అన్వేషించండి

Saripodhaa Sanivaaram Glimpse - ‘సరిపోదా శనివారం‘ గ్లింప్స్: వారంలో ఒక్క రోజు మాత్రమే కోపం చూపించే పిచ్చినా కొడుకుని చూశారా?

నేచురల్ స్టార్ నానికి ‘సరిపోదా శనివారం’ టీమ్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ విడుదల చేసింది. పనిలో పనిగా మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది.

Nani Saripodhaa Sanivaaram Glimpse Out: ‘దసరా’, ‘హాయ్ నాన్న’ సినిమాల బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న నాని, అదే ఊపులో మరో సినిమా చేస్తున్నారు. ‘సరిపోదా శనివారం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ లో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.   

నానికి మర్చిపోలేని బర్త్ డే గిఫ్ట్!

ఇవాళ టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని బర్త్ డే. 39 వసంతాలు పూర్తి చేసుకుని 40వ ఏట అడుగు పెట్టారు. ఫిబ్రవరి 24, శనివారం నాడు ఆయన పుట్టిన రోజు కావడంతో ‘సరిపోదా శనివారం’ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో నాని సూర్య అనే యువకుడి పాత్రలో కనిపించాడు. తమిళ యాక్టర్ ఎస్ జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు.

"కోపాలు రకరకాలు. ఒక్కొక్క మనిషి కోపం ఒక్కోలాగా ఉంటుంది" అంటూ సూర్య వాయిస్‌ తో ‘శనివారం గ్లింప్స్’ గ్లింప్స్ ప్రారంభం అవుతుంది. ఈ సినిమాలో నానికి విపరీతమైన కోపం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆ కోపాన్ని ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా కేవలం శనివారం రోజు మాత్రమే చూపించాలని నిర్ణయం తీసుకుంటాడు. అలాంటి నిర్ణయం తీసుకున్న నాని జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఈ గ్లింప్స్‌ లో నాని లుక్, స్టైల్ ఆకట్టుకుంటోంది. గ్లింప్స్ చివరల్లో హ్యాపీ బర్త్ డే బ్రదర్ అంటూ ఎస్‌జే సూర్య చెప్పిన డైలాగ్, నవ్వు ఆకట్టుకుంటోంది. అదే సమయంలో పోలీస్ స్టేషన్ లో చుట్టూ రౌడీలు, రక్తం మరకలతో పోలీస్ యూనిఫామ్‌ లో ఎస్ జే సూర్య వికటాట్టహాసం సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఆగస్టు 29న పలు భాషల్లో విడుదల

పనిలో పనిగా ‘సరిపోదా శనివారం’ సినిమా రిలీజ్ డేట్ ను సైతం మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ఆగస్టు 29న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు గ్లింప్స్ ఎండ్ లో వెల్లడించారు. పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ ను ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎస్‌వీసీ సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రాండ్‌గా విడుదల చేయబోతుంది. ఈ సినిమా కోసం నాని, వివేక్ ఆత్రేయ రెండోసారి కలిసి పని చేస్తున్నారు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. మురళి జి సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Read Also: ఎన్‌‌టీఆర్, అల్లు అర్జున్‌తో తలపడాలని ఉంది - బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ వింత కోరిక

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget