(Source: Poll of Polls)
Nara Rohit: ఏపీ రాజకీయాలపై నారా రోహిత్ హాట్ కామెంట్స్ - 'ప్రతినిధి 2' వాయిదాపై ఏమన్నాడంటే!
Nara Rohit: ప్రభుత్వం పథకాలు, ఏపీ రాజకీయాలపై నారా రోహిత్ హాట్ కామెంట్స్ చేశారు. అలాగే తన మూవీ 'ప్రతినిధి 2' వాయిదాపై కూడా నారా రోహిత్, డైరెక్టర్ మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Nara Rohit Comments on Prathinidhi 2 Movie Postponed: లాంగ్ గ్యాప్ తర్వాత నారా రోహిత్ నటించిన లేటెస్ట్ మూవీ 'ప్రతినిధి 2'. తొమ్మిదేళ్ల కిందట వచ్చిన ప్రతినిధికి చిత్రానికి ఇది సీక్వెల్. ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా వాయిదా పడింది. ఈ మూవీ రిలీజ్ నేపథ్యంలో ప్రమోషన్‌లో భాగంగా 'ప్రతినిధి 2' టీం ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ ఇంటర్య్వూలో నారా రోహిత్, ఈ మూవీ డైరెక్టర్ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రతినిధి 2లో నారా రోహిత్ పాత్ర చూసి అంతా నారా లోకేష్ అనుకుంటున్నారని డైరెక్టర్ మూర్తి అన్నారు. నారా లోకేష్ జర్నలిస్ట్‌గా ఎప్పుడు, ఎక్కడ చేశారో తనకు అర్థం కావట్లేదంటూ అసహనం చూపించారు. అలాంటిది ఏమైనా ఉంటే తానే నేరుగా అనౌన్స్ చేస్తాను కదా అని, 'ప్రతినిధి 2' ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడిని ఉద్దేశించి చేసింది కాదన్నారు.
'లీడర్' సినిమాలో నాకు ఎక్కడా జగన్ కనిపించలేదు..
అలాంటి సినిమా అయితే ముందే చెబుతాం అన్నారు. ఇక శేఖర్ కమ్ముల, రానా 'లీడర్' మూవీ టైంలోనూ ఇలాంటి కామెంట్సే వచ్చాయని గుర్తు చేశారు. తాను ఆ మూవీ చూశానని, చాలా బాగా అనిపించిందన్నారు. అది చూసి అంతా వైఎస్ జగన్ ఉద్దేశించి చేసిందన్నారు. కానీ, తనకు ఎక్కడ కూడా జగన్ కనిపించలేదని, రాజకీయలపై చాలా క్లీన్‌గా తీసిన చిత్రమని పేర్కొన్నారు. ఇక తమ సినిమాలో పథకాల అంశమే ప్రధానంగా తీసుకున్నట్టు కనిపించారు. మరి పథకాల విషయంలో ఉద్దేశం ఏంటని యాంకర్ ప్రశ్నించారు. దీనికి రోహత్ స్పందిస్తూ పథకాలు, డెవలప్‌మెంట్ రెండు సమతౌల్యంగా ఉండాలన్నారు. డేవలప్‌మెంట్ లేకుంటే పథకాలు అమలు చేయలేమని, ఎక్కడ డేవలప్‌మెంట్ ఉంటుందో అక్కడ పథకాలకు అమలుకు నిధులు సమకూరుతాయంటూ అభిప్రాయపడ్డాడు నారా రోహిత్.
ఇదే ప్రశ్నకు డైరెక్టర్ మూర్తి స్పందించారు. "తాను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చానన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చారు. తాను ఆ రేషన్ బియ్యం తిని బతికినవాడిని. అలాగే ప్రభుత్వం స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీ చదివి పైకి వచ్చాను. ప్రభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యం తిని ప్రభుత్వ స్కూల్, కాలేజిలో చదివి ఈ స్థాయి వచ్చాను. అదే నన్ను అవే రేషన్ బియ్యం తిని బతకమంటే మా ఊర్లోనే ఏదో పని చేసుకుని బతికేవాడిని. ఇప్పుడు ఇలా మీ ముందు ఉండేవాడిని కాదు. కాబట్టి వెల్ఫెర్‌తో పాటు డెవలప్‌మెంట్ కూడా ఉండాలి. వెల్ఫెరే కావాలంటే డెవలప్‌మెంట్ ఉండదు. డెవలప్‌మెంట్ కావాలంటే వెల్ఫేర్ ఉండదు. దానివల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు.
రోహిత్ నటించిన 'ప్రతినిధి 2'లో పొలిటికల్ నేపథ్యంలో ఉన్న కారణంగా మీ సినిమా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఉండోచ్చనే వాదనలు వస్తున్నాయని, దీనివల్ల మీ సినిమా రిలీజ్‌ను ఆపడం వంటిది జరుగే అవకాశం కనిస్తుందా? అని యాంకర్ అడగ్గా.. మనది డెమోక్రటిక్ దేశమని, నా వరకు నేను సినిమా చేశాను. ఇక దాన్ని ఆపే శక్తి వారికి ఉంటే ఆపుకోనివ్వండి.దానికి నేను ఏం చేయలేను కదా. అధికారం నా చేతుల్లో లేదు కదా. అధికారం ఉందని సినిమాని ఆపాలనుకుంటే ఆపుకోనివ్వండి. నటుడిగా నా పని సినిమా తీయడం.. సినిమా చేశాను. ఇక ఆపాలనుకుంటే వారి ఇష్టం" అంటూ నారా రోహిత్ వ్యాఖ్యానించాడు.
Also Read: హాట్‌టాపిక్‌గా రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' రెమ్యునరేషన్ - ఎంతో తెలుసా?