NTR Fan Koushik: ఫ్యాన్స్ హెల్ప్ చేశారు - ఎన్టీఆర్ చేయలేదు - ఇంకో రూ.20 లక్షలు కావాలి - కౌశిక్ తల్లి ఆవేదన!
NTR Fan Koushik Cancer: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ కౌశిక్ క్యాన్సర్ విషయం కొన్ని రోజుల క్రితం వైరల్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు ఎన్టీఆర్ తన ఫ్యాన్‌తో వీడియో కాల్ మాట్లాడారు కూడా.
NTR Fan Koushik Mother: క్యాన్సర్‌తో బాధ పడుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ కౌశిక్ తల్లి మీడియాతో మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కలిసి రూ.2.5 లక్షలు హెల్ప్ చేశారని, ఎన్టీఆర్ నుంచి తనకు ఎటువంటి సాయం అందలేదని ఆమె తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్‌తో వీడియో కాల్ మాట్లాడించిన కృష్ణా యాదవ్‌ను కాంటాక్ట్ చేయడానికి ప్రయ్నతిస్తే ఆయన సరిగ్గా స్పందించలేదన్నారు.
అసలు ఆమె ఏమన్నారు?
‘జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మాకు ఏమీ ఆర్థిక సాయం రాలేదు. ఆయన ఫ్యాన్స్ దగ్గర నుంచి రూ.2.5 లక్షల సాయం అందింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.11 లక్షలు వచ్చింది. అలాగే టీటీడీ వాళ్లు రూ.40 లక్షలు ఇచ్చారు. అబ్బాయి కండీషన్ ఇప్పుడు బాగుంది. కీమోథెరపీ చేయడం వల్ల హార్ట్, లంగ్స్‌లో అంతా ఇన్ఫెక్షన్ చేరింది. బాబుని డిశ్చార్జ్ చేయడానికి కూడా రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని అంటున్నారు. కృష్ణా యాదవ్ అనే ఆయన మాకు జూనియర్ ఎన్టీఆర్‌తో వీడియో కాల్ చేయించారు. ఏదైనా హెల్ప్ చేయండి అని ఆయన్ని అడిగితే గవర్నమెంట్ దగ్గరికి వెళ్లమని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ అకౌంటెంట్ అని నా దగ్గర ఒక నంబర్ ఉంది. ఆ నంబర్‌కి కాల్ చేస్తే టీటీడీ ఇచ్చింది కదా మమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పారు. ఇంకేం చెప్పలేదు. ఎన్టీఆర్‌కు డైరెక్ట్ కాంటాక్ట్ నా దగ్గర ఏమీ లేదు. నేను ఆయన్ని హెల్ప్ చేయమని చాలా సార్లు అడిగినా లేదని చెప్పారు.’ అని కౌశిక్ తల్లి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
Also Read: Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
‘దేవర’ చూసి చనిపోతా అంటూ...
పరిస్థితి విషమంగా ఉన్న సమయంలో ‘దేవర’ చూసి చనిపోతా అని కౌశిక్ అనడంతో అతని తల్లి దండ్రులు మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కౌశిక్‌తో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు కౌశిక్ తల్లి మీడియాతో మాట్లాడటంతో విషయం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. మరి దీనిపై జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఆయన టీమ్ కానీ స్పందిస్తుందేమో చూడాలి.
Also Read: ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్!
NTR Fans 12 Laks and TTD 40 Laks and Government 13,Laks icharu
— 𝐓𝐢𝐠𝐞𝐫 𝐋𝐨𝐡𝐢𝐭𝐡 🐯 (@BrutalFanOf_NTR) December 23, 2024
Yesterday when they are discharging that time they are asking 20 Laks that also taking care by our Hero or Related Trusts
Nija nijalu telusukokunda TRP kosam rudhatam correct kadhu @bigtvtelugu #JrNTR pic.twitter.com/EraV7svS1p
Forget about Jr NTR personal contribution
— Sankar (@LegalMonster) December 23, 2024
She got almost 53.5 lakhs in donation from TTD+ Govt+ Fans but aameki still zero gratitude in her words 👎
NTR is indirectly responsible to get publicity about her son's health, aame yedo appu unnatu adigindipic.twitter.com/BcYA8JsUog