By: ABP Desam | Updated at : 16 May 2022 12:07 PM (IST)
బాలకృష్ణ, ఎన్టీఆర్
మే 28... విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao Birth Anniversary) జయంతి. ఆ రోజు తెలుగు ప్రజలు అందరూ ఆయన్ను స్మరించుకునే రోజు. 1923లో ఆయన జన్మించారు. ఈ ఏడాది మే 23కు ఈ భూమి మీద ఆయన అడుగుపెట్టి వందేళ్లు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ (NTR) శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మస్థలమైన నిమ్మకూరులో మే 28వ తేదీ ఉదయం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఎన్టీఆర్ కుమారుడు, ప్రముఖ కథానాయకుడు, హిందూపూర్ ఎమ్మెల్యే 'నట సింహం' నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) చేతుల మీదుగా అత్యంత ఘనంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు.
తెలుగు ప్రజలు, సినిమా ప్రేక్షకుల గుండెల్లో నందమూరి తారక రామారావు స్థానం ఎప్పటికీ సుస్థిరమైనది. రాముడు, కృష్ణుడు... ఇలా ఎన్నో పాత్రలకు ఆయన ప్రాణం పోశారు. ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచారు. రాజకీయాల్లోకి వచ్చి అనతి కాలంలో ముఖ్యమంత్రి పదవి అధిష్టించిన ఆయన, ఎంతో సేవ చేశారు. తెలుగు భాషపై, తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం.
Also Read: బాలయ్య సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ - రోల్ ఏంటంటే?
మే 28వ తేదీ ఉదయం నిమ్మకూరులో ప్రారంభమైన శత జయంతి వేడుకలు, ఆ రోజు మధ్యాహ్నం గుంటూరులోనూ, సాయంత్రం తెనాలిలోనూ జరగనున్నాయి. ఆ తర్వాత ఈ ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారట. వాటిని సైతం బాలకృష్ణ ఆధ్వర్యంలో, ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలకు నందమూరి అభిమానులు, తెలుగు ప్రజలు భారీగా హాజరు కాబోతున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.
Also Read: విజయ్ దేవరకొండ, సమంత సినిమా 'ఖుషి' ఫస్ట్ లుక్ ఇదిగో, రిలీజ్ ఎప్పుడంటే?
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టిన ఊరు "నిమ్మకూరు" లో మే 28న ఉదయం నటసింహం నందమూరి
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 16, 2022
బాలకృష్ణ గారి చేతుల మీదుగా అత్యంత ఘనంగా ప్రారంభం కానున్న ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.#SrNtr #NBK #NandamuriBalakrishna pic.twitter.com/R4lBIiiKWJ
Nandamuri Kalyan Ram New Movie: గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్
Narayana Murthy: పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృవియోగం
Gudipoodi Srihari Is No More: సినీ విశ్లేషకులు గుడిపూడి శ్రీహరి కన్నుమూత
RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?
Pavitra Lokesh: నరేష్ తో రూమర్స్ - సినిమా ఛాన్స్ లు పోగొట్టుకున్న పవిత్ర?
Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్
Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?
President Elections: ప్రధానికి జగన్ ఆ కండీషన్స్ పెట్టుంటే బాగుండేది - మాజీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భారత ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు