Month Of Madhu: 'మంత్ ఆఫ్ మధు' మూవీ పెద్దలకు మాత్రమే - కలర్స్ స్వాతి ఏం చెప్పిందంటే!
స్వాతి రెడ్డి, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన 'మంత్ ఆఫ్ మధు' చిత్రం ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. దీనికి సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికేట్ జారీ చేయడంపై మేకర్స్ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.
Month Of Madhu: కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'మంత్ ఆఫ్ మధు'. భానుమతి & రామకృష్ణ ఫేమ్ శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఈరోజు శుక్రవారం (అక్టోబర్ 6) థియేటర్లలో విడుదలైంది. అయితే రిలీజ్ కు కొన్ని గంటల ముందు ఈ మూవీ సెన్సార్ గురించి చిత్ర బృందం ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది.
ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించిన 'మంత్ ఆఫ్ మధు' చిత్రాన్ని సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికేట్ జారీ చేసింది. దీని ప్రకారం ఈ సినిమాని పెద్దలు మాత్రమే చూడాలి. ఈ నేపథ్యంలో మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ.. ''మా సెన్సార్ పూర్తయింది. మాకు 'A' సర్టిఫికేట్ వచ్చింది. 'ఎ' అనేది అడల్ట్స్ కు మాత్రమే. 'మంత్ ఆఫ్ మధు' అనేది వయోజనులైన వారికి లేదా వయోజనులు అవ్వాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరికీ మా నుంచి చిన్న హ్యాంపర్ లాంటిది. అడల్టింగ్ చాలా గమ్మత్తైనది. మనకు తెలుసు, మనకు ఏమీ తెలియదని. మీరు ఈ హాంపర్ ని ఆనందిస్తారని ఆశిస్తున్నాము'' అని పేర్కొన్నారు. దీనికి 'పలుకే బంగారమాయేనా' మ్యూజిక్ ను జత చేసారు.
'మంత్ ఆఫ్ మధు' చిత్రానికి 'ఎ' సెర్టిఫికేట్ జారీ చేయడంపై హీరోయిన్ స్వాతి స్పందించింది. ''పెద్దలుగా, మనకు ఏమీ తెలియదని మనకు ఇప్పుడు తెలుసు. పలుకే బంగారమాయెన సంగీతం కూడా హాంపర్‌లో భాగమే'' అని క్యాప్షన్ పెట్టింది. దీనికి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పెద్దలు మాత్రమే చూడగలిగే సన్నివేశాలు ఉన్నప్పుడు ఎ సెన్సార్ సెర్టిఫికేట్ ఇవ్వడంలో తప్పులేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
''A అంటే అథెంటిక్ కూడా. కథను హానెస్ట్ గా చెప్పాలి. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లో అదే కనిపించింది.. అందరికి అదే చాలా నచ్చింది'' అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. ''A ఎందుకు ఇచ్చారు?. క్రింజ్ కామెడీ, సెన్స్ లెస్ వైలెంట్ మాస్ సినిమాలు, ఆయుధాల వినియోగం సిగరెట్‌లను చాలా గొప్పగా చూపించే చిత్రాలకు U/A సెన్సార్ సర్టిఫికెట్ ఎందుకు ఇస్తారో అర్థం కాదు. UA అంటే ఏమిటి & A అంటే ఏమిటి? అనేది సెన్సార్ బోర్డ్ వాళ్ళకే తెలియాలి'' అని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. అయితే ఈరోజు 'మంత్ ఆఫ్ మధు' రిలీజైన తర్వాత ఈ చిత్రానికి 'A' సర్టిఫికేట్ ఇవ్వడం సరైనదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కొన్ని సన్నివేశాల్లో మందు తాగుతూ ప్రధాన పాత్రధారులు చెప్పే డైలాగ్స్‌లో బూతులు దొర్లడం ఇబ్బందికరంగా అనిపించినట్లు చెబుతున్నారు.
ప్రేమించి పెళ్లిచేసుకున్న ఒక జంట విడిపోవడానికి దారి తీసిన పరిస్థితులు, ఆ సమయంలో వాళ్ళు అనుభవించే బాధ, లోకమంతా తనలాగే స్వచ్చంగా ఉండాలనుకొనే టీనేజ్ దాటబోతున్న ఒక అమ్మాయికి ఎదురయ్యే సంఘటనలు, ఈ క్రమంలో ఆమె నేర్చుకొనే విషయాలు వంటివి ‘మంత్ అఫ్ మధు’ సినిమాలో ప్రధానంగా చూపించారని తెలుస్తోంది. కాకపోతే కమర్షియల్ హంగులేవీ లేకుండా సహజత్వానికి దగ్గరగా ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేసారు. మరి ఇది బాక్సాఫీస్ వద్ద ఎలా పెరఫార్మ్ చేస్తుందో చూడాలి.
‘మంత్ అఫ్ మధు’ చిత్రంలో స్వాతి, నవీన్ చంద్ర నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇందులో శ్రేయ నవిలే కీలక పాత్ర పోషించగా.. జ్ఞానేశ్వరి, వైవా హర్ష, రాజా చెంబోలు, రాజా రవీంద్ర, మంజుల ఘట్టమనేని, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, రుచిత సాదినేని, కంచర్లపాలెం కిశోర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అచ్చు రాజమణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. రాజీవ్ ధరావత్ సినిమాటోగ్రఫీ , రవికాంత్ పేరెపు ఎడిటింగ్ వర్క్ చేసారు. క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానర్స్ పై యశ్వంత్ ములుకుట్ల ఈ సినిమాని నిర్మించారు.
Also Read: 'సలార్' to 'దేవర' - రెండు భాగాలుగా తెరకెక్కుతున్న తెలుగు సినిమాలివే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial