(Source: ECI/ABP News/ABP Majha)
Naga Chaitanya : సమంత - విడాకులు - బోర్ కొట్టిందటున్న నాగ చైతన్య!
అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుని పది నెలలు కావొస్తుంది. ఏయే కారణాలతో వేరు పడ్డారనేది తెలియదు. ఇప్పటికీ వాళ్ళ డివోర్స్ హాట్ టాపిక్.
'లాల్ సింగ్ చడ్డా' (Laal Singh Chaddha) తో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) హిందీ చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించిన ఆ సినిమాలో బాలరాజు అనే కీలక పాత్రలో ఆయన నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రచారం కోసం ముంబై వెళ్లిన చైతూను సినిమా గురించి కంటే సమంత (Samantha Ruth Prabhu) తో విడాకుల గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు. దాంతో అక్కినేని హీరోకి విసుగు వచ్చింది.
సాధారణంగా వ్యక్తిగత జీవితం గురించి నాగ చైతన్య ఎక్కువ మాట్లాడరు. కానీ, ఈ సారి అలా కాకుండా ఓపెన్ గా విడాకుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు.
సమంతపై గౌరవం ఉంది : చైతూ
విడాకుల తర్వాత మీరు - సమంత ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నారని నాగ చైతన్యను ముంబైలో ఒక మీడియా సంస్థ అనగా... ''మేమిద్దరం విడాకుల గురించి ప్రకటించాం. మా స్టేట్మెంట్స్ పోస్ట్ చేశాం. మా ఇద్దరికీ ఒకరు అంటే మరొకరికి గౌరవం ఉంది. మా గురించి చెప్పాలంటే అంతే! మేం చెప్పాల్సింది చెప్పేశాం. ప్రజలు ఏదేదో అనుకుంటున్నారు, కాలమ్స్ ఫిల్ చేసుకుంటున్నారు కానీ... నిజంగా ఏమీ లేదు. అవి చూసి నాకు బోర్ కొట్టింది. విడాకుల తర్వాత నా సినిమాలు మూడు విడుదల అయ్యాయి. ఇప్పటికీ... ఆ విషయంతో ముడి పెడుతున్నారు'' అని సమాధానం ఇచ్చారు.
సమంతతో వేరు పడి పది నెలలు!
గత ఏడాది అక్టోబర్ 2న నాగ చైతన్య, సమంత వేరు పడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ''దశాబ్ద కాలంగా మా మధ చక్కటి స్నేహం ఉండటం అదృష్టంగా భావిస్తున్నాం. మా మధ్య బంధం ఎప్పుడూ ప్రత్యేకం అని మేం నమ్ముతున్నాం. మాకు ప్రైవసీ ఇవ్వాలని కోరుతున్నాం'' అని విడాకుల విషయాన్ని ట్వీట్ చేశారు.
Also Read : ‘బింబిసార’ రివ్యూ: మద గజ మహా చక్రవర్తిగా నందమూరి కళ్యాణ్ రామ్ మెప్పించారా? లేదా?
భర్త కాదు... మాజీ భర్త! : సమంత
విడాకుల తర్వాత తనపై వచ్చిన ట్రోల్స్, విమర్శలకు గతంలో సమంత ఘాటుగా సమాధానాలు ఇచ్చారు. అయితే... ఇటీవల 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో మరో సారి డివోర్స్ టాపిక్ వచ్చింది. అప్పుడు నాగ చైతన్యను కరణ్ జోహార్ భర్త అని సంభోదించగా... ''భర్త కాదు, మాజీ భర్త'' అని సమంత కరెక్ట్ చేశారు. ప్రస్తుతం నాగ చైతన్యతో తన రిలేషన్షిప్ గురించి సమంత ఆ కార్యక్రమంలో ''ఒకవేళ మా ఇద్దర్నీ ఒకే గదిలో ఉంచారనుకోండి... మీరు షార్ప్ ఆబ్జెక్ట్స్ (కత్తులు వంటివి) దాచేయాలి. ప్రస్తుతానికి అయితే అంతే! మా మధ్య అంత స్నేహపూర్వక సంబంధాలు లేవు. భవిష్యత్తులో, కొన్నాళ్ల తర్వాత అయితే పరిస్థితి స్నేహపూర్వకంగా ఉంటుందేమో'' అని సమంత చెప్పారు.