Shiva Re Release Collection : 'శివ' రీ రిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ కుమ్మేశాయంతే - ఎన్నేళ్లైనా కింగ్ జోష్ తగ్గేదేలే... అప్పటితో పోలిస్తే...
Shiva Day 1 Collection : కింగ్ నాగార్జున ఒకప్పటి బాక్సాఫీస్ బిగ్గెస్ట్ హిట్ 'శివ' రీ రిలీజ్‌లోనూ అంతే జోష్‌తో దూసుకెళ్తోంది. ఫస్ట్ డే కలెక్షన్లపై మూవీ టీం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.

Nagarjuna Shiva Re Release Day 1 Collection : టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున కల్ట్ క్లాసిక్ 'శివ' శుక్రవారం థియేటర్లలో రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలోనే ఈ మూవీ ఓ సరికొత్త మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. నాగ్ కెరీర్‌లో ది బెస్ట్ మూవీ 'శివ'. ఈ సినిమాతోనే రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యారు. 1989లో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పుడు రీ రిలీజ్‌లోనూ అంతకు మించి అనే స్థాయిలో అదే క్రేజ్‌తో దూసుకెళ్తోంది.
ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
'శివ' రీ రిలీజ్‌లో ఫస్ట్ డే కలెక్షన్స్ అదరగొట్టాయి. తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ.2.5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ టీం అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ సైతం రిలీజ్ చేసింది. ఈ వారం 'కాంత' మూవీ తప్ప వేరే ఏ ఇతర సినిమాలు రాలేదు. ఇదే 'శివ'కు బాగా కలిసొచ్చిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక వీకెండ్‌లోనూ అంతే క్రేజ్ రావడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read : GlobeTrotter ఈవెంట్ - టైటిల్, మహేష్ ఫస్ట్ లుక్‌తో పాటు సర్‌ప్రైజ్ ఇదే... రాజమౌళి అఫీషియల్ అనౌన్స్‌మెంట్
అప్పటితో పోలిస్తే...
1989 డిసెంబరులో 'శివ' మూవీ రిలీజ్ కాగా అప్పట్లో సంచలనం సృష్టించింది. రూ.కోటి బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ దాదాపు రూ.4 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టింది. అప్పటి లెక్కల ప్రకారం ఇది చాలా ఎక్కువ. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ అనే చెప్పాలి. ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న క్రమంలో మళ్లీ ఈ కల్ట్ క్లాసిక్ రిలీజ్ చేయాలని ఆర్జీవీ భావించారు. దాదాపు రూ.2 కోట్లు పెట్టి ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్లుగా 4K, డాల్బీ సౌండ్‌తో మళ్లీ రీ రిలీజ్ చేశారు.
గత కొద్ది నెలలుగా ఈ మూవీ కోసం నాగ్ దగ్గర నుంచీ రామ్ గోపాాల్ వర్మ వరకూ అందరూ విస్తృతంగా ప్రచారం చేశారు. విస్తృతంగా ఇంటర్వ్యూలు చేశారు. టాలీవుడ్ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి నుంచి టాప్ హీరోస్ వరకూ అందరూ సోషల్ మీడియా వేదికగా 'శివ' రీ రిలీజ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. శుక్రవారం మళ్లీ రిలీజ్ అయిన మూవీ అంతే క్రేజ్‌తో దూసుకెళ్తోంది.





















