NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్‌తో - క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, 'కెజియఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కలిసి ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా గురించి దర్శకుడు క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NT Rama Rao Jr) అభిమానులకు గుడ్ న్యూస్. ఆయనతో తాను చేయబోయే సినిమా షూటింగ్ ఎప్పుడూ స్టార్ట్ చేసేదీ చెప్పేశారు ప్రశాంత్ నీల్ (Prashanth Neel). వచ్చే వేసవిలో ఎన్టీఆర్ 31 (NTR 31 Movie) చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకు వెళతామని ఆయన తెలిపారు.
'సలార్' విడుదల కంటే ముందే... ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా 'సలార్' (Salaar Movie) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ రోజు ఆ సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. అయితే... అంత కంటే ముందు ఎన్టీఆర్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు.
Prashanth Neel On NTR 31 : ఎన్టీఆర్‌తో సినిమా గురించి చెప్పమని అడిగితే... ''ఏం చెప్పాలి? కథ చెప్పాలా? ఆ సినిమా షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లేదా మేలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం'' అని ప్రశాంత్ నీల్ తెలిపారు.
ప్రశాంత్ నీల్ కంటే ముందు కొరటాలతో
ప్రశాంత్ నీల్ కంటే ముందు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. నిజం చెప్పాలంటే... 'ఆర్ఆర్ఆర్' కంటే ముందు ఆ సినిమాకు ఎన్టీఆర్ సంతకం చేశారు. ఈపాటికి సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలి. కానీ, ఆలస్యం అవుతూ వస్తోంది. ఇది NTR30 వ సినిమా.
భుజం నొప్పితో బాధపడుతున్న ఎన్టీఆర్
ఎన్టీఆర్ 30 ఆలస్యం కావడానికి 'ఆచార్య' పరాజయమే కారణమని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే... అందులో నిజం లేదని ఇటీవల వెల్లడైన ఓ వార్త వల్ల తెలిసింది. నిజానికి, ఈ నెలలో కొరటాల శివ సినిమాను స్టార్ట్ చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేశారు. అయితే... కొన్ని రోజులుగా ఆయన భుజం, మోకాలి నొప్పితో బాధ పడుతున్నారని, అందువల్ల ఆయన్ను నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారని సమాచారం.
'ఆర్ఆర్ఆర్' షూటింగులో గాయాలు?
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితికి 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ సమయంలో అయిన గాయాలే కారణం అని తెలుస్తోంది. అందులో యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయి. అవి చేసినప్పుడు గాయాలు అయ్యాయట. అందుకని... కొన్ని రోజులు రిస్కీ ఫైట్స్, షూటింగులకు దూరంగా ఉండమని చెప్పారట.
Also Read : అక్కడ రొమాన్స్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డా, షాకింగ్ విషయం చెప్పిన అక్కినేని నాగ చైతన్య
వెట్రిమారన్ దర్శకత్వంలో...
కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాల తర్వాత తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఇద్దరూ కలిసి పని చేయడం ఖాయమని వినబడుతోంది.