Akhil Akkineni Wedding: అఖిల్ పెళ్లికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన నాగార్జున, అమల దంపతులు
Nagarjuna - Revanth Reddy: తమ కుమారుడు అఖిల్ అక్కినేని వివాహానికి తప్పకుండా హాజరు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అక్కినేని నాగార్జున అమల దంపతులు శుభలేఖ ఇచ్చారు.

అక్కినేని ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఏఎన్ఆర్ మనవడు, కింగ్ అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని పెళ్లి పనులు జోరుగా, హుషారుగా సాగుతున్నాయి. రాజకీయ సినిమా ప్రముఖులకు నాగర్జున - అమల దంపతులు స్వయంగా శుభలేఖలు అందజేస్తున్నారు.
రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన నాగార్జున
జూన్ 6వ తేదీన అఖిల్ అక్కినేని వివాహం జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోలో పలువురు రాజకీయ సినీ ప్రముఖులతో పాటు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులు మధ్య ఘనంగా పెళ్లి వేడుక చేసేందుకు అక్కినేని కుటుంబం సిద్ధమైంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ఈ రోజు (మే 31న) శనివారం ఉదయం నాగార్జున, అమల దంపతులు కలిశారు. అఖిల్ వివాహానికి తప్పకుండా హాజరు కావాలని ఆహ్వానించారు. హైదరాబాద్ సిటీలో వివాహం జరుగుతుంది కనుక రేవంత్ రెడ్డి హాజరు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
Also Read: మనోజ్ మనుషుల పనే... 'కన్నప్ప' హార్డ్ డిస్క్ చోరీలో తమ్ముడిపై విష్ణు మంచు అనుమానం
తెలంగాణ సీఎం #RevanthReddy ని కలిసి #Akhil వివాహ ఆహ్వాన పత్రికను అందించిన #Nagarjuna దంపతులు pic.twitter.com/AHf7WbuLc1
— Ramesh Pammy (@rameshpammy) May 31, 2025
జైనాబ్ మెడలో అఖిల్ మూడు ముళ్ళు
అఖిల్ పెళ్లి చేసుకోబోయే మహిళ పేరు జైనాబ్. ఆవిడ ఒక ఆర్టిస్ట్. పెయింటింగ్స్ వంటివి వేస్తుంటారు. స్టేజి షోలు (నాటకాలు) చేసిన అనుభవం కూడా ఉందిలే సమాచారం. ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అరబ్ దేశాలలో ఆంధ్రప్రదేశ్ రాయబారిగా జైనాబ్ తండ్రి బాధ్యతలు నిర్వర్తించినట్లు సమాచారం. ఆయనతో అక్కినేని నాగార్జునకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. రేవంత్ రెడ్డిని ఆహ్వానించడానికి నాగార్జున, అమల దంపతుల వెంట కాబోయే వియ్యంకులు కూడా ఉన్నారు.
View this post on Instagram
ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడం, కామన్ ఫ్రెండ్ ద్వారా జరిగిన పరిచయం అఖిల్ జాయిన్ అవు మధ్య ప్రేమకు దారి తీసిందని తెలిసింది. వీళ్ళిద్దరి పెళ్ళికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశం ఉంది.





















