Bads Of Bollywood Controversy: 'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్ సిరీస్ కాంట్రవర్శీ - కేస్ ఫైల్ చేయాలంటూ పోలీసులకు NHRC ఆదేశం
Ranbir Kapoor: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కేస్ ఫైల్ చేయాలంటూ NHRC ముంబై పోలీసులను ఆదేశించింది. 'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' సిరీస్‌లో నిషేధిత వస్తువులు వాడినట్లు ఫిర్యాదు రావడంతో చర్యలకు ఉపక్రమించింది.

NHRC Orders To Police FIR Against Ranbir Kapoor Over E Cigarette Use In Bads Of Bollywood Series: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' తాజాగా వివాదాల్లో చిక్కుకుంది. ఈ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ నిషేధిత వస్తువులు వినియోగించారంటూ కంప్లైంట్ అందడంతో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్... ఆయనపై కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులను ఆదేశించింది.
అసలేం జరిగిందంటే?
'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్ సిరీస్ ఈ నెల 18 నుంచి ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ప్రభుత్వం నిషేధించిన ఈ - సిగరెట్ వినియోగించడం వివాదానికి కారణమైంది. ఎలక్ట్రానిక్ సిగరెట్ నిషేధ చట్టం - 2019ని ఉల్లంఘించడమే కాకుండా ఎలాంటి వార్నింగ్స్ కానీ డిస్‌క్లైమర్స్ కానీ లేకుండా సీన్స్ ఉండడంపై NHRC తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వినయ్ జోషి అనే వ్యక్తి ఈ విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకురాగా... కేంద్ర సమాచార కమిషన్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది.
ఈ సీన్స్ వెంటనే తొలగించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. రణబీర్‌తో పాటు ఈ సిరీస్ నిర్మాతలు, నెట్ ఫ్లిక్స్‌పై కూడా చర్యలకు ఆదేశాలిచ్చింది. రణబీర్‌పై కేస్ ఫైల్ చేయాలంటూ ముంబై పోలీసులకు సూచించినట్లు తెలుస్తోంది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ కేంద్ర సమాచార శాఖతో పాటు ముంబై పోలీసులకు సైతం నోటీసులు ఇచ్చింది. ప్రమోషన్స్ కోసం ఇలాంటి చర్యలకు పాల్పడడం కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: 'OG' ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్‌కు పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ మాస్ ట్రీట్... 'ఓజస్ గంభీర' వేరే లెవల్
ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సిరీస్‌తోనే షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్‌గా మారాడు. సిరీస్‌లో బాలీవుడ్ స్టార్స్ ఆమిర్ ఖాన్, దర్శక ధీరుడు రాజమౌళి కూడా అతిథి పాత్రలో మెరిశారు. వీరితో పాటు రాఘవ్ జ్యూయెల్, లక్ష్య, మోనా సింగ్, కరణ్ జోహార్, షారుఖ్ ఖాన్, దిశా పటానీ గెస్ట్ రోల్స్ చేశారు. రణబీర్ కపూర్ క్యామియో రోల్‌లో మెరిశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో తెర వెనుక జరిగే సంగతులు, హీరో కావాలనుకునే ఓ యువకుడి స్టోరీతో పాటు ఇద్దరు అగ్ర నిర్మాతల మధ్య ఇరుక్కున్న హీరో కథే ఈ సిరీస్.





















