అన్వేషించండి

Nagarjuna : మరో డెబ్యూ డైరెక్టర్​కి నాగార్జున గ్రీన్ సిగ్నల్ - కొత్త సినిమాపై ఆసక్తికర అప్డేట్!

Nagarjuna : 'నా సామి రంగ' తో కొరియోగ్రాఫర్ విజయ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తున్న నాగార్జున తన తదుపరి చిత్రాన్ని సుబ్బు అనే కొత్త దర్శకుడితో చేస్తున్నట్లు తెలుస్తోంది.

Nagarjuna Locks Yet Another Debut Director : సినీ ఇండస్ట్రీకి కొత్త దర్శకులను పరిచయం చేయాలన్నా, సినిమా కోసం ప్రయోగాలు చేయాలన్నా కొందరు హీరోలు మాత్రమే ఇందుకు ఆసక్తి చూపుతుంటారు. మన టాలీవుడ్ లో చూసుకుంటే కింగ్ నాగార్జున ఈ విషయంలో ముందు వరుసలో ఉంటారు. ఆయన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎంతోమంది కొత్త దర్శకులను పరిచయం చేశారు. శివ, మాస్, అన్నమయ్య, శ్రీరామదాసు వంటి సినిమాలతో సరికొత్త ప్రయోగాలు కూడా చేశారు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, త్వరలోనే నాగార్జున మరో కొత్త దర్శకుడిని వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. ఇంతకీ ఆ డెబ్యూ డైరెక్టర్ ఎవరు? డీటెయిల్స్ లోకి వెళ్తే..

నాగార్జున త్వరలోనే 'నా సామిరంగ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకి ఆరెంగేట్రం చేస్తున్నాడు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శనివారమే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత మరో కొత్త దర్శకుడుతో సరికొత్త కాన్సెప్ట్ తో సినిమా చేయబోతున్నారట నాగార్జున. సుబ్బు అనే నూతన దర్శకుడు చెప్పిన కథ నాగార్జునకు చాలా బాగా నచ్చిందట. కాకపోతే కథలో చిన్న చిన్న మార్పులు చేయమని సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే డైరెక్టర్ సుబ్బు ఫైనల్ స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఫైనల్ నెరేషన్ పూర్తయ్యాకే సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు ఫిలిం సర్కిల్స్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. పలు యదార్థ సంఘటనల ఆధారంగా సమకాలిన సామాజిక అంశాలతో ఈ సినిమా ఉంటుందట. అంతేకాదు కోర్ట్ రూమ్ బ్యాక్ డ్రాప్ తో ఎమోషనల్ డ్రామాగా సాగనున్న ఈ సినిమాలో నాగార్జున లాయర్ పాత్రలో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత  నాగార్జున లాయర్ పాత్ర పోషిస్తుండడం విశేషం. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇక 'నా సామిరంగ' విషయానికొస్తే.. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'పురింజు మరియమ్ జోస్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు. శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస్ ఈ సినిమాని సుమారు రూ.45 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆశికా రంగనాథ్, మిర్నా, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. జనవరి 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : బాబు కోసం ఇంటర్నేషనల్ బ్యూటీని సెట్ చేస్తున్న జక్కన్న.. ప్లాన్ మాములుగా లేదుగా!

టాప్ హెడ్ లైన్స్

Spy Thirller OTT : నెల రోజుల్లోపే ఓటీటీలోకి కార్తి స్పై థ్రిల్లర్ - బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ సీక్వెల్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
నెల రోజుల్లోపే ఓటీటీలోకి కార్తి స్పై థ్రిల్లర్ - బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ సీక్వెల్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Aadarsha Kutumbam Narayanamma Song : ఎంత ట్రెండ్ అవుతుందో నారాయణమ్మా - ముగ్గురు బ్యూటీస్‌తో వెంకీ స్టెప్పులు... హుషారెత్తించే లిరిక్స్
ఎంత ట్రెండ్ అవుతుందో నారాయణమ్మా - ముగ్గురు బ్యూటీస్‌తో వెంకీ స్టెప్పులు... హుషారెత్తించే లిరిక్స్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Taapsee Pannu : 13 ఏళ్లుగా డేటింగ్... అది పూర్తిగా నా ఛాయిస్ - లవ్ మ్యారేజ్‌పై తాప్సీ పన్ను రియాక్షన్
13 ఏళ్లుగా డేటింగ్... అది పూర్తిగా నా ఛాయిస్ - లవ్ మ్యారేజ్‌పై తాప్సీ పన్ను రియాక్షన్

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
Virat Kohli Mastery Beyond Numbers: సచిన్ కంటే వేగంగా 15 వేల ర‌న్స్ మైలురాయిని దాటిన కోహ్లీ.. 74 ఇన్నింగ్స్‌ల భారీ తేడాతో పూర్తి..
సచిన్ కంటే వేగంగా 15 వేల ర‌న్స్ మైలురాయిని దాటిన కోహ్లీ.. 74 ఇన్నింగ్స్‌ల భారీ తేడాతో పూర్తి..
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
YS Jagan double stand: వైఎస్ జగన్ డబుల్ గేమ్ పాలిటిక్స్ - జాతీయ స్థాయిలో మండిపడుతున్న విపక్షాలు.. స్టాండ్ లేని రాజకీయాలా?
వైఎస్ జగన్ డబుల్ గేమ్ పాలిటిక్స్ - జాతీయ స్థాయిలో మండిపడుతున్న విపక్షాలు.. స్టాండ్ లేని రాజకీయాలా?
Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
Embed widget