Ustaad Bhagat Singh: స్టైలిష్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి న్యూ పోస్టర్... ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే
Pawan Kalyan Birthday: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఒక రోజు ముందుగానే బర్త్ డే ట్రీట్ ఇచ్చారు డైరెక్టర్ హరీష్ శంకర్. 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Pawan Kalyan's New Poster From Ustaad Bhagat Singh Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ పక్కా. ఆయన బర్త్ డేకు ఒక రోజు ముందుగానే సర్ ప్రైజ్ ఇచ్చేశారు 'ఉస్తాద్ భగత్ సింగ్' మేకర్స్. స్టైలిష్ లుక్‌లో పవన్ అదరగొట్టారు. పోస్టర్ ట్రీట్ అదిరిపోయిందని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
నేను అలా చూడాలనుకుంటున్నా
'హ్యాపీయెస్ట్ బర్త్ డే. నా బ్రదర్. నా ఇన్‌స్పిరేషన్. నా హీరో. ఒకే ఒక్క పవర్ స్టార్ పవన్ కల్యాణ్. నేను అతన్ని ఇలా చూడాలనుకుంటున్నా. మీకు ఇది నచ్చుతుందని ఆశిస్తున్నా.' అంటూ ట్వీట్ చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ వేరే లెవల్‌లో ఉంది. ఓ పెద్ద క్లాక్ బ్యాక్ డ్రాప్‌లో స్టైల్‌గా త్రీ పీస్ సూట్‌లో టోపీ పెట్టుకుని పవర్ స్టార్ డ్యాన్స్ స్టెప్ వేస్తున్నట్లుగా ఉన్న లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.
చాలా రోజుల తర్వాత వింటేజ్ పవన్‌ను చూస్తున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కోసం తనలోని ఫ్యాన్‌ను డైరెక్టర్ హరీష్ శంకర్ చూపించారని... ఓ పాటలో స్టిల్‌తో నిజంగానే మరిచిపోలేని ట్రీట్ ఇచ్చారంటూ చెబుతున్నారు. 'దటీజ్ పవర్ స్టార్', 'ఇక థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం' అంటూ చెప్పారు.
View this post on Instagram
Also Read: నెక్స్ట్ ఇయర్ నుంచి వరుసగా మూవీస్ చేస్తా బ్రో - రానాతో స్వీటీ అనుష్క ఫోన్ కాల్... ఏంటీ నీకు పెళ్లా?
ఈ నెల 6న కొత్త షెడ్యూల్
ఈ నెల 6న మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కీలక యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు క్లైమాక్స్ సీక్వెన్స్‌ను కంప్లీట్ చేశారు హరీష్ శంకర్. ఇక మిగిలిన పార్ట్‌ను కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కొత్త షెడ్యూల్‌లో పవన్‌తో పాటు ఇతర నటీనటులు పాల్గొంటారు. రాబోయే షెడ్యూల్‌తో టాకీ పార్ట్ పూర్తవుతుంది.
మూవీలో పవన్ సరసన బ్యూటీ శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే రాశీ లుక్ రివీల్ చేయగా... ఫోటోగ్రాఫర్ పాత్రలో ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటే పార్థిబన్, కేఎస్ రవికుమార్, నవాబ్ షా, రాంకీ, కేజీఎఫ్ ఫేం అవినాష్, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
హిట్ కాంబో
గతంలో పవన్, హరీష్ కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. పవన్ వీరాభిమానిగా ఆయన్ను ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా బెస్ట్ లుక్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు హరీష్. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక పవన్ మరో మూవీ ఓజీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.





















