NTR On Multi-Starrer Movies: మనం ఆ స్థాయి దాటేశాం, ప్రేక్షకులూ ప్రిపేర్ అయ్యారు! - ఎన్టీఆర్
'ఆర్ఆర్ఆర్' తర్వాత మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు వస్తాయని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు. హీరోలు అందరితో మల్టీస్టారర్ సినిమాలు చేయాలని ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
మల్టీస్టారర్ సినిమాలు చేయాలంటే బోలెడు లెక్కలు వేసుకోవాల్సి వస్తుందనేది సినీ ఇండస్ట్రీలో వినిపించే మాట. తమ హీరోకు ఎన్ని సీన్లు ఉన్నాయి? మరో హీరోకి ఎన్ని సీన్లు, పంచ్ డైలాగ్స్ ఉన్నాయి? అని అభిమానులు లెక్కలు వేసుకోవడం వల్ల కథలు రాసే క్రమంలో దర్శక - రచయితల క్రియేటివిటీకి కళ్లెం పడుతుందనేది కొందరు చెప్పే మాట. అయితే... మనం ఆ స్థాయిని దాటేశామని ఎన్టీఆర్ అన్నారు.
'అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య బ్యాలన్స్ పాటించారా?' అని రాజమౌళిని ప్రశ్నించగా... "ఇద్దరికీ ఎంత స్క్రీన్ స్పేస్ ఉంది? ఆ హీరోకి ఎన్ని ఫైట్స్ ఉన్నాయి? ఈ హీరోకి ఎన్ని ఫైట్స్ ఉన్నాయి? ఎవరు ఎన్ని పంచ్ డైలాగ్స్ కొట్టారు? వంటి లెక్కలను నేను పక్కకు తీసేశా. ఒక్క సెకన్ కూడా ఆ విషయాల గురించి ఆలోచించలేదు. చాలా ఎక్కువ ఆలోచించింది ఏంటంటే... ప్రేక్షకుల్లో ఇద్దరిపై ఒకే విధమైన ఎంపతీ రావాలి. ఇద్దరి గురించి ఒకే విధంగా ఆలోచించాలి. ఒకేలా ఫీలవ్వాలి. సినిమా మొదలై, ఇద్దరి ఇంట్రడక్షన్స్ పూర్తి అయిన తర్వాత ఇద్దరి పాత్రలకు క్లోజ్ అవుతారు. స్టార్స్‌గా ఆల్రెడీ వాళ్ళు ప్రేక్షకులు క్లోజ్" అని సమాధానం ఇచ్చారు. లెక్కలు వేసుకుని తీస్తే... హృదయం లేని సినిమా తీస్తామన్నారు. ప్రేక్షకులు ఆ పాత్ర నవ్వితే నవ్వాలని, ఏడిస్తే ఏడవాలని, అప్పుడే మంచి సినిమా వస్తుందని రాజమౌళి అభిప్రాయపడ్డారు.
రాజమౌళి తర్వాత అభిమానుల గురించి, మల్టీస్టారర్ సినిమాల గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ "నాకు తెలిసి ఆ రోజులు కూడా పోయాయి. ఆల్రెడీ అభిమానులు కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. కేవలం ఎన్టీఆర్‌ని కాదు, ఓన్లీ చరణ్‌ను కాదు... ఇద్దరినీ కలిసి చూడబోతున్నామని మానసికంగా సిద్ధమయ్యారు. ఈ రోజు మన దర్శకులు, మన సినిమాలు, మనం ఆ స్థాయి దాటేశామని నమ్ముతున్నాను. అవి దాటేసి ముందుకు వెళ్ళిపోయాం" అని చెప్పారు.
Also Read: 'ఆర్ఆర్ఆర్'కు నష్టం రాకుండా, ప్రేక్షకులపై భారం పడకుండా! - రాజమౌళికి ఏపీ సీయం జగన్ హామీ
భవిష్యత్తులో మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు వస్తాయని ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. తనకు మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్... చిరంజీవి, బాలా బాబాయ్ (బాలకృష్ణ), నాగార్జున, వెంకటేష్ అందరితో మల్టీస్టారర్ సినిమాలు చేయాలని ఉందని ఎన్టీఆర్ తెలిపారు (I want to do multi starrer films with Chiranjeevi garu, Bala Babai, Venkatesh Garu, Nagarjuna Garu, Mahesh Anna, Bunny, Prabhas - NTR with Tollywood Media). పాన్ ఇండియా సినిమాలు, క్రాస్ ఓవర్ సినిమాలు చాలా వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: ఉక్రెయిన్‌లో సెక్యూరిటీకి ఫైనాన్షియల్ హెల్ప్ చేసిన రామ్ చరణ్