News
News
X

Kiran Abbavaram Meter Teaser: కిరణ్ అబ్బవరం ‘మీటర్’ టీజర్ - పొగరుతో నడిచే మాస్ మీటర్, తొక్కుకుంటూ పోవడమే!

కిరణ్ అబ్బవరం హీరోగా రమేష్ కాదూరి దర్శకత్వంలో రూపొందిన ‘మీటర్’ సినిమా టీజర్ ను విడుదల చేయడం జరిగింది. సినిమాలో కిరణ్ అబ్బవరం పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని టీజర్ ను చూస్తే క్లారిటీ వచ్చింది.

FOLLOW US: 
Share:
ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం ఎక్కువ గ్యాప్‌ తీసుకోకుండా మరో సినిమా 'మీటర్‌'తో  వచ్చేందుకు రెడీ అయ్యాడు. రమేష్ కాదూరి దర్శకత్వంలో రూపొందిన ‘మీటర్‌’ సినిమా టీజర్‌ ను మంగళవారం విడుదల చేశారు. ఈ టీజర్‌ ను చూస్తుంటే సినిమాలో కిరణ్ అబ్బవరం పాత్ర ఒక బాధ్యతలేని పోలీస్ ఆఫీసర్‌ అని తెలుస్తోంది. డ్యూటీ పై ఆసక్తి లేకుండా, డ్యూటీని చేయాలని లేకున్నా చేస్తున్నట్లు కనిపిస్తున్న హీరో చుట్టూ తిరిగే కథతో ‘మీటర్’ సినిమా రూపొందినట్లుగా తెలుస్తోంది. ఈ టీజర్‌ లో కిరణ్ అబ్బవరం పాత్ర సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏప్రిల్‌ 7న విడుదల కాబోతున్న 'మీటర్‌' సినిమా టీజర్‌ విడుదల అయ్యింది.. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుందో చూడాలి. 
 
తన గత చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌ లో చేసిన విషయం తెల్సిందే. అల్లు అరవింద్‌ ఆ సినిమాను సమర్పించడంతో మంచి స్పందన లభించింది. ఇప్పుడు ‘మీటర్’ సినిమాను కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు క్లాప్ ఎంటర్‌టైన్మెంట్‌ తో కలిసి నిర్మించడం జరిగింది. కథా బలం ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుని నిర్మించే మైత్రి మూవీ మేకర్స్ వారి బ్యానర్‌ లో కిరణ్ అబ్బవరం ‘మీటర్’ సినిమా వస్తున్న కారణంగా కచ్చితంగా మినిమంగా ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు. ‘మీటర్‌’ సినిమా టీజర్ విడుదలతో చిన్న సినిమా అనే అభిప్రాయం తొలగిపోయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

కిరణ్ అబ్బవరం ఆశలు ‘మీటర్’ పైనే..

కిరణ్ అబ్బవరం కెరియర్‌ ఆరంభం నుంచి కూడా విభిన్నమైన కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. గత ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్‌ అబ్బవరం కమర్షియల్‌ గా భారీ విజయాలను మాత్రం సొంతం చేసుకోలేక పోయాడు. గత నెలలో విడుదలైన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా కమర్షియల్ గా పెద్ద విజయాన్ని నమోదు చేయలేక పోయింది. అందుకే మీటర్ పై కిరణ్ అబ్బవరం ఆశలు కాస్త ఎక్కువగానే పెట్టుకుని ఉంటాడు. ఆ మధ్య తనను ఇబ్బంది పెట్టేందుకు సోషల్‌ మీడియా ద్వారా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో కిరణ్‌ అబ్బవరం వార్తల్లో నిలిచారు. అయితే సోషల్‌ మీడియాలో పలువురు కిరణ్ అబ్బవరంను ఇబ్బంది పెట్టే అవసరం.. అవకాశం ఎవరికి ఉందంటూ కొట్టి పారేశారు. సినిమాల పబ్లిసిటీని తానే స్వయంగా చూసుకునే కిరణ్ అబ్బవరం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటాడు. 
 
టీజర్‌ విడుదల తర్వాత 'మీటర్' పై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వారు తమ పరిచయాలతో భారీగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ‘మీటర్‌’ తో కిరణ్‌ అబ్బవరం కెరీర్‌ బెస్ట్‌ ఓపెనింగ్స్ నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Published at : 07 Mar 2023 08:13 PM (IST) Tags: Kiran Abbavaram Meter Teaser Meter Movie Teaser

సంబంధిత కథనాలు

RC15 Welcome: రామ్ చరణ్‌కు RC15 టీమ్ సర్‌ప్రైజ్ - ‘నాటు నాటు’తో ప్రభుదేవ బృందం ఘన స్వాగతం

RC15 Welcome: రామ్ చరణ్‌కు RC15 టీమ్ సర్‌ప్రైజ్ - ‘నాటు నాటు’తో ప్రభుదేవ బృందం ఘన స్వాగతం

Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?

Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?

Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!

Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!

Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!

Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!

Ameer Sultan on Rajinikanth: రజినీకాంత్‌కు అసలు ఆ అర్హత ఉందా? తమిళ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

Ameer Sultan on Rajinikanth: రజినీకాంత్‌కు అసలు ఆ అర్హత ఉందా? తమిళ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా