Hi Nanna : నానికి బిగ్ షాక్ - బుల్లితెరపై 'హాయ్ నాన్న' మూవీకి ఊహించని రెస్పాన్స్!
Hi Nanna : నాచురల్ స్టార్ నాని నటించిన 'హాయ్ నాన్న' మూవీకి బుల్లితెరపై షాకింగ్ TRP రేటింగ్ నమోదైంది.
Hi Nanna Movie Gets low TRP Rating in First Telecast : నాచురల్ స్టార్ నాని గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ అందుకున్న విషయం తెలిసిందే. 2023 ఆరంభంలో 'దసరా' మూవీతో పాన్ ఇండియా హిట్ తన ఖాతాలో వేసుకున్న నాని.. అదే ఏడాది 'హాయ్ నాన్న' అంటూ మరో సక్సెస్ అందుకున్నాడు. శౌర్యువ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ చేత కన్నీళ్లు పెట్టించడంతో పాటూ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు అందుకుంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించి నిర్మాతలకు లాభాలను అందించింది. అటు ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా రీసెంట్ గా టీవీల్లో టెలికాస్ట్ అయ్యింది. అయితే బుల్లితెరపై ఈ సినిమాకి షాకింగ్ TRP రేటింగ్ నమోదైంది.
బుల్లితెరపై ఊహించని రెస్పాన్స్
థియేటర్, ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'హాయ్ నాన్న' మూవీ కొద్ది రోజుల క్రితం జెమినీ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రదర్శితమైంది. అయితే ఎవరూ ఊహించని విధంగా బుల్లితెరపై ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి అతి తక్కువ స్పందన లభించింది. నాని కెరియర్ లోనే లోయస్ట్ టిఆర్పి రేటింగ్ ఈ సినిమాకి నమోదవ్వడం ఆశ్చర్యకరం. అర్బన్ ఏరియాల్లో 4.4 రేటింగ్ దక్కించుకున్న ఈ చిత్రం రూరల్ ఏరియాల్లో 4.06 టిఆర్పీ రేటింగ్ అందుకుంది. నాని గత సినిమాలతో పోల్చుకుంటే చాలా తక్కువ రేటింగ్ అని చెప్పొచ్చు. కూతురు సెంటిమెంట్‌తో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి నిర్మించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా బేబీ కియారా ఖన్నా నాని కూతురు పాత్ర పోషించింది.
వరుస సినిమాలతో బిజీ బిజీ
గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. అన్న తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' సినిమా చేస్తున్న నాని ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేశాడు. 'సరిపోదా శనివారం' తర్వాత బలగం వేణుతో ఓ సినిమా, 'OG' డైరెక్టర్ సుజిత్ తో మరో సినిమా.. అలాగే శ్రీకాంత్ ఓదెలాతో మరో సినిమాని ప్రకటించాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న 'సరిపోదా శనివారం' షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాని ఆగస్టు 29 న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ విలక్షణ నటుడు SJ సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మురళి.జి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.
Also Read : ‘ఖుషి’ ముందే అలా - రెమ్యునరేషన్‌పై స్పందించిన విజయ్ దేవరకొండ