By: ABP Desam | Updated at : 30 Dec 2022 04:02 PM (IST)
Edited By: anjibabuchittimalla
Vivek Agnihotri
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన ‘పఠాన్’ మూవీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. 'బేషరమ్ రంగ్' సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ లొల్లి కంటిన్యూ అవుతోంది. 'ది కశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కూడా ఈ పాటపై ఓ రేంజిలో ఫైర్ అయ్యారు. 'ఇలాంటి దుస్తులు వేసుకునేందుకు సిగ్గులేదా?' అని ఇండియన్స్ అందరి తరఫున ఓ అమ్మాయి అడుగుతున్నట్లు వీడియో పోస్ట్ చేశారు.
వాస్తవానికి ఈ పాటలో షారుఖ్, దీపికా అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు. కానీ, దీపిక ఆరెంజ్ కలర్ స్విమ్ సూట్ లో కనిపించడంతో పాటు ‘బేషరమ్ రంగ్’ అంటూ పాట రావడం పట్ల ఓ వర్గం ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ హెచ్చరించారు. తాజాగా అగ్నిహోత్రి, దీపిక, షారూఖ్ ‘బేషరమ్ రంగ్’ పాటను విమర్శిస్తూ ఆ వీడియోను షేర్ చేశారు. 'సెక్యులర్' వ్యక్తులు ఈ వీడియోను చూడకూడదంటూ అగ్నికి ఆజ్యం పోశారు.
వివేక్ షేర్ చేసిన క్లిప్ లో, ‘బేషరమ్ రంగ్’ వీడియోలో దీపిక, షారూఖ్ ఖాన్ బీచ్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఓ చిన్నారి ఈ సినిమాలో నటించిన నటీనటులు, దర్శకుడికి తాను పెద్ద ఫ్యాన్ అంటూ కనిపిస్తుంది. నటీనటులతో పాటు సిబ్బందిని ఆ అమ్మాయి ముందుగా ప్రశంసిస్తుంది. ఆ తర్వాత, దీపిక విజువల్స్ ప్లే కావడంతో.. "మీరు అలాంటి రెచ్చగొట్టే దుస్తులు ధరించి, అశ్లీలమైన రీతిలో ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారు? ఈ కంటెంట్‌ని చూసి జనాలు ఏం నేర్చుకోవాలి? మహిళలపై జరిగే నేరాలకు ఇలాంటి వీడియోలే కారణం. ఎందుకు ఇలా చేస్తున్నావు? డబ్బు కోసమేనా? సమాజంలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న మీరు ఇలాంటి దుస్తులు ధరించడం ఏంటి? ఇప్పటికైనా దర్శకులు ఇలాంటి రెచ్చగొట్టే సినిమాలు తీయకండి. దయచేసి మీ స్క్రిప్ట్ లను మార్చండి. మీ దిశను మార్చుకోండి..." అంటూ ఆ చిన్నారి చెప్తుంది.
WARNING:#PnV video against Bollywood. Don’t watch it if you are a Secular. pic.twitter.com/7wKPX4A8Ev
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) December 28, 2022
ఈ వీడియో చూసిన షారుఖ్ అభిమానులు.. గతంలో వివేక్ దర్శకత్వం వహించిన ‘హేట్ స్టోరీ’ మూవీని తెరపైకి తెచ్చారు. ఆ సినిమాలో మీరు చూపించింది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. శరీరాన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్న తన సినిమాల్లోని మాటలు గుర్తులేదా? అని అడుగుతున్నారు. 'జీడ్’, ‘హేట్ స్టోరీ’ లాంటి సినిమాలు చేసినప్పుడు ఈ బుద్ధి ఏమైందంటున్నారు. అటు వివేక్ అగ్నిహోత్రి కూతురు మల్లిక ఆరెంజ్ బికినీ పిక్స్ షేర్ చేస్తూ.. దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నారు. నెటిజన్లు తనను టార్గెట్ చేయడంతో మల్లిక ఇన్‌స్టా అకౌంట్‌ను ప్రైవేట్ గా మార్చుకుంది.
Hello @vivekagnihotri, Remember?
— Mohammed Zubair (@zoo_bear) December 28, 2022
Warning: Don’t watch it if you are a hypocrite. pic.twitter.com/3FNsWDUW75
This movie is directed by you. 😭 pic.twitter.com/C4becV0HlW
— Prayag (@theprayagtiwari) December 28, 2022
షారుఖ్ ఖాన్, దీపికి నటించిన ‘పఠాన్’ సినిమా జనవరి 25, 2023న విడుదల కానుంది. ఈసినిమాలో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించాడు. కాగా ‘బేషరమ్ రంగ్’ అనే పాట డిసెంబర్ 12న విడుదల అయ్యింది. స్పెయిన్‌లోని అందమైన ప్రదేశాలలో ఈ పాటను చిత్రీకరించారు.
Read Also: టాప్ గన్ To అవతార్, ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలు ఇవే!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
K Viswanath Passed Away : బ్రేకింగ్ న్యూస్ - కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
Pawan Kalyan: రోడ్డు మీద వాంతి చేసుకుంటే బాబాయ్ క్లీన్ చేశారు - చరణ్ ఫోన్‌కాల్‌లో పవన్ గురించి ఏం అన్నారు?
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలన మలుపు, ఛార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్, కవిత, మాగుంట పేర్లు
YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్
Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్
Thalapathy67 Title Reveal: రక్తంతో తడిసిపోయిన తలపతి - టైటిల్ అనౌన్స్మెంట్ రేపే!