అన్వేషించండి

Sundarakanda Glimpse: ‘సుందరకాండ’ గ్లింప్స్ - కొత్త ప్రేమకథ చెప్తానంటున్న నారా రోహిత్

Nara Rohit Sundarakanda: నారా రోహిత్ హీరోగా ఒక ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దాని పేరే ‘సుందరకాండ’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్.

Nara Rohit Upcoming Movie Titled As Sundarakanda: ఒకవైపు కమర్షియల్ సినిమాలను, మరోవైపు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసే హీరోల్లో నారా రోహిత్ కూడా ఒకరు. ఓవైపు ‘ప్రతినిధి 2’ లాంటి పొలిటికల్ థ్రిల్లర్‌లో నటిస్తూనే మరోవైపు ఒక అందమైన లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. తాజాగా హీరోగా తన కెరీర్‌లో తెరకెక్కుతున్న 20వ చిత్రంపై నారా రోహిత్.. ఒక అప్డేట్‌ను విడుదల చేశాడు. తన అప్‌కమింగ్ మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించాడు. ఇక టైటిల్ కూడా ఇప్పటివరకు పలు తెలుగు చిత్రాలకు ఉపయోగించిన అచ్చ తెలుగు టైటిలే.

కాలేజ్ స్టూడెంట్ పాత్రలో..

నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడి అనే దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకు ‘సుందరకాండ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక మూవీ ఫస్ట్ లుక్ చూస్తుంటే నారా రోహిత్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. పైగా ఇందులో తను ఒక కాలేజ్ స్టూడెంట్ పాత్రలో నటించనున్నట్టు తన చేతిలో ఉన్న పుస్తకం చూస్తే అర్థమవుతుంది. ఒక చేతిలో పుస్తకం, మరొక చేతిలో మొక్క పట్టుకొని నారా రోహిత్ చాలా కూల్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక నారా రోహిత్ అన్ని సినిమాల్లోని లుక్స్‌తో పోలిస్తే ఇదే చాలా కూల్‌గా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఎవర్‌గ్రీన్ సినిమాలతో పోలిక..

ఇక ‘సుందరకాండ’కు సంబంధించిన ఫస్ట్ లుక్ మాత్రమే కాకుండా గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఇందులో ప్రేమ గురించి నారా రోహిత్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఈ ప్రపంచంలోని అన్నింటిలో ప్రేమ అనేది ఉంటుందని చెప్తూనే.. టాలీవుడ్‌లో కొన్ని క్లాసిక్ లవ్ స్టోరీ సినిమాలను గుర్తుచేశాడు హీరో. ‘ఖుషి’, ‘ఆర్య’, ‘గీతాంజలి’, ‘ఏమాయ చేశావే’, ‘మురారి’ లాంటి సినిమాలను గుర్తుచేస్తూ.. తన ప్రేమకథ అంత గొప్పగా ఉండకపోయినా.. బాగానే ఉంటుందని చెప్తూ తన క్యారెక్టర్ పేరు సిద్ధార్థ్ అని రివీల్ చేశాడు నారా రోహిత్. ఇక ‘సుందరకాండ’ చూసిన ప్రేక్షకులంతా నారా రోహిత్ దగ్గర నుండి ఇలాంటి ఒక లవ్ స్టోరీ ఊహించలేదని ఆశ్చర్యపోతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Venkatesh Nimmalapudi (@v_nimmalapudi)

వినాయక చవితికి..

‘సుందరకాండ’ ఫస్ట్ లుక్‌లోనే రిలీజ్ డేట్‌ను కూడా రివీల్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 6న వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు. చాలామంది యూత్‌కు ఈ కథ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సంతోష్ చిన్నపొల్లా, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహాంకాళి.. ‘సుందరకాండ’ను నిర్మిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై మూవీ తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ‘ప్రతినిధి 2’ను షూటింగ్ పూర్తి చేసుకున్న నారా రోహిత్.. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.

Also Read: ‘ఉలఝ్’ టీజర్: సీక్రెట్ మిషన్ కోసం జాన్వీ కపూర్ రిస్క్ - ప్రాణాలు ఇవ్వు లేదా తీస్కో!

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
Eshwar Sai Madhuri Rathod : నా భర్తను వదులుకోను... అంతా సెటిల్ - ఇక అపేయండి... ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి భార్య రియాక్షన్
నా భర్తను వదులుకోను... అంతా సెటిల్ - ఇక అపేయండి... ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి భార్య రియాక్షన్
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Embed widget