అన్వేషించండి

Music Director Radhan: ఆ కారణంతోనే ‘అర్జున్ రెడ్డి’ త‌ర్వాత సందీప్‌ రెడ్డి వంగాతో పనిచేయలేదు: సంగీత దర్శకుడు రధన్

Music Director Radhan: 'అర్జున్ రెడ్డి' బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సినిమా. సందీప్ రెడ్డి వంగ‌, విజ‌య దేవ‌ర‌కొండ పేరు మారుమోగేలా చేసిని సినిమా. ఇక ఆ సినిమాలో మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటుంది.

Music Director Radhan: 'అర్జున్ రెడ్డి'.. తెలుగులో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్. డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగ‌, హీరో విజ‌య దేవ‌ర‌కొండ పేరు మారుమోగేలా చేసింది ఈసినిమా. యూత్ బాగా క‌నెక్ట్ అయ్యారు ఈ సినిమాకి. ఇక సినిమాలో మ్యూజిక్ కూడా సూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. పాట‌లు యువ‌త‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. అయితే, ‘అర్జున్ రెడ్డి’ సినిమా త‌ర్వాత సందీప్ రెడ్డి వంగ‌తో క‌లిసి ప‌ని చేయ‌లేదు మ్యూజిక్ డైరెక్ట‌ర్ రధన్. దీనిపై క్లారిటీ ఇస్తూ ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రధన్ పై సిదార్థ రాయ్ డైరెక్ట‌ర్ కామెంట్స్ చేయ‌డంతో ఇప్పుడు సందీప్ రెడ్డి, రధన్ ల ఇంట‌ర్వ్యూలు ఒక్క‌సారిగా ట్రెండింగ్ లోకి వ‌చ్చాయి సోష‌ల్ మీడియాలో. 

ఎందుకు చేయ‌లేదు అంటే? 

‘అందాల రాక్ష‌సి’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ రధన్. ఆయ‌న చేసిన ప్ర‌తి సినిమాలోని మ్యూజిక్ సూప‌ర్ హిట్. పాట‌లు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఎందుకు పెద్ద‌గా ఛాన్సులు రాలేదు అనే ప్ర‌శ్న‌కి ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. “అందాల రాక్ష‌సి.. చాలా పెద్ద హిట్ సినిమా. ఆ త‌ర్వాత ఛాన్సులు వ‌స్తాయి అనుకున్న‌. కానీ, అనుకోకుండా అమ్మకి బ్రెయిన్ ట్యూమర్ వ‌ల్ల ఆమెను చూసుకుంటూ ఉండిపోయాను. అప్పుడు అశ్వినీ ద‌త్ గారు ఫోన్ చేసి ఒక మంచి సినిమాకి వ‌ర్క్ చేసే ఛాన్స్ ఇచ్చారు. అదే 'ఎవ‌డే సుబ్ర‌హ్మణ్యం'.

ఆ త‌ర్వాత 'రాధ‌', 'మ‌న‌సుకు న‌చ్చింది', 'అర్జున్ రెడ్డి' లాంటి సినిమాలు వ‌చ్చాయి. ఒక సినిమాని బిజినెస్ లాగా చూడ‌ను. ఒకేసారి నాలుగు సినిమాలు అలా చేయ‌ను. త‌మిళ్ లో, తెలుగులో ప్యార్ల‌ల్ గా చేశాను. పెద్ద హీరోల‌కు చేయాల‌ని ఉంది. కానీ, ఛాన్స్ లు రాలేదు. 'అర్జున్ రెడ్డి' వ‌చ్చిన‌ప్పుడు సందీప్ గారు కొత్త డైరెక్ట‌ర్. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌న్ను ఆయ‌న‌కు ప‌రిచ‌యం చేశారు. 'అర్జున్ రెడ్డి' అయిపోయిన త‌ర్వాత‌.. ‘హుషారు’ చేశాను. క‌రోనా వ‌ల్ల బ్రేక్ వ‌చ్చింది. చాలా లాంగ్ షెడ్యూల్స్ ఉండ‌టం వ‌ల్ల వేరే సినిమా ఒప్పుకోలేదు. ఒకేసారి నేను నాలుగు సినిమాలు చేయ‌గ‌ల‌ను. కానీ, అలా అవ్వ‌ద్దు. 'అర్జున్ రెడ్డి' త‌మిళ్ లో కూడా హిట్ అయ్యింది. మూడుసార్లు మ్యూజిక్ కంపోజ్ చేశాను. త‌మిళ్ లో సినిమా చేస్తున్న టైంలోనే హిందీలో సందీప్ రెడ్డి ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తీస్తున్నారు. హిందీ ప్రేక్ష‌కుల కోసం కొత్త‌గా కంపోజ్ చేయించాల‌నే ఉద్దేశంతో నాకు హిందీ ‘అర్జున్ రెడ్డి’లో అవ‌కాశం ఇవ్వ‌లేదు” అని మ్యూజిక్ డైరెక్ట‌ర్ రధన్ క్లారిటీ ఇచ్చారు. 

కాంట్ర‌వ‌ర్సీలో రధన్.. 

ఇది ఇలా ఉంటే మ్యూజిక్ డైరెక్ట‌ర్ రధన్ పై సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. 'సిదార్థ రాయ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్ట‌ర్ య‌శ‌శ్వి.. రధన్ గురించి కామెంట్స్ చేయ‌డంతో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ పాత కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. 'అర్జున్ రెడ్డి' సినిమా టైంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ రధన్ త‌న‌ను చాలా ఇబ్బంది పెట్టాడ‌ని, క‌ష్ట‌ప‌డి, బ‌తిమ‌లాడుకుని మ్యూజిక్ డైరెక్ష‌న్ చేయించుకున్నాన‌ని చెప్పారు సందీప్ రెడ్డి. 

ఇక ‘సిదార్థ రాయ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్ట‌ర్ య‌శ‌శ్వి కూడా రధన్ పై అలాంటి కామెంట్సే చేశారు. ఆయ‌న‌తో మాట్లాడ‌టం అంటే కొట్లాడ‌ట‌మే అని, చాలా ఇబ్బందులు పెట్టాడ‌ని, ఆయ‌న వ‌ల్లే సినిమా డిలే అయ్యింది అంటూ కామెంట్స్ చేశారు య‌శ‌శ్వి. చెన్నైలో ఉన్నాడు కాబ‌ట్టి బ‌తికిపోయే వాడ‌ని, లేకుంటే క‌చ్చితంగా గొడ‌వ‌లు అయిపోయేవ‌ని అన్నారు. 

Also Read: వ్యూహం మళ్లీ వాయిదా - కానీ, ఈసారి లోకేష్‌ కారణం కాదు..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Embed widget