అన్వేషించండి

Mukesh Khanna: ఒడిశా, బీహారీలకు అర్థం కాదు - ‘కల్కి 2898 ఏడీ’పై ముఖేశ్ ఖన్నా విమర్శలు, తిట్టిపోస్తున్న జనం

Mukesh Khanna: నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’పై సీనియర్ నటుడు ముఖేశ్ ఖన్నా చేసిన నెగిటివ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mukesh Khanna About Kalki 2898 AD: ప్రస్తుతం సినీ సర్కిల్లో ఎక్కడ చూసినా ‘కల్కి 2898 ఏడీ’ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. మూవీ విడుదలయ్యి దాదాపు రెండు వారాలు అవుతున్నా ఇంకా పలు థియేటర్లలో హౌజ్‌ఫుల్ షోలు రన్ అవ్వడం విశేషం. అయితే తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే మిగతా రాష్ట్రాల్లో ‘కల్కి 2898 ఏడీ’ క్రేజ్ చాలావరకు తగ్గిపోయింది. తాజాగా ముఖేశ్ ఖన్నా.. ఈ సినిమాపై ప్రత్యేకంగా రివ్యూ ఇచ్చారు. కానీ ఈ రివ్యూ ఫ్యాన్స్‌కు అంతగా నచ్చినట్టుగా లేదు. దీంతో ముఖేశ్ ఖన్నాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.

పర్ఫార్మెన్స్‌కు మార్కులు..

బీఆర్ తెరకెక్కించిన ‘మహాభారత్’ అనే టీవీ సీరియల్‌లో భీష్ముడి పాత్రలో నటించి ఇప్పటికీ అదే పాత్రతో అందరికీ గుర్తుండిపోయారు నటుడు ముఖేశ్ ఖన్నా. ప్రస్తుతం ఆయన సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అందులోనే వీడియోలతో బిజీ అయిపోయారు. తాజాగా ఆయన యూట్యూబ్‌లో విడుదల చేసిన వీడియోలో నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’పై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ వీడియోలో ఈ సినిమాలో ప్రతీ ఒక్కరి పర్ఫార్మెన్స్‌లకు, అది తెరకెక్కించిన రేంజ్‌కు నూటికి నూరు మార్కులు ఇస్తానని తెలిపారు నాగ్ అశ్విన్. కానీ అది కేవలం వెస్ట్ ఆడియన్స్‌కు మాత్రమే నచ్చేలా ఉందని, బిహార్, ఒడిశాలోని ప్రేక్షకులకు మూవీ అంతగా నచ్చకపోవచ్చని వ్యాఖ్యలు చేశారు ముఖేశ్ ఖన్నా.

అర్థం కాదు..

‘‘ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ తెలివితేటలతో తెరకెక్కింది. ఇక్కడ ఉన్న ప్రేక్షకుల కంటే హాలీవుడ్‌లో ప్రేక్షకులు తెలివైనవారు. ఇలా చెప్తున్నందుకు నన్ను క్షమించండి. కానీ ఒడిశా, బిహార్‌లాంటి ప్రాంతాల్లో ప్రేక్షకులకు ఇలాంటి ఫిల్మ్ మేకింగ్ అర్థం కాదు’’ అని ‘కల్కి 2898 ఏడీ’ గురించి స్టేట్‌మెంట్ ఇచ్చారు ముఖేశ్ ఖన్నా. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ స్టేట్‌మెంట్ వైరల్ అయ్యింది. ఈ కామెంట్‌ను తాము ఒప్పుకోము అంటూ ప్రభాస్ ఫ్యాన్స్.. దీనిని ఖండిస్తున్నారు. మహాభారతం లాంటి కథను వేరే విధంగా చూపించినందుకు నాగ్ అశ్విన్‌ను సైతం విమర్శించారు ముఖేశ్. కథను మార్చేస్తూ దర్శకుడు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకున్నాడని అన్నారు.

అసలు కథ ఇది..

‘‘కల్కి 2898 ఏడీలో చూపించినట్టుగా మహాభారతంలో అశ్వద్ధాముడి మణిని కృష్ణుడు ఎప్పుడూ తీసేయలేదు. వ్యాసుడి కంటే మీకు ఎక్కువ తెలుసా అని మేకర్స్‌ను అడగాలని ఉంది. అశ్వద్ధాముడి మణిని కృష్ణుడి తీసేయలేదు. నా చిన్నప్పటి నుండి నేను మహాభారతం చదువుతున్నాను. తన అయిదుగురి పిల్లలను చంపేయడంతో అశ్వద్ధాముడి మణిని తీసేయమని ద్రౌపది ఆదేశించింది. ఈ కథను మార్చడానికి మీరు తీసుకున్న స్వేచ్ఛను క్షమించలేం. సౌత్ ఫిల్మ్‌మేకర్స్‌కు మన సంస్కృతి అంటే ఎక్కువ గౌరవం అని అంటుంటారు. కానీ ఇక్కడ ఏం జరిగింది?’’ అని చెప్తూ.. ఇలాంటి సినిమాను రివ్యూ చేయడానికి స్పెషల్ కమిటీని ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని కోరారు ముఖేశ్ ఖన్నా.

Also Read: అలా చేయడం మంచిదేనంటూ ప్రశాంత్ వర్మ ట్వీట్ - రణవీర్ కోసమేనా? అంటూ నెటిజన్లు సందేహం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget