Nayanthara Vs Dhanush: ధనుష్ లీగల్ యాక్షన్, కోర్టు నోటీసులపై నయన్ లాయర్ రియాక్షన్... వివాదం మరింత ముదురుతోందిగా
Nayanthara Lawyer On Dhanush: నయనతార - ధనుష్ వివాదం రోజురోజుకీ మరింతగా ముదురుతోంది. ధనుష్ పంపించిన లీగల్ నోటీసులకు తాజాగా నయనతార లాయర్ సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో ధనుష్ (Dhanush) - నయనతార (Nayanthara) వివాదం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా నయనతారకు ధనుష్ లీగల్ నోటీస్ పంపించడంతో.. ఆమె తరఫున లాయర్ స్పందించారు. ఆయన రియాక్షన్ చూస్తుంటే ఈ వివాదంలో నయన్ తగ్గేదే లే అన్నట్టుగా ఉంది. మరోవైపు ధనుష్ కూడా ఈ విషయాన్ని వదిలి పెట్టకపోవడంతో వివాదం మరింతగా ముదురుతోంది.
ఈ నేపథ్యంలోనే ధనుష్ తన అనుమతి లేకుండా తాను నిర్మించిన 'నానుమ్ రౌడీధాన్' సినిమాలోని మూడు సెకండ్ల క్లిప్ ను నయనతార డాక్యుమెంటరీలో ఉపయోగించడంపై నయనతారతో పాటు ఆమె భర్త విగ్నేష్ శివన్ పై సివిల్ దావా వేశారు ధనుష్. తాజాగా ఆ నోటీసులపై నయనతార లాయర్ స్పందిస్తూ... ఇక్కడ ఎలాంటి వయొలేషన్ జరగలేదని, ఆ ఫుటేజ్ వ్యక్తిగత లైబ్రరీ నుంచి వచ్చిందని, అది సినిమాలోని బిహైండ్ సీన్స్ కాదని వివరించారు. లాయర్ మాట్లాడుతూ 'డాక్యుమెంటరీలో కాపీ రైట్స్ కు సంబంధించి ఎలాంటి వయొలేషన్ జరగలేదు. ఎందుకంటే డాక్యుమెంటరీలో మేము ఉపయోగించింది బియాండ్ సీన్స్ కాదు. అది పర్సనల్ లైబ్రరీలో భాగం మాత్రమే" అని పేర్కొన్నారు. మద్రాస్ హైకోర్టులో ఈ వివాదంపై తదుపరి విచారణ డిసెంబర్ 2న జరగబోతోంది.
ఇక డాక్యుమెంటరీలో ఉపయోగించిన కంటెంట్ ను 24 గంటల్లోగా తొలగించాలని డిమాండ్ చేస్తూ ధనుష్ టీం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఒకవేళ అలా చేయకపోతే నెట్ ఫ్లిక్స్ పై 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ చట్టపరమైన చర్యలకు తీసుకుంటామని అందులో హెచ్చరించింది. ఇదిలా ఉండగా నయనతార - విగ్నేష్ డాక్యుమెంటరీ ఆమె పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 18న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది.
Also Read: హాలీవుడ్ రేంజ్‌లో 'విడాముయార్చి' టీజర్... గుడ్ బ్యాడ్ అగ్లీ కాదు, సంక్రాంతికి వచ్చేది ఈ సినిమాయే
గతంలో ధనుష్ నిర్మాతగా 'నానుమ్ రౌడీధాన్' అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా... ఆమె భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ సెట్లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉండగా మరోవైపు నయనతారపై నెట్ ఫ్లిక్స్ రూపొందించిన 'నయనతార బియాండ్ ఫెయిరీ టేల్' అనే ఈ డాక్యుమెంటరీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇందులో 'నానుమ్ రౌడీధాన్' అనే సినిమాలోని మూడు సెకండ్ల క్లిప్ ఉపయోగించడంపై ధనుష్ చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.
ముందుగా వీటిని డాక్యుమెంటరీ నుంచి 24 గంటల్లోగా డిలీట్ చేయాలని, లేదంటే చట్టపైన చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. దీంతో ఫైర్ అయిన నయనతార సోషల్ మీడియాలో ధనుష్ పై ఒక సుదీర్ఘ నోట్ ను పంచుకుంది. ఆ మూడు సెకండ్ల క్లీప్ కోసం మూడేళ్ల నుంచి పర్మిషన్ కోసం ట్రై చేస్తున్నామని, కానీ ధనుష్ అందుకు ఒప్పుకోలేదని అందులో వెల్లడించింది. పైగా మూడు సెకండ్ల క్లిప్ కోసం 10 కోట్లు చెల్లించాలా అంటూ మండిపడింది. అంతేకాకుండా తాను కూడా చట్ట పరంగా ఈ వివాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైంది.
Also Read: ప్రభాస్ లాంటి కొడుకు కావాలంటోన్న బాలీవుడ్ నటి - రెబల్ స్టార్‌కు తల్లిగా ఎందులో నటిస్తుందో తెలుసా?