Pawan Kalyan: ఎన్నాళ్లకెన్నాళ్లకు... స్టేజీపై 'వీరమల్లు' - పవన్ లుక్స్ అదుర్స్... వాచ్ ధర ఎంతో తెలుసా?
Pawan Kalyan Speech: 'హరిహర వీరమల్లు' మూవీలో పవన్ కల్యాణ్ స్లిమ్ చార్మింగ్ లుక్స్ అదిరిపోయాయి. ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు.

Pawan Kalyan Crazy Looks In HHVM Press Meet: పవర్ స్టార్ పవన్ కల్యాణ్... ఈ పేరు వింటేనే చాలామందికి పూనకాలు వచ్చేస్తాయి. ఆయన సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు థియేటర్స్ దద్దరిల్లుతాయి. చాలా రోజుల తర్వాత ఆయన హీరోగా చేసిన 'హరిహర వీరమల్లు' ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన లుక్స్, స్పీచ్ అదిరిపోయాయి.
నిజానికి పవన్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత మూవీస్‌కు దూరంగా ఉన్నారు. ఉన్న కాస్త టైంలో తాను అంతకు ముందు సైన్ చేసిన సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆయన సినిమాలకు సంబంధించిన ఈవెంట్‌లో ఫస్ట్ టైం పాల్గొన్నారు.
ఛార్మింగ్ లుక్...
ఈ ప్రెస్ మీట్‌లో పవన్ ఎంటర్ అయినప్పటి నుంచీ వైబ్స్ మామూలుగా లేవు. ఎప్పుడూ సింపుల్‌గా కనిపించే ఆయన స్లిమ్ లుక్‌లో అదరగొట్టారు. స్పీచ్ స్టార్ట్ చేయక ముందు మూవీ నుంచి పవన్... మేకింగ్ వీడియో, పాటలు ప్లే చేయగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ స్టిల్స్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఛార్మింగ్ లుక్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ కోసం అంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తమ అభిమాన నటుడిని ఇలా తీర్చిదిద్దిన డైరెక్టర్ హరీష్ శంకర్‌కు థాంక్స్ చెబుతున్నారు. దీనిపై రియాక్ట్ అయిన హరీష్ శంకర్ పవన్ కోసం నేను ఏదైనా చేసేందుకు సిద్ధమే అంటూ రిప్లై ఇచ్చారు.
Also Read: 'హరిహర వీరమల్లు' ప్రొడ్యూసర్ ఎఎం రత్నంకు కీలక పదవి - అనౌన్స్ చేసిన పవన్ కల్యాణ్
వాచ్ కాస్ట్ ఎంతో తెలుసా?
ప్రెస్ మీట్‌లో పవన్ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వాచ్ వరల్డ్ ఫేమస్ లగ్జరీ బ్రాండ్ Eberhard & co. కు చెందినదిగా గుర్తించారు. దీని గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ వాచ్ కాస్ట్ దాదాపు రూ.1,85,148 అని తెలుస్తోంది. పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మూవీ లవర్స్ కూడా ఈ వాచ్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

చాలా రోజుల తర్వాత నేరుగా పవన్ కల్యాణ్ తన మూవీ ప్రమోషన్లలో పాల్గొన్నారు. పాలిటిక్స్, ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతల నేపథ్యంలో ఆయన మూవీ ప్రమోషన్ల జోలికి వెళ్లడం లేదు. తనకు ప్రమోట్ చేయడం తెలీదని... ఎఎం రత్నం కోసమే తాను ప్రెస్ మీట్ పెట్టినట్లు చెప్పారు పవన్. స్పీచ్ మొత్తంలో మూవీ టీం పడ్డ శ్రమ, డైరెక్టర్ జ్యోతికృష్ణ, క్లైమాక్స్ వార్ సీక్వెన్స్ గురించి మాత్రమే చెప్పారు. మూవీ స్టోరీ లైన్ గురించి సైతం ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను నమ్మిన దర్శక నిర్మాతలు, టీం కోసం ఆయన అండగా నిలబడ్డారంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.
ఈ నెల 24న 'హరిహర వీరమల్లు' ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా... బాబీ డియోల్, నోరా ఫతేహి, అనుపమ్ ఖేర్, జిషు సేన్ గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు.






















