అన్వేషించండి

Nagarjuna: అఖిల్ పెళ్లి చేసిన కొన్ని గంటల్లో డబ్బింగ్ థియేటర్‌కు... 'కుబేర' వర్క్ ఫినిష్ చేసిన నాగార్జున

Akhil Zainab Ravdjee Wedding: శుక్రవారం జూన్ 6న అఖిల్ - జైనాబ్ పెళ్లి జరిగింది. అబ్బాయి పెళ్లి చేసిన కొన్ని గంటలు కూడా అవ్వక ముందు సినిమా పనుల్లో పడ్డారు నాగార్జున.

ఇంట్లో అబ్బాయి పెళ్లి జరిగినప్పటికీ... ఇల్లంతా సందడి సందడిగా హడావిడిగా ఉన్నప్పటికీ... సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ చెప్పడానికి వచ్చి వ్యక్తి పట్ల తనకు ఎంత గౌరవం, ప్రేమ ఉన్నాయనేది చాటి చెప్పారు కింగ్ అక్కినేని నాగార్జున.

అఖిల్ పెళ్లి జరిగిన కొన్ని గంటల్లో...
'కుబేర' డబ్బింగ్ థియేటర్‌లో నాగర్జున!
అక్కినేని నాగార్జున రెండో కుమారుడు, యంగ్ హీరో అఖిల్ వివాహం జూన్ 6వ తేదీ (శుక్రవారం) తెల్లవారుజామున మూడున్నర గంటలకు జరిగింది. జూన్ 7వ తేదీ (శనివారం ఉదయం) నాగార్జున ఎక్కడ ఉన్నారో తెలుసా? అన్నపూర్ణ స్టూడియోలోని కుబేర సినిమా డబ్బింగ్ వర్క్ జరుగుతున్న థియేటర్‌లో!

Also Read'హౌస్‌ ఫుల్ 5' రివ్యూ: అడల్ట్ జోక్స్, హీరోయిన్స్ గ్లామర్ షో నమ్ముకున్న సినిమా... తెలుగు ప్రేక్షకులకు అక్షయ్ కుమార్ సినిమా నచ్చుతుందా? ఇది హిట్టా? ఫట్టా?

View this post on Instagram
 
A post shared by Annapurna Studios (@annapurnastudios)

శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ కథానాయకుడిగా, ‌నాగర్జున ఒక ప్రత్యేక ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'కుబేర'. నేషనల్ క్రష్ రష్మిక ఇందులో హీరోయిన్. జూన్ 20వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. విడుదలకు రెండు వారాల సమయం ముందే తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ అంతా ఫినిష్ చేశారు నాగార్జున. ఒక వైపు ఇంట్లో పెళ్లి పనులు ఆ హడావిడి ఉన్నప్పటికీ మరో వైపు సినిమా పనులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు.

Also Read: 'కితకితలు' హీరోయిన్ రీ ఎంట్రీ: 'బ్యాచిలర్స్ ప్రేమ కథలు'లో గీతా సింగ్... పూజతో మొదలైన సినిమా

ఆదివారం అన్నపూర్ణలో రిసెప్షన్!
అఖిల్ వివాహానికి అతి కొద్ది మంది మాత్రమే హాజరు అయ్యారు. ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యువ హీరో శర్వానంద్, రాజమౌళి తనయుడు కార్తికేయ, క్రికెటర్ తిలక్ వర్మ సహా అక్కినేని కుటుంబ సభ్యులు అందరూ సందడి చేశారు.

జూన్ 8వ తేదీ (ఆదివారం) అన్నపూర్ణ స్టూడియోలో రిసెప్షన్ జరగనుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా తెలుగు చిత్ర సీమలో అగ్ర హీరోలు, పలువురు ప్రముఖులు రిసెప్షన్‌కు హాజరు కానున్నారని తెలిసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan:  అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
Delhi Blast case : ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
CII Partnership Summit 2025 : భారీ పెట్టుబడితో ఏపీలోకి రెన్యూ కంపెనీ రీఎంట్రీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
భారీ పెట్టుబడితో ఏపీలోకి రెన్యూ కంపెనీ రీఎంట్రీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
Red Fort Blasts Conspiracy: 32 వాహనాలతో భారీ విధ్వంసానికి ప్లాన్! ఉగ్రవాదుల పాత్ర, రహస్యాలు బయటపెట్టిన దర్యాప్తు అధికారులు
32 వాహనాలతో భారీ విధ్వంసానికి ప్లాన్! ఉగ్రవాదుల పాత్ర, రహస్యాలు బయటపెట్టిన దర్యాప్తు అధికారులు
Advertisement

వీడియోలు

రోహిత్, కోహ్లీల కెరీర్‌లో విలన్‌గా మారిన బీసీసీఐ!
సంజూ కోసం జడ్డూని వదిలేస్తారా? CSKకి పిచ్చి పట్టింది: శడగొప్పన్ రమేష్
నితీష్‌కి బీసీసీఐ అన్యాయం.. మండిపడుతున్న తెలుగు ఫ్యాన్స్
SSMB 29 Priyanka Chopra First Look | రాజమౌళి - మహేశ్ సినిమా కొత్త అప్ డేట్ వచ్చేసింది | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan:  అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
Delhi Blast case : ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
CII Partnership Summit 2025 : భారీ పెట్టుబడితో ఏపీలోకి రెన్యూ కంపెనీ రీఎంట్రీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
భారీ పెట్టుబడితో ఏపీలోకి రెన్యూ కంపెనీ రీఎంట్రీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
Red Fort Blasts Conspiracy: 32 వాహనాలతో భారీ విధ్వంసానికి ప్లాన్! ఉగ్రవాదుల పాత్ర, రహస్యాలు బయటపెట్టిన దర్యాప్తు అధికారులు
32 వాహనాలతో భారీ విధ్వంసానికి ప్లాన్! ఉగ్రవాదుల పాత్ర, రహస్యాలు బయటపెట్టిన దర్యాప్తు అధికారులు
Emergency Fund : 2026కి ముందే ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోండిలా.. చిన్న పొదుపులతో పెద్ద భద్రత!
2026కి ముందే ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోండిలా.. చిన్న పొదుపులతో పెద్ద భద్రత!
Hyderabad News: హైదరాబాద్‌లో పెళ్లి వాయిదా పడిందని ఏషియన్ పెయింట్స్‌కు జరిమానా!
హైదరాబాద్‌లో పెళ్లి వాయిదా పడిందని ఏషియన్ పెయింట్స్‌కు జరిమానా!
Kondagattu Temple: కనీస సౌకర్యాల్లేవ్, ఇవ్వలేరు కానీ రేట్లు పెంచేస్తారా? కొండగట్టు దేవస్థాన ఆర్జిత సేవా రుసుం పెంపుపై బండి సంజయ్‌ ఆగ్రహం  
కనీస సౌకర్యాల్లేవ్, ఇవ్వలేరు కానీ రేట్లు పెంచేస్తారా? కొండగట్టు దేవస్థాన ఆర్జిత సేవా రుసుం పెంపుపై బండి సంజయ్‌ ఆగ్రహం  
Thalaivar 173 Director: కమల్ - రజనీకి షాక్ ఇచ్చిన సుందర్ సి... ఇప్పుడు స్టార్ హీరోలిద్దరూ ఏం చేస్తారో!?
కమల్ - రజనీకి షాక్ ఇచ్చిన సుందర్ సి... ఇప్పుడు స్టార్ హీరోలిద్దరూ ఏం చేస్తారో!?
Embed widget