అన్వేషించండి

Aay Trailer: ‘ఆయ్’ ట్రైలర్ - అమ్మాయికి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే? గోదారోళ్ల వెటకారంతో ఫన్ జర్నీ - హిట్టు కొట్టేలా ఉందే!

Aay Trailer: నార్నే నితిన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య లీడ్ రోల్స్ చేస్తున్న చిత్రమే ‘ఆయ్’. గోదావరి జిల్లాల్లో కుర్రాళ్ల అల్లరి గురించి చెప్పే ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది.

Aay Trailer Is Out Now: ముగ్గురు ఫ్రెండ్స్.. వారి జీవితాల చుట్టూ తిరిగే కథ. మధ్యలో కామెడీ. ఇది ఎప్పటినుండో టాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ఫార్ములా. ఇప్పుడు అదే ఫార్ములాతో ముగ్గురు గోదావరి కుర్రాళ్లు ప్రేక్షకులను నవ్వించడానికి వచ్చేస్తున్నారు. వాళ్లే నార్నే నితిన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య. ఈ ముగ్గురు లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రమే ‘ఆయ్’. డిఫరెంట్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో ఎంత ఫన్ ఉండబోతుందో.. ట్రైలర్‌తోనే హింట్ ఇచ్చాడు దర్శకుడు అంజి కే మణిపుత్ర. పలు ప్యాండ్ ఇండియా చిత్రాలకు పోటీగా ఈ సినిమాను విడుదల చేశాడు.

అన్నింటిలో గొడవ..

‘ఆయ్’ ట్రైలర్ ఒక స్కూల్‌లో మొదలవుతుంది. ‘‘ఏరా సుబ్బు.. ఈ లవ్ లెటర్ ఇచ్చింది నువ్వేనా’’ అని టీచర్ అడుగుతుంది. లెటర్ ఇచ్చింది నేనే కానీ రాసింది మాత్రం కార్తిక్ అంటూ తన ఫ్రెండ్‌ను బుక్ చేస్తాడు సుబ్బు. దీంతో టీచర్ తనను కొడుతుంది. అలా నితిన్, రాజ్‌కుమార్, అంకిత్.. చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అని అర్థమవుతుంది. పెద్దయ్యాక కూడా ఊరి మొత్తంలో యెదవలు ఎవరు అని అడిగితే ఈ ముగ్గురి పేర్లే చెప్పేలా తయారవుతారు. అల్లరిగా తిరుగుతూ, ఏ పనిని సీరియస్‌గా తీసుకోకుండా, ఊళ్లో అందరినీ ఏడిపిస్తూ ఉంటారు. ఆఖరికి బిర్యానీ, క్రికెట్ లాంటి విషయాల్లో కూడా గొడవలు పడుతుంటారు.

క్యాస్ట్ ఫీలింగ్..

‘‘ప్రతీ జనరేషన్‌లో ఊరికి ఇలాంటివాళ్లు ఉంటారు. టార్చ్ బేరర్‌లాగా టార్చ్ బేవర్స్ అనమాట’’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌లోనే నితిన్, రాజ్‌కుమార్, అంకిత్ క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయో హింట్ ఇచ్చాడు దర్శకుడు. అలా అల్లరిగా తిరుగుతున్న నితిన్ లైఫ్‌లోకి పల్లవి అలియాస్ నయన్ సారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఇక నయన్ సారిక క్యారెక్టర్ కూడా అల్లరి చేసే అమ్మాయిలాగానే అనిపిస్తుంది. దాంతో పాటు తనకు క్యాస్ట్ ఫీలింగ్ కూడా చాలానే ఉంటుంది. పైగా ‘ఆయ్’ సినిమాలో రాజ్‌కుమార్ కసిరెడ్డికి డబుల్ మీనింగ్ డైలాగులు కూడా ఉన్నాయని ట్రైలర్‌తోనే అర్థమవుతోంది. మొత్తానికి నితిన్, నయన్ సారికను కలపాలని తన ఫ్రెండ్స్ నిర్ణయించుకుంటారు.

ఉప్పెన సినిమానే..

‘‘పల్లవిని ప్రేమిస్తే వాడికి, వాడి ఫ్రెండ్స్‌కు ఉప్పెన సినిమానే’’ అంటూ హీరోయిన్ ఫ్యామిలీ గురించి వార్నింగ్ ఇస్తాడు ఒక వ్యక్తి. నయన్ సారిక చూపించే టార్చర్ తట్టుకోలేక ‘‘ఈ అమ్మాయే ఇలా ఉందా లేక అందరు అమ్మాయిలు ఇలాగే ఉన్నారా’’ అని ఫీల్ అవుతుంటాడు నితిన్. కానీ తన లవ్‌ను మాత్రం పక్కన పెట్టడు. చివరికి హీరోయిన్‌కు క్యాస్ట్ ఫీలింగ్ తెలిసేలా తను చివరిలో చెప్పే క్యాస్ట్ డైలాగ్.. ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది. ‘ఆయ్’ ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ సినిమాలో పెద్దగా సీరియస్ ట్విస్టులు ఏమీ లేకుండా సాఫీగా సాగుపోతుందని అనిపిస్తుంది. ఆగస్ట్ 15న పలు పెద్ద చిత్రాలకు పోటీగా ‘ఆయ్’ కూడా థియేటర్లలో సందడి చేయనుంది.

Also Read: ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ విడుదల - ఈసారి యాక్షన్, రొమాన్స్ అంతా డబుల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
Dussera Holidays: అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
RP Patnaik : ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Second Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లతపవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్‌ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
Dussera Holidays: అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
RP Patnaik : ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
Ysrcp: జిల్లా అధ్యక్షుల మార్పు - వైసీపీకి ఏ మేరకు లాభం?
జిల్లా అధ్యక్షుల మార్పు - వైసీపీకి ఏ మేరకు లాభం?
YS Jagan: 'తిరుపతి లడ్డూ టేస్ట్ వేరే ఏ లడ్డూలోనూ ఉండదు' - రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారని జగన్ సూటి ప్రశ్న
'తిరుపతి లడ్డూ టేస్ట్ వేరే ఏ లడ్డూలోనూ ఉండదు' - రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారని జగన్ సూటి ప్రశ్న
T20 World Cup 2024 : మహిళల టీ 20 ప్రపంచ కప్‌? - ఈ విషయాలు మీకు తెలుసా?
మహిళల టీ 20 ప్రపంచ కప్‌? - ఈ విషయాలు మీకు తెలుసా?
Tax Changes From 1st Oct: మీ జేబుకు చిల్లుపెట్టే కొత్త టాక్స్‌ రూల్స్‌ - అక్టోబర్‌ 01 నుంచే అమలు!
మీ జేబుకు చిల్లుపెట్టే కొత్త టాక్స్‌ రూల్స్‌ - అక్టోబర్‌ 01 నుంచే అమలు!
Embed widget