![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Naresh: కారులో బార్.. వారెవ్వా నరేష్ కార్ల కలెక్షన్స్ చూస్తే ఔరా అంటారు, దేనికదే ప్రత్యేకం!
Naresh: సీనియర్ ఆర్టిస్ట్ నరేశ్‌కు కార్లంటే ఎంత ఇష్టమో ఇప్పటికే పలుమార్లు బయటపెట్టారు. తాజాగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. కార్ల కలెక్షన్స్ చూపిస్తూ వాటి వెనుక కథలను కూడా వివరించారు.
![Naresh: కారులో బార్.. వారెవ్వా నరేష్ కార్ల కలెక్షన్స్ చూస్తే ఔరా అంటారు, దేనికదే ప్రత్యేకం! Naresh shows his car collection and shares a story about how his father gifted him a car Naresh: కారులో బార్.. వారెవ్వా నరేష్ కార్ల కలెక్షన్స్ చూస్తే ఔరా అంటారు, దేనికదే ప్రత్యేకం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/17/1656cd07625d3c2d713eeba8f649f1911715960097348239_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Naresh Cars Collection: సీనియర్ హీరో కృష్ణ, విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నరేశ్. హీరోగా ఎన్నో సినిమాలు చేసి ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయిపోయారు. ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ వల్ల కూడా నరేశ్ పలుమార్లు వార్తల్లో నిలిచారు. తాజాగా తన కుటుంబం గురించి, తల్లిదండ్రుల గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తూ.. నరేశ్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూను ఇచ్చారు. అందులో తన తండ్రి కృష్ణ కార్ కలెక్షన్స్‌ను చూపించారు నరేశ్. తనకు కార్లంటే విపరీతమైన ఇష్టమని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో బయటపెట్టారు. తాజాగా ప్రతీ కారును చూపిస్తూ, దాని బ్యాక్ స్టోరీని వివరించారు.
నాన్న గిఫ్ట్..
అప్పట్లోనే నరేశ్‌కు బెన్జ్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు కృష్ణ. దాని గురించి నరేశ్ చెప్తూ.. ‘‘అప్పట్లో ఎవరికీ లేని కార్ నా దగ్గర ఉండాలని కొన్నారు. దాదాపు 15 ఏళ్లు అయిపోయింది. ఎస్ క్లాస్ బెన్జ్ ఇది. అప్పట్లోనే దీని ఖరీదు రూ.1 కోటి. ఇప్పుడు దాదాపు రూ.3 నుంచి 4 కోట్ల వరకు ఉంటుంది. ఆయన బర్త్‌డేకు నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇది మా ఫ్యామిలీ ఫ్లాగ్‌షిప్ లాంటిది. అప్పట్లో అమ్మ, నాన్నతో కలిసి ఏ ఫంక్షన్‌కు వెళ్లాలన్నా ఈ కారులోనే వెళ్లేవాళ్లం. ఎప్పుడో ఒకసారి మాత్రమే దీనిని ఓపెన్ చూసి చూస్తాను. ఇప్పటికీ లోపల కూర్చుంటే వాళ్ల ఎనర్జీ తగులుతుంది. మంచిగా అనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు నరేశ్.
స్పెషల్ డిజైనింగ్..
కృష్ణ గిఫ్ట్ ఇచ్చిన కార్లతో పాటు నరేశ్ దగ్గర మరెన్నో కార్ల కలెక్షన్స్ ఉన్నాయి. అన్ని కార్లు ఎందుకని అమ్మ ఎప్పుడూ తిడుతుండేవారని నరేశ్ గుర్తుచేసుకున్నారు. ఆడవారికి నగలు ఎలాగో.. మగవారికి కార్లు అలాగా అని తన స్టైల్‌లో చెప్పారు. ఆ తర్వాత తన రెగ్యులర్ పర్సనల్ కారును చూపించారు. అది దాదాపుగా ఒక చిన్న సైజ్ రూమ్‌లాగానే ఉంది. బిజినెస్ క్లాస్ ఫ్లైట్ లాంజ్‌ను పోలినట్టుగా ఉంది. కారు వెనక సీట్‌లో రెండే చైర్స్ ఉన్నా కూడా అక్కడే చిన్న డైనింగ్ టేబుల్ సెటప్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు నరేశ్. అదొక చిన్న సైజ్ బారని, రిలాక్స్ అవ్వడానికి ఈ కారు పనికొస్తుందని అన్నారు. ఈ కారును ఇండియాలోని పాపులర్ డిజైనర్ అయిన దిలీప్ చాబ్రీ డిజైన్ చేశారని అన్నారు. దానిని ముంబాయ్‌లో డిజైన్ చేయించానని తెలిపారు. ఆయన అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ల కార్లను డిజైన్ చేశారని చెప్పుకొచ్చారు.
Taking my dream boat for a spin to Ramoji Film City ♥️ pic.twitter.com/FBpyRYd7Nw
— H.E AMB LTCOL SIR Naresh VK actor (@ItsActorNaresh) May 15, 2024
అందరితో క్లోజ్..
దాంతో పాటు నరేశ్ దగ్గర మరో రెండు హై ఎండ్ మోడల్ కార్లు కూడా ఉన్నాయి. 90ల్లో నటీనటులలో దాదాపు అందరితో ఆయనకు మంచి బాండింగ్ ఉందని చెప్పారు నరేశ్. రజినీకాంత్, కమల్ హాసన్‌ను చిన్నప్పటి నుంచి ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నానని బయటపెట్టారు. ఒకప్పుడు రజినీకాంత్‌ను ఒకసారి చూస్తే చాలు అనుకునేవాడిని అని, ఇప్పుడు ఆయన చేతుల మీదుగా ఏకంగా అవార్డ్ అందుకున్నానని సంతోషం వ్యక్తం చేశారు. అలా నరేశ్ ఇంట్లో.. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన కలిసి నటించిన చాలామంది నటీనటులతో ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. బాలకృష్ణతో ఆయనకు మంచి బాండింగ్ ఉందని, తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు నరేశ్.
Also Read: కృష్ణ, విజయ నిర్మల మధ్య గొడవలు- నరేష్ ఏం చెప్పారంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)