Neha Shetty: క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న నేహాశెట్టి - రెమ్యునరేషన్ అంత పెంచేసిందా?
Neha Shetty Remuneration: యంగ్ బ్యూటీ నేహా శెట్టి క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. దానిని దృష్టిలో పెట్టుకునే తను కూడా రెమ్యునరేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Neha Shetty Remuneration: ఒక హీరో లేదా హీరోయిన్ తమ కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా.. వారిని స్టార్‌గా నిలబెట్టిన సినిమా ఒకటి ఉంటుంది. అలా ప్రతీ ఒక్కరి కెరీర్‌లో ఒక మూవీ ఉంటుంది. అలా నేహా శెట్టి కెరీర్‌లో ‘డీజే టిల్లు’. అంతకు ముందు హీరోయిన్‌గా పలు సినిమాల్లో కనిపించినా కూడా తనను ఎక్కువగా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేసిన మూవీ మాత్రం ఇదే. దీంతో తనకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు రావడం మొదలయ్యింది. అందుకే ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటోంది ఈ భామ. తన రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసిందని నేహా శెట్టిపై ఇండస్ట్రీలో రూమర్స్ మొదలయ్యాయి.
అడిగినంత రెమ్యునరేషన్..
‘డీజే టిల్లు’లో రాధికగా కనిపించిన తర్వాత చాలామంది యంగ్ హీరోల సరసన నటించడానికి నేహా శెట్టినే హీరోయిన్‌గా పరిగణిస్తున్నారట మేకర్స్. అలా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తుండడంతో రెమ్యునరేషన్ కూడా విపరీతంగా పెంచేసిందట ఈ భామ. ప్రస్తుతం తను తీసుకుంటున్న రెమ్యునరేషన్ కంటే మూడురెట్లు ఎక్కువ పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందట. తాజాగా విశ్వక్ సేన్‌తో జోడీకడుతూ నేహా శెట్టి నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కోసం ఆమె ట్రిపుల్ రెమ్యునరేషన్ తీసుకుందట. ఇలాంటి క్రేజ్ ఉన్న హీరోయిన్ తమ ప్రాజెక్ట్‌లో భాగమయితే ప్రాజెక్ట్‌కు కూడా క్రేజ్ వస్తుందని తను అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేశారట ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మేకర్స్.
యంగ్ హీరోలతో సినిమాలు..
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ మే 31న విడుదలయ్యి మంచి టాక్‌తో దూసుకుపోతోంది. దీని తర్వాత నేహా శెట్టి ప్రాజెక్ట్స్ గురించి ఇంకా పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఒక మూవీ, నాగశౌర్యతో ఒక మూవీని లైన్‌లో పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్స్‌నే తన సినిమాలకు ఎంపిక చేసుకుంటూ ఉంటాడు. అందుకే నేహా శెట్టికి ఈ ఛాన్స్ వచ్చిందని, తను ఎంత రెమ్యునరేషన్ అడిగితే అంత ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోయిన్లలో నేహా శెట్టి కూడా స్థానం సంపాదించుకుంది.
గెస్ట్ రోల్‌తో రచ్చ..
‘డీజే టిల్లు’లో రాధిక పాత్రతో అలరించిన ఆమె.. ఆ మూవీ సీక్వెల్.. ‘టిల్లు స్క్వేర్’లో కూడా హీరోయిన్‌గా కనిపిస్తుందేమో అని చాలామంది ప్రేక్షకులు ఎదురుచూశారు. కానీ అలా జరగలేదు. ‘టిల్లు స్క్వేర్’లో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌కు ఛాన్స్ వెళ్లింది. అయినా కూడా మూవీలో రాధికగా ఒక సీన్‌లో గెస్ట్ రోల్‌లో కనిపించింది నేహా. ఆ గెస్ట్ రోల్‌కే థియేటర్లలో ఒక రేంజ్‌లో గోల చేశారు ప్రేక్షకులు. దీంతో నేహా శెట్టి క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో అర్థమవుతోంది. అందుకే టిల్లు ఫ్రాంచైజ్‌లో మళ్లీ రాధిక పాత్ర ఉంటుందా అనే ప్రశ్నకు మేకర్స్ కావాలనుకుంటే టిల్లు కోసం రాధిక మళ్లీ తిరిగొస్తుంది అని సమాధానమిచ్చింది నేహా శెట్టి.