమూతల దండాకోర్' మూవీలోనూ తన నటనతో మెప్పించారు సారా. తాజాగా... బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా వస్తోన్న 'ధురంధర్' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.
క్యూట్ లుక్స్‌తో...
గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఆదిత్య ధర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో ఫుల్ యాక్షన్ మోడ్‌లో రణవీర్ అదరగొట్టారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఫశ్ట్ లుక్ పేరుతో 'ధురంధర్' టీజర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రణవీర్ సరసన యంగ్ హీరోయిన్ 'సారా అర్జున్' క్యూట్ లుక్స్‌తో అదరగొట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అసలు ఎవరు ఈమె అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు.
చిన్నతనంలోనే 100 యాడ్స్‌లో...
బాలీవుడ్ యాక్టర్ రాజ్ అర్జున్ కుమార్తె సారా అర్జున్. చిన్నతనంలోనే యాడ్స్‌లో నటించి మంచి రెస్పాన్స్ రావడంతో దాదాపు 100 యాడ్స్‌లో నటించారు. ఏడాదిన్నర వయసులోనే కెమెరా ముందుకొచ్చి యాడ్స్‌తో అదరగొట్టారు. మ్యాగీ, క్లినిక్ ప్లస్, మెక్ డొనాల్డ్స్, కల్యాణ్ జ్యువెలర్స్ వంటి యాడ్స్‌లో కనిపించి టీవీ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు.
ఫస్ట్ మూవీ ఛాన్స్ ఎప్పుడంటే?
తాను తీసిన ఓ యాడ్‌లో నటించిన సారా అమాయకత్వం చూసిన కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ తన మూవీ 'దైవ తిరుమగల్'లో ఛాన్స్ ఇచ్చారు. ఇదే మూవీ తెలుగులో 'నాన్న'గా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా చేసేటప్పుడు ఆమె వయసు ఆరేళ్లు. దీని తర్వాత సారాకు వరుస అవకాశాలు వచ్చాయి. మణిరత్నం రూపొందించిన 'పొన్నియన్ సెల్వన్'లో సారా నటించారు. ఐశ్వర్యారాయ్ చిన్నప్పటి రోల్‌లో ఆమె తన నటనతో మెప్పించారు.
అత్యధిక రెమ్యునరేషన్
తన 18 ఏళ్ల వయసులోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న చైల్డ్ ఆర్టిస్ట్‌గా సారా నిలిచారని అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి. దాదాపు రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారనే ప్రచారం సాగినా... దీనిపై ఆమె ఎప్పుడూ స్పందించలేదు. దాదాపు 100 యాడ్స్‌లో నటించి రెమ్యునరేషన్ ఎక్కువగా తీసుకున్నారనే టాక్ వినిపించింది.
40 ఏళ్ల రణవీర్‌తో... ట్రోలింగ్స్
తాజాగా... 'ధురంధర్' మూవీలో 40 ఏళ్ల రణవీర్‌కు జోడీగా సారా నటించనున్నారు. ఫీమేల్ లీడ్ రోల్‌లో ఆమెకు ఇదే ఫస్ట్ మూవీ కాగా... దీనిపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 20 ఏళ్లు ఉందని... రణవీర్ ఫస్ట్ మూవీ రిలీజ్ అయినప్పుడు సారాకు ఐదేళ్లేనని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. వీడియోలో కర్లీ హెయిర్, క్యూట్ లుక్స్‌తో ఆమె అదరగొట్టారని... అయినా అంత ఏజ్ గ్యాప్ ఏంటంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు.
డిసెంబర్ 5న రిలీజ్
మరోవైపు... వాస్తవ ఘటనల ఆధారంగానే 'ధురంధర్' మూవీని తెరకెక్కించినట్లు డైరెక్టర్ ఆదిత్య ధర్ తెలిపారు. డిసెంబర్ 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















