అన్వేషించండి

Nayanthara: నా భర్త వల్లే ఆ నమ్మకం కలిగింది - విఘ్నేష్ గురించి చెప్తూ నయన్ ఎమోషనల్

Nayanthara Vignesh Shivan: సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార.. దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తాజాగా ఒక ఈవెంట్‌లో తన భర్త గురించి ఎమోషనల్‌గా మాట్లాడింది.

Nayanthara about Vignesh Shivan: ఒకప్పుడు హీరోయిన్స్‌కు పెళ్లి అవ్వగానే సినిమాలను వదిలేసి వెళ్లిపోతారు. ఇక వెండితెరపై కనిపించరు అని ప్రేక్షకులు అనుకునేవారు. కానీ అందరు హీరోయిన్స్ అలా ఉండరని.. ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్ కూడా బ్యాలెన్స్ చేసి చూపిస్తామని కొందరు భామలు.. పెళ్లి తర్వాత కూడా నటనను కొనసాగిస్తున్నారు. అందులో ఒకరు నయనతార. పెళ్లి తర్వాత కూడా సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా కొనసాగుతూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది నయన్. అంతే కాకుండా పెళ్లి తర్వాత బిజినెస్‌లోకి కూడా అడుగుపెట్టింది. తాజాగా తన బిజినెస్ ప్రమోషన్ కార్యక్రమంలో తన భర్త విఘ్నేష్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యింది నయనతార.

ప్రైవేట్ ఈవెంట్‌లో భార్యభర్తలు..
పెళ్లికి ముందు కూడా నయనతార.. ఒకవైపు హీరోయిన్‌గా నటిస్తూనే.. మరోవైపు బిజినెస్ ఉమెన్‌గా కొన్ని వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టింది. కానీ పెళ్లి తర్వాత సొంతంగా బ్యూటీ ప్రొడక్ట్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. సొంతంగా శానిటరీ ప్యాడ్స్ బ్రాండ్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇక ఈ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేయడం కోసం నయనతార సోషల్ మీడియాలో చాలా కష్టపడుతోంది. కేవలం సోషల్ మీడియాలోనే ప్రమోట్ చేస్తే సరిపోదు అని, తాజాగా ఈ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేయడం కోసం ఒక ప్రైవేట్ ఈవెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి పాల్గొంది నయన్. అదే సమయంలో తన భర్త గురించి చెప్తూ.. ఎమోషనల్ కూడా అయ్యింది.

తోడుగా ఉంటాడు..
ప్రతీ పురుషుడి వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనే సామెతను ముందుగా గుర్తుచేసుకుంది నయనతార. కానీ అదే విధంగా ప్రతీ విజయవంతమైన, సంతోషంగా ఉన్న స్త్రీ వెనుక కూడా ఒక పురుషుడు కచ్చితంగా ఉంటాడని చెప్పింది. దానికి తననే ఉదాహరణగా తీసుకోమంది. ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నానని, ఆ సినీ ప్రయాణంలో తన భర్త విఘ్నేష్‌ను కలిశానని తెలిపింది. అప్పటినుండి ఇప్పటివరకు తాను ఆనందంగానే ఉన్నానని బయటపెట్టింది. ప్రతీ విషయంలో తన భార్త తనకు తోడుగా ఉంటాడని, తన నిర్ణయాలను ఎప్పుడూ ప్రశ్నించలేదని రివీల్ చేసింది. తాను ఏదైనా చేయగలను అనే నమ్మకాన్ని కల్పించాడని చెప్తూ.. విఘ్నేష్‌కు థ్యాంక్స్ చెప్పింది నయనతార. ఇక ఈ ఈవెంట్‌‌కు సంబంధించిన ఫోటోలను విఘ్నేష్.. తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rowdy Pictures (@therowdypictures)

కెరీర్‌లో బిజీ..

సినిమాల విషయానికొస్తే.. హీరోయిన్‌గా నయనతార, డైరెక్టర్‌గా విఘ్నేష్ శివన్.. ఇద్దరూ తమ కెరీర్‌లలో బిజీగా ఉన్నారు. ఇటీవల నయన్ కెరీర్‌లోని 75వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘అన్నపూర్ణి’. కానీ ఈ మూవీ విడుదల అవ్వకముందు నుండే ఎన్నో సమస్యలను ఎదుర్కుంటుంది. హిందువుల మనోభావాలు ఈ సినిమా దెబ్బతీసేలా ఉందని, బ్రాహ్మణ కమ్యూనిటీని కించపరిచేలా ఉందని చాలామంది ప్రేక్షకులు దీనిని ఖండించారు. దీంతో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన తర్వాత కూడా ‘అన్నపూర్ణి’ని స్ట్రీమింగ్ నుండి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని తర్వాత ‘టెస్ట్’ అనే స్పోర్ట్స్ డ్రామా సినిమా షూటింగ్‌లో నయన్ బిజీ అయిపోయింది.

Also Read: బిజినెస్‌మ్యాన్‌తో శ్రద్ధా దాస్ ప్రేమ, పెళ్లి - అసలు సంగతి చెప్పేసిందిగా!

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Embed widget