Nandamuri Balakrishna: హీరోయిన్ అంజలితో బాలయ్య అనుచిత ప్రవర్తన - షాకింగ్ వీడియో వైరల్
Balakrishna and Anjali Video: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో షాకింగ్ సంగన చోటు చేసుకుంది. స్టేజ్‌పై హీరోయిన్ అంజలితో బాలకృష్ణ వ్యవహరించిన తీరు అందరికి షాకిస్తుంది.

Balakrishna Shocking Behavior with Anjali: రీసెంట్‌గా జరిగిన విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. అయితే స్టేజ్‌పై మాట్లాడిన ఆయన హీరోయిన్ అంజలితో ప్రవర్తించిన తీరు అందరికి షాకిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మే 31న విడుదల కానుంది.
ఈ క్రమంలో నిన్న హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కి బాలయ్య ముఖ్య అతిథిగా హాజరై ఫుల్ సందడి చేశారు. తన స్పీచ్‌తో మూవీ టీంలో ఫుల్ జోష్ నింపారు. ముఖ్యంగా విశ్వక్ సేన్‌పై ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా నిలిచాయి. తాను, విశ్వక్ కవలమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి బాలయ్య ఈ ఈవెంట్‌లో స్పీచ్‌తో అందరిని నవ్వించారు. అయితే స్టేజ్‌పైకి వచ్చిన బాలయ్య నటి అంజలితో వ్యవహరించిన తీరుకి ఆమె ఫ్యాన్స్ హట్ అవుతున్నారు.
View this post on Instagram
అసలేం ఏం జరిగిందంటే..
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టేజ్‌పైకి వచ్చిన బాలయ్య హీరోయిన్ అంజలిని పక్కకు జరుగు అంటూ సైగ చేశారు. ఆయన చెప్పడంతో అంజలి కాస్తా పక్కకు జరిగారు. అయినా ఇంకా జరగాలంటూ ఆయన అంజలిని చేతితో కాస్తా గట్టిగా తోశారు. బాలయ్య అలా చేయడంతో అంజలి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంతేకాదు బ్యాలెన్స్ తప్పి కిందపడబోయి ఆ లోపే మళ్లీ బ్యాలెన్స్ చేసుకుని నిలబడ్డారు. ఇక ఇదంతా వెనక నుంచి చూస్తున్న హీరోయిన్ నేహా శెట్టి బాలయ్య తీరుకు షాక్ అయ్యింది. ఆయన తీరు చూసి ఆమె అవాక్క్ అయ్యింది. కానీ, ఆ తర్వాత అంజలి గట్టిగా నవ్వడం..జరగలేదంటూ బాలయ్య ఆమె ఏదో అనడం.. ఆ వెంటనే ఇద్దరు (బాలకృష్ణ - అంజలి) హైఫై ఇచ్చుకున్నారు.
ఇదంతా సరదాగా జరిగిన హీరోయిన్ పట్ల ఆయన వ్యవహరించిన తీరును కొందరు తప్పుబడుతున్నారు. బాలయ్య హీరోయిన్‌తో అలా అనుచిత ప్రవర్తించడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. మరికొందరు మాత్రం ఆయన తీరే అంతా అని, ఈవెంట్‌లో ఆయన అంజలి నటనను కొనియాడారు. అది అనుకోకుండ జరిగిన సంఘటన అని, కావాలని చేసింది కాదని అర్థమైపోతుదంటూ కొందరు ఆయనకు సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ విషయానికి వస్తే.. ఇందులో విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్‌గా నటించగా.. అంజలి ఓ కీ రోల్ పోషిస్తుంది. ఈ సినిమా మే 31న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ కృష్ణ చైతన్య ఈ సినిమాను తెరకెక్కించారు.





















