అన్వేషించండి

పాన్ ఇండియా మూవీతో వస్తున్న నటి భావన - ఆసక్తి రేపుతున్న ‘ది డోర్’ ఫస్ట్ లుక్!

తెలుగులో 'ఒంటరి', 'మహాత్మా', 'హీరో' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న భావన నటిస్తున్న తాజా చిత్రం 'ది డోర్'. ఈరోజు భావన పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన 'ఒంటరి' సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది మలయాళ ముద్దుగుమ్మ భావన. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కృష్ణ వంశీ - శ్రీకాంత్ కాంబినేషన్లో వచ్చిన 'మహాత్మా' సినిమాతో హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో భావన తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా సినిమాలో భావన యాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. ఇక తర్వాత నితిన్ సరసన 'హీరో' సినిమాలో నటించిన భావన చివరగా మాస్ మహారాజా రవితేజ నటించిన 'నిప్పు' సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించింది. ఇక ఆ తర్వాత నుంచి భావన తెలుగు సినిమాల్లో కనిపించనే లేదు. అయితే తెలుగు తో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ హీరోయిన్ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కొన్నాళ్లు సినిమాలకు దూరమైన ఈమె పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.

మళ్లీ దశాబ్ద కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈసారి ఏకంగా పాన్ ఇండియా మార్కెట్ పైనే కన్నేసింది ఈ మలయాళ ముద్దుగుమ్మ. భావన నటిస్తున్న తాజా చిత్రం 'ది డోర్'. భావన కెరియర్లో ఇది 86వ సినిమా కావడం విశేషం. జై దేవ్ ఈ మూవీతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అయితే ఈరోజు భావన తన పుట్టినరోజును జరుపుకుంటుంది. దీంతో మూవీ టీం భావన బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచేశారు మేకర్స్. ఈ పోస్టర్ ని ఒకసారి గమనిస్తే.. డోర్ ముందు కొంచెం అనుమానాస్పదంగా కనిపిస్తుండగా, అదే డోర్ లో నుంచి రక్తంతో ఉన్న చేతులు బయటికి రావడం చూడొచ్చు. దీన్నిబట్టి ఇది సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ జానర్ మూవీ అని ఇట్టే అర్థమవుతుంది.

మొత్తానికి భావన ఈసారి ఓ హారర్ త్రిల్లర్ తో ఆడియన్స్ ని ఈ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయింది. ఇక తాజాగా మూవీ టీం విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్  పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని జూన్ డ్రీమ్స్ స్టూడియోస్ బ్యానర్ పై నవీన్ రాజన్ నిర్మిస్తున్నారు. భావన లీడ్ రోల్ చేస్తుండగా.. జయ ప్రకాష్, నందు, గణేష్ వెంకట్రామన్, శ్రీరంజిని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరుణ్ ఉన్ని సంగీతం అందిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒక విధంగా భావనకి మళ్లీ టాలీవుడ్ లో ఇది ఓ రీఎంట్రీ మూవీ అని చెప్పొచ్చు. మరి 'ది డోర్' మూవీ తో పాన్ ఇండియా లెవెల్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్న భావనకి ఈ మూవీ ఎలాంటి సక్సెస్ను అందిస్తుందో చూడాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget