The Ghost: ‘ఘోస్ట్’గా నాగార్జున.. అదిరిపోయిన ఫస్ట్ లుక్ పోస్టర్, రివీల్ చేసిన కాజల్
ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా సిద్ధమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను హీరోయిన్ కాజల్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి ది ఘోస్ట్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
అక్కినేని నాగార్జున 62వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు శుభవార్త. ప్రస్తుతం ఆయన నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ప్రస్తుతం నాగ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో నాగ్ ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా సిద్ధమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను హీరోయిన్ కాజల్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి ది ఘోస్ట్ అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. ఇందులో నాగార్జున లుక్ భిన్నంగా ఉంది.
వర్షంలో నెత్తురులో తడిసిన పొడవాటి ఖడ్గంతో చంపేందుకు వస్తున్న నాగ్‌ని చూసి పలువురు భయపడుతున్నారు. కొందరు మోకరిల్లగా.. మరికొందరు మృత్యు భయంతో చూస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తే విదేశీ నేపథ్యం ఉన్నట్లు కనిపిస్తోంది. మోషన్ పోస్టర్ ద్వారా నాగ్ క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉందో అర్థమవుతోంది. ‘‘మీరు అతణ్ని చంపలేరు.. అతడి నుంచి తప్పించుకోలేరు.. అతడి ముందు మోకరిల్లాల్సిందే’’ అంటూ మోషన్ పోస్టర్‌లో చూపించారు.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నారాయణ్ దాస్ కే నారంగ్, పుష్కర్ రామ్ మోహన్, శరత్ మరార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కరోనా వలన కొద్ది నెలలు ఆగింది. ఇటీవల తిరిగి మళ్లీ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు.
విలక్షణ చిత్రాల దర్శకుడిగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు పేరు తెచ్చుకున్నారు. ఎల్‌బీడబ్ల్యూ, రోటీన్ లవ్ స్టోరీ, చందమామ కథలు, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. లెవెన్త్ అవర్ అనే వెబ్ సిరీస్ కూడా తీస్తున్నారు. ఈయన సినిమాలన్నీ వేర్వేరు జోనర్లలో రూపొందినవే. గరుడ వేగ చిత్రంతో అప్పటిదాకా ప్లాపుల్లోనే ఉన్న డాక్టర్ రాజశేఖర్‌కు ఎన్నో ఏళ్ల తర్వాత హిట్ అందించారు.
మరోవైపు, నాగార్జున కెరీర్‌లో సోగ్గాడే చిన్నినాయన చిత్రం తర్వాత ఆ స్థాయి హిట్ మళ్లీ రాలేదు. ఇటీవలి చిత్రాలన్నీ ఆశించినంతగా ఆడలేదు. దీంతో ది ఘోస్ట్ సినిమాపై ఆసక్తి నెలకొంది.
NAGARJUNA: NEW FILM TITLED 'THE GHOST'... On Nagarjuna's birthday today, here's the #FirstLook of his new #Telugu film #TheGhost... Costars #KajalAggarwal... Directed by Praveen Sattaru... Produced by Narayan Das K Narang, Puskur Ram Mohan Rao and Sharrath Marar. #GhostFirstLook pic.twitter.com/Z4a0O48EG6
— taran adarsh (@taran_adarsh) August 29, 2021
A Powerful Friend ! A Fearful Foe !!
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) August 29, 2021
The Ghost stands supreme !!!
Here’s the High Octane Motion Poster of #TheGHOST🔥#GhostFirstLook 🗡#HBDKingNagarjuna❤️@iamnagarjuna @PraveenSattaru @MsKajalAggarwal #NarayanDasNarang #RamMohanRao @SVCLLP @nseplofficial pic.twitter.com/OPolGWKZy9