News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Nani: అందుకే రాజమౌళిని విష్ చేయలేదు, ఒక మెసేజ్ కూడా పెట్టలేదు: నాని

ఎపిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆర్ఆర్ఆర్' కు ఆస్కార్ కు వచ్చిన తర్వాత డైరెక్టర్ రాజమౌళికి పర్సనల్ గా మెసేజ్ కూడా చేయలేదని హీరో నాని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాని చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..

FOLLOW US: 
Share:

Nani : శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, హీరోయిన్ కీర్తి సురేష్ జంటగా నటించిన 'దసరా' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని మూటగట్టుకుంది. ఇటీవలే రూ.100కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా విజయంలో మునిగిపోయిన నాని, దర్శక ధీరుడు రాజమౌళితో తన బంధాన్ని, సాన్నిహిత్యాన్ని గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని ‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్ వచ్చిన తర్వాత రాజమౌళికి వ్యక్తిగతంగా విష్ చేయలేదంటూ నాని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

హీరో నాని, డైరెక్టర్ రాజమౌళిల మధ్య ఎప్పట్నుంచో మంచి రిలేషన్ ఉంది. వీరిద్దరి కాంబోలో 2012లో వచ్చిన 'ఈగ' సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ ఈగ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కలెక్ట్ చేసింది. అంతే కాదు ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగానూ నిలిచింది. ఆ తర్వాత 60వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లోనూ రెండు అవార్డులను కైవసం చేసుకుంది.

అంతే కాదు వారిద్దరూ కలిసి 2006లో వచ్చిన 'మజ్ను' సినిమాలోనూ నటించారు. ఈ సినిమాలో నాని హీరోగా చేయగా, రాజమౌళి ఓ అతిథి పాత్రలో కనిపించారు. అంతేకాదు రాజమౌళి దర్శకత్వం వహించే నెక్స్ట్ ప్రాజెక్టులో హీరో ప్రిన్స్ మహేశ్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. నాని కూడా ఓ పాత్ర పోషిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయ్. ఈ సినిమా 'గ్లోబ్-ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్' అని కూడా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అంతే కాదు వీరిద్దరి కాంబినేషన్ లో అప్పట్లో వచ్చిన 'ఈగ'కు సీక్వెల్ పైనా రాజమౌళితో చర్చలు జరుపుతున్నట్టు ఇటీవల నాని ప్రకటించారు.

ఇదిలా ఉండగా నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వచ్చిన మాస్ అండ్ ఎంటర్టైనర్ చిత్రం 'దసరా' సైతం పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై మంచి హిట్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ‘బాహుబలి’ డైరెక్టర్ రాజమౌళి సైతం నాని నటనను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. రా నేచర్ తో కనిపించే రోల్స్, వైవిధ్యమైన పరిస్థితుల మధ్య శ్రీకాంత్ ఓదెల ఓ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుంచారన్న ఆయన. నాని కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడని కొనియాడారు. ఈ చిత్రంలో ప్రతి నటుడి పాత్ర గుర్తుండిపోయే విధంగా ఉందని, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయంటూ రాజమౌళి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 'దసరా' టీం మొత్తానికి తన తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఇక రాజమౌళి డైరెక్షన్ 2022లో వచ్చిన ఎపిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆర్ఆర్ఆర్' భారతీయ సినిమా ఖ్యాతిని మరోసారి చాటి చెప్పింది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. మూవీలోని నాటు నాటు సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా ఈ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డును దక్కించుకుని రికార్డు సృష్టించింది. ఇది ఇండియన్ సినిమాకే గర్వకారణమంటూ ఈ సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' లో భాగమైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పర్సనల్ గా కలిసి మరీ వారి మనోభావాలను పంచుకున్నారు.

 కానీ హీరో నాని మాత్రం 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ తర్వాత రాజమౌళికి కనీసం మెసేజ్ కూడా పెట్టలేదంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఆయన్ను ప్రపంచం మొత్తం పిలుస్తుందని తనకు ముందే తెలుసని, అందుకే మళ్లీ ఆయనను కలిసి విష్ చేయలేదని చెప్పారు. అంతకుముందుకు రాజమౌళికి ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలియజేశానని, దానికి ఆయన కూడా తనకు రిప్లై ఇచ్చారని స్పష్టం చేశారు. రాజమౌళితో తనకు కేవలం వృత్తిపరంగానే అనుబంధం లేదని, పర్సనల్ గానూ తన జీవితంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. రాజమౌళి తన ఫ్యామిలీ మెంబర్ లాంటివారన్న నాని.. తామిద్దరి మధ్య నటుడు దర్శకుడు అన్న సంబంధం ఉండదని చెప్పారు. పదేళ్ల క్రితం 'మక్కీ' (ఈగ) వల్ల తాము ఒక్కటయ్యామని తెలిపారు. ఈ పదేళ్లలో తామిద్దరం కలిసి చాలా సెలబ్రేషన్స్ చేసుకున్నామని,  ఇద్దరం కలిసి పొలానికి కూడా వెళ్తామని నాని స్పష్టం చేశారు.

Also Read : 'శాకుంతలం' రివ్యూ : సమంత సరిగా చేయలేదా? గుణశేఖర్ బాగా తీయలేదా?

Published at : 14 Apr 2023 07:06 PM (IST) Tags: RRR SS Rajamouli Eega Dasara Oscar awards Nani

ఇవి కూడా చూడండి

Skanda Review - 'స్కంద' రివ్యూ : యాక్షన్ విధ్వంసం - రామ్, బోయపాటి సినిమా ఎలా ఉందంటే?

Skanda Review - 'స్కంద' రివ్యూ : యాక్షన్ విధ్వంసం - రామ్, బోయపాటి సినిమా ఎలా ఉందంటే?

Animal Telugu Teaser: ‘యానిమల్’ టీజర్: నాకన్నా చెడ్డవాడు లేడు - రణ్ బీర్ ఊరమాస్ అవతార్ అదుర్స్!

Animal Telugu Teaser: ‘యానిమల్’ టీజర్: నాకన్నా చెడ్డవాడు లేడు - రణ్ బీర్ ఊరమాస్ అవతార్ అదుర్స్!

Chandramukhi 2 Review: చంద్రముఖి 2 రివ్యూ: రజనీ సినిమా సీక్వెల్‌లో రాఘవ లారెన్స్ భయపెట్టాడా? నవ్వించాడా?

Chandramukhi 2 Review: చంద్రముఖి 2 రివ్యూ: రజనీ సినిమా సీక్వెల్‌లో రాఘవ లారెన్స్ భయపెట్టాడా? నవ్వించాడా?

Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం

Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

టాప్ స్టోరీస్

ACB Court Judge Himabindu: జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్, అతనెవరంటే?

ACB Court Judge Himabindu: జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్, అతనెవరంటే?

Hyderabad Ganesh Laddu Auction 2023: కోటి 26 లక్షలు పలికిన గణేష్ లడ్డూ, బాలాపూర్‌ రికార్డు బ్రేక్‌, ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాదులోనే!

Hyderabad Ganesh Laddu Auction 2023: కోటి 26 లక్షలు పలికిన గణేష్ లడ్డూ, బాలాపూర్‌ రికార్డు బ్రేక్‌, ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాదులోనే!

Telangana Election 2023: ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ షెడ్యూల్‌-వచ్చే నెలలో 30 నుంచి 40 సభలు

Telangana Election 2023: ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ షెడ్యూల్‌-వచ్చే నెలలో 30 నుంచి 40 సభలు

World University Rankings 2024: వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకుల్లో 91 భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు

World University Rankings 2024: వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకుల్లో 91 భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు