By: Suresh Chelluboyina | Updated at : 13 Mar 2023 09:29 PM (IST)
Junglee Music Telugu/YouTube
అక్కినేని నాగ చైతన్య హీరోగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న సినిమా 'కస్టడీ'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్ధమైంది. చైతన్యకు ఇది తొలి స్ట్రయిట్ తమిళ చిత్రం. ఇటీవలే ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులోని యాక్షన్ సీన్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో చైతన్య సోమవారం మరో అప్‌డేట్ ఇచ్చాడు. అయితే, దీనికి ముందు చైతూ తన సోషల్ మీడియా అకౌంట్లలో బ్లూ కలర్‌లో ఉన్న తన ఫొటోలను అప్‌లోడ్ చేశాడు. దీంతో ఆయన అభిమానులు.. ప్రొఫైల్ పిక్ ఎందుకు ఆ కలర్‌లో ఉందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందుకు సమాధానంగా చైతూ.. టీజర్ టీజ్‌ను వదిలారు.
Hahaha not sinking brother .. just syncing with our film #Custody at 6:49pm today everyone will know :) https://t.co/j5Qm921BOR
— chaitanya akkineni (@chay_akkineni) March 13, 2023
ఇదేంటీ టీజ్? అని అనుకుంటున్నారా? అదేనండీ.. టీజర్ రిలీజ్ తేదీన ప్రకటించే వీడియోనే చైతూ.. ‘టీజ్’ అని పిలిచాడు. కట్ చేస్తే.. ఓ పెద్ద నది, ఆ నది అడుగుకు వెళ్లిన తర్వాత అందులో ఒక లాకప్ తరహా బాక్సు ఉంటుంది. అందులో బంధీగా ఉన్న చైతూ.. దాని నుంచి బయటకు వస్తాడు. ఇక వెయింట్ చేయక్కర్లేదంటూ టీజర్ తేదీని ప్రకటించారు. ‘కస్టడీ’ టీజర్‌ను మార్చి 16న విడుదల చేయనున్నట్లు ఈ టీజర్ టీజ్ ద్వారా వెల్లడించారు.
‘కస్టడీ’లో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారు. సినిమాలో ఆయన పేరు A.చైతన్య. A అంటే అక్కినేని అయ్యి ఉంటుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... తోటి అధికారులు ఆయన్ను కదలకుండా తమ చేతుల్లో ఎందుకు బంధించారనేది సస్పెన్స్. సాధారణంగా పోలీసులు ఖైదీలను కస్టడీలోకి తీసుకుంటారు. అయితే, ఇక్కడ పోలీస్ ఆఫీసర్‌నే తోటి సిబ్బంది ఎందుకు కస్టడీలోకి తీసుకుంటారనేది వెండి తెరపైనే చూడాలి.
This is just a tease not the teaser, there’s more to come!!
— chaitanya akkineni (@chay_akkineni) March 13, 2023
The HUNT will begin on 16th March at 4:51PM! 🔥
▶️ https://t.co/08V13JgM1E #Custody #CustodyOnMay12@vp_offl @IamKrithiShetty @thearvindswami @ilaiyaraaja @thisisysr @srinivasaaoffl @realsarathkumar @SS_Screens
నాగ చైతన్య, వెంకట్ ప్రభు కలయికలో సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రమిది. మే 22న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. నాగ చైతన్యకు జోడీగా ఈ సినిమాలో కృతి శెట్టి (Krithi Shetty) నటిస్తున్నారు. ఈ ఇద్దరిదీ సూపర్ హిట్ జోడీ. వీళ్ళిద్దరూ సూపర్ హిట్ సినిమా 'బంగార్రాజు'లో సందడి చేశారు. ప్రేక్షకులు, ముఖ్యంగా అక్కినేని అభిమానులకు ఈ వీడియో బాగా నచ్చింది. 'తడాఖా' సినిమాలో నాగ చైతన్య కొన్ని సన్నివేశాల్లో పోలీసుగా కనిపిస్తారు. కానీ, పోలీస్ కాదు. అసలు పోలీస్ సునీల్.
Also Read : ఆస్కార్ గొడవ - ఎన్టీఆర్ ఫోటో మాత్రమే ఎందుకు, రామ్ చరణ్ ఎక్కడ? మెగా ఫ్యాన్స్ ఫైర్
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Robert Downey Jr: ఆ హీరో నమిలేసిన చూయింగ్ గమ్ రూ. 45 లక్షలా? ఏం చేసుకుంటారు నాయనా?
Balagam Censored Dialogue: సెన్సార్‌కు ముందు, సెన్సార్ తర్వాత - ‘బలగం’లోని ఆ డైలాగ్ లీక్ చేసిన ప్రియదర్శి
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?
Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్