NBK 109 Update: గండ్ర గొడ్డలితో బాలయ్య - శివరాత్రికి నటసింహం శివతాండవం!
NBK 109 Update: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో NBK 109 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ఓ బిగ్ అప్డేట్ వచ్చింది.
NBK 109 Update: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'NBK 109' అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య, 'వాల్తేరు వీరయ్య' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తెరక్కించిన బాబీ కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానుల కోసం మేకర్స్ తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ అందించారు. రేపు టైటిల్ అండ్ ఫస్ట్ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.
మహా శివరాత్రి కానుకగా మార్చి 8న NBK 109 టైటిల్ తో పాటుగా పవర్ ఫుల్ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ శివరాత్రికి వైలెన్స్ కు వెల్కమ్ చెప్పండి. బాలకృష్ణ కూలెస్ట్ క్రూయెలెస్ట్ రూపాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఫేస్ రివీల్ చేయకుండా ఓ అనౌన్స్ మెంట్ పోస్టర్‌ను వదిలారు. ఇందులో బాలయ్య జీపులో కూర్చొని చేతిలో ఒక గండ్ర గొడ్డలి పట్టుకొని ఉన్నాడు. దీన్ని బట్టి ఈ పండక్కి బాలయ్య శివ తాండవాన్ని, ఉగ్ర రూపాన్ని చూడబోతున్నామని చెప్పకనే చెప్పారు. ఇది చూసిన ఫ్యాన్స్ మరోసారి బాక్సాఫీస్ ఊచకోత గ్యారంటీ అని కామెంట్స్ చేస్తున్నారు.
Get ready to witness the COOLEST & CRUELLEST form of #NBK, this Maha Shivarathri! 💥🔥#NBK109Glimpse ~ Unveiling Tomorrow! 🤩#NBK109 #NandamuriBalakrishna @dirbobby @thedeol @Vamsi84 @KVijayKartik #SaiSoujanya @chakrif1 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/tmtYX38HlY
— Sithara Entertainments (@SitharaEnts) March 7, 2024
'NBK 109' చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా, ఒక పోలీసాఫీసర్ పాత్రలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అలానే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తెలుగు హీరోయిన్ చాందినీ చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం.
విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ఇంకా తెలియలేదు. నిజానికి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పటి వరకూ నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. రేపు రాబోయే 'NBK 109' టైటిల్ & ఫస్ట్ గ్లింప్స్ తో అన్ని విషయాలను వెల్లడించే అవకాశం ఉంది. శివరాత్రి రోజున ఏ టైంకి ఈ అప్డేట్స్ రిలీజ్ చేస్తారనేది మేకర్స్ వెల్లడించాల్సి ఉంది.
నందమూరి బాలకృష్ణ గత మూడేళ్ళుగా తన కెరీర్ లోనే మునుపెన్నడూ లేనంత ఫార్మ్ లో కొనసాగుతున్నారు. అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి వంటి బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్నారు. సరికొత్త కథాంశంతో ఇప్పుడు బాబీ దర్శకత్వంలో చేస్తున్న NBK 109 మూవీ కూడా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని, బాలయ్య సక్సెస్ ట్రాక్ కంటిన్యూ అవుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని తర్వాత సీనియర్ హీరో చేయబోయే సినిమా ఏంటనేది ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు.
Also Read: WOMEN'S DAY 2024: లేచింది మహిళా లోకం - పవర్ ఫుల్ ఫిమేల్ క్యారెక్టర్స్‌తో వచ్చిన లేటెస్ట్ సినిమాలివే!