Sundarakanda First Review - 'సుందరకాండ' ఫస్ట్ రివ్యూ: ఇంటర్వెల్ మెయిన్ హైలైట్... రోహిత్ నటన, కామెడీ సూపర్బ్ - 'సోలో' హీరోగా హిట్ వచ్చినట్టేనా!?
Sundarakanda Review Telugu: నారా రోహిత్ హీరోగా నటించిన తాజా సినిమా 'సుందరకాండ'. వినాయక చవితి పండక్కి... ఆగస్టు 27న థియేటర్లలోకి వస్తోంది. సెన్సార్ టాక్, ఫస్ట్ రివ్యూ తెలుసుకోండి.

Nara Rohith's Sundarakanda First Review Telugu: నారా రోహిత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'సుందరకాండ'. కుటుంబ కథలతో రోహిత్ చిత్రాలు చేసిన ప్రతిసారీ ఆయనకు విజయాలు వచ్చాయి. 'సుందరకాండ' ప్రచార చిత్రాలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ప్రామిసింగ్‌గా అనిపించాయి. మరి, సినిమా ఎలా ఉంది? ఈ సినిమాకు సెన్సార్ నుంచి ఎటువంటి రిపోర్ట్ వచ్చింది? ఆల్రెడీ సినిమా చూసిన జనాలు ఏమంటున్నారు? ఫస్ట్ రివ్యూలో తెలుసుకోండి.
ఇంటర్వెల్ ముందు రెండు ప్రేమకథలు...
ఎవరూ ఊహించని సిట్యువేషన్‌తో విరామం!
'సుందరకాండ'కు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడు. ఆయనకు మొదటి చిత్రమిది. ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా సరే ఎటువంటి తడబాటు లేకుండా సినిమా తీశారని ఆల్రెడీ చూసిన జనాలు చెప్పిన మాట. సినిమా మొదలైన 10 నిముషాల్లో అసలు కథ స్టార్ట్ చేశారని తెలిసింది.
హీరో (నారా రోహిత్) ఎటువంటి వాడు? కాబోయే భార్య నుంచి అతను కోరుకునేది ఏమిటి? అమ్మాయిలో ఉండాల్సిన ఐదు లక్షణాలు ఏమిటి? అనేది మొదటి నుంచి చాలా ఆసక్తికరంగా చూపించారట.
'అయినా నువ్వేంట్రా? అయితే పెద్దోళ్ళను లవ్ చేస్తావ్! లేదంటే చిన్నోళ్లను లవ్ చేస్తావ్! నీ వయసు ఉన్నోళ్లు దొరకరా?' అని హీరోతో సత్య ఒక డైలాగ్ అంటారు గుర్తుందా? ట్రైలర్‌లో చూపించారు. ఆ రెండు ప్రేమ కథలను ఫస్టాఫ్‌లో చూపించడం ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందని తెలిసింది. సినిమా విడుదలకు ముందు సాంగ్స్ హిట్ అయ్యాయి. అందులో మూడు పాటలు ఇంటర్వెల్ ముందు వచ్చాయట. పాటలు వచ్చే సందర్భాలు సైతం బావున్నాయని తెలిసింది. ఎవరూ ఊహించని పాయింట్ తీసుకుని ఇంటర్వెల్ ఇచ్చారట.
సిట్యువేషనల్ కామెడీ బావుంది... రోహిత్ ఈజ్ బ్యాక్!
'సుందరకాండ'కు మెయిన్ హైలైట్ ఇంటర్వెల్ అని తెలిసింది. ఎవరూ ఊహించని సిట్యువేషన్ తీసుకుని ఇంటర్వెల్ ఇచ్చిన తర్వాత, ఆడియన్స్ షాక్ అయ్యాక... ఈ సినిమా దర్శకుడు కథను నడిపించిన తీరు బావుందట. కథతో పాటు కామెడీ ఉండటం సినిమాకు మెయిన్ ప్లస్ అంటున్నారు. సత్య - సునైనా జోడీ బాగుందని, వాళ్లిద్దరి సన్నివేశాలు సైతం బావున్నాయని సెన్సార్ టాక్. వాళ్లతో పాటు అభినవ్, వాసుకి, నరేష్ విజయ కృష్ణ, రూపలక్ష్మి సన్నివేశాలు సైతం బాగా వచ్చాయట.
కథానాయకుడికి ఎటువంటి షాక్ తగిలింది? దాన్నుంచి బయటపడి ప్రేమలో ఎలా విజయం సాధించాడు? తన ప్రేమను ఎలా గెలిచాడు? అనేది కథాంశం అని, ఈ కథను ఆద్యంతం ఆసక్తికరంగా చెప్పారని తెలిసింది. ముఖ్యంగా నారా రోహిత్ నటన అందరికీ మెప్పించేలా, ఆకట్టుకునేలా ఉందని, 'సుందరకాండ'తో నారా రోహిత్ ఈజ్ బ్యాక్ అనడం గ్యారంటీ అని రిపోర్ట్ వచ్చింది.
Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌పై నారా రోహిత్ రియాక్షన్ అదేనా? సింపుల్‌గా హర్ట్ చేయకుండా చెప్పేశారా?
ప్రేక్షకుల ఊహకు అందని విధంగా స్క్రీన్ ప్లే సాగింది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే రెండు పాటలు సైతం బావున్నాయని, కుటుంబం అంతా కలిసి చూసే చక్కటి సినిమా 'సుందరకాండ' అని మంచి రిపోర్ట్ వచ్చింది. పండక్కి ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాగా 'సుందరకాండ' థియేటర్లలోకి వస్తోంది. మరి రిలీజ్ అయ్యాక ఆడియన్స్ నుంచి ఎటువంటి టాక్ వస్తుందో చూడాలి.
'సుందరకాండ' రన్ టైమ్ ఎంత? ఎవరెవరు ఉన్నారు?
Sundarakanda Movie 2025 Runtime: 'సుందరకాండ'కు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్లలో రన్ టైమ్ ఒకటి. సినిమా నిడివి 2.15 గంటలు మాత్రమే. ఇందులో శ్రీదేవి విజయ్ కుమార్ ఒక హీరోయిన్. వృతి వాఘాని మరొక హీరోయిన్. నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం, విశ్వంత్, రూప లక్ష్మి, సునైనా, రఘు బాబు ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమాను సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) పతాకంపై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మించారు.





















