అన్వేషించండి

Paruchuri Sudarshan : హీరోగా పరిచయం అవుతున్న పరుచూరి బ్రదర్స్ మనవడు - జీవితాన్ని నాశనం చేసే పుకార్లు ఏమిటి?

రవికిషోర్‌ బాబు దర్శకత్వంలో పరుచూరి సుదర్శన్ హీరోగా ఓ మూవీ తెరకెక్కుతోంది. సుదర్శన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. కామెడీ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.

తెలుగు సినిమా పరిశ్రమలోకి మరో వారసుడు అడుగు పెట్టబోతున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమలో రచయితలుగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పరుచూరి బ్రదర్స్ కుటుంబం నుంచి ఓ యువకుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు కథలు అందించి, పరుచూరి వెంకటేశ్వర్ రావు, పరుచూరి గోపాలకృష్ణ ఇండస్ట్రీలో ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అలాంటి పరుచూరి బ్రదర్స్ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ఓ యంగ్ స్టార్ ఇండస్ట్రీకి రాబోతున్నాడు. పరుచూరి వెంకటేశ్వరరావు మనువడు సుదర్శన్‌ హీరోగా వెండితెరపై కనిపించబోతున్నాడు.  రవికిషోర్ బాబు చందిన దర్శకత్వంలో సుదర్శన్ సినిమా రూపొందుతోంది.  

సుదర్శన్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్

ఇప్పటికే సుదర్శన్ - రవికిషోర్ బాబు మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ (సెప్టెంబర్ 2న) పరుచూరి సుదర్శన్ బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఆయన ఫస్ట్ లుక్, బర్త్ డే గ్లింప్స్ ని విడుదల చేసింది. జైలు లోపల ఫెరోషియస్ ఎక్స్ ప్రెషన్స్ తో  ఉన్న హీరో సుదర్శన్ లుక్ ఆసక్తికరంగా ఉంది. కెమెరా పట్టుకుని స్టైలిష్ గా నడుస్తున్నహీరో సుదర్శన్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. డిఫరెంట్ లుక్స్ తో ఉన్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. కామెడీ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందిస్తున్నారు. వీరి డైలాగ్స్ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారనున్నాయి. త్వరలోనే ఈ మూవీ టైటిల్‌ను ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. రూమర్స్‌ కారణంగా కొందరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి అనే పాయింట్‌ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని దర్శకుడు రవికిషోర్ బాబు వెల్లడించారు.  

మనువడి చిత్రానికి డైలాగులు అందిస్తున్న పరుచూరి బ్రదర్స్‌

కామెడీ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్‌ డైలాగ్స్‌ అందిస్తున్నారు. పరుచూరి సుదర్శన్, శ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. యోగి, దొరబాబు, జబర్థస్త్ రాజమౌళి, జబర్థస్త్ బాబి, సునీత మోహన్, రాజేశ్వరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఆర్.పి.సినిమాస్ బ్యానర్ లో యన్.పాండు రంగారావు, చిన్నరెడ్డయ్య కోయ నిర్మిస్తున్నారు.  రూమర్స్ డిస్ట్రాయ్ లైఫ్స్  అనే కాప్షన్ తో టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాకి వినోద్‌ యాజమాన్య సంగీతం అందిస్తున్నారు. శివకుమార్‌ దేవరకొండ సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శివ శార్వాణి ఎడిటింగ్ విధులు చేపట్టారు. 

'సిద్ధాపూర్‌ అగ్రహారం' సినిమా ఏమైనట్లు?

ఇప్పటికే పరుచూరి సుదర్శన్ హీరోగా  'సిద్ధాపూర్‌ అగ్రహారం' అనే సినిమా మొదలయ్యింది. గత ఏడాది జూన్ లో అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుక జరుపుకుంది. రాకేష్‌ శ్రీపాద దర్శకత్వంలో వాసు తిరుమల, ఉష శివకుమార్‌ ఈ సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో పలువురు సినీయర్ దర్శకులు పాల్గొన్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇంతకీ ఈ సినిమా ఉందా? లేదా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.   

Read Also: మరణం లేని వాడికి సైతం చావు తథ్యం - కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్‘ యాక్షన్, టీజర్ చూశారా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Embed widget